• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోడి కోసం వెళ్లి చిరుత బోనులో చిక్కాడు

    యూపీలోని బులంద్ షహర్‌లో ఓ ఫన్నీ ఘటనకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. బసెందువా గ్రామంలో సంచరిస్తున్న చిరుతపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ఓ పెద్ద బోనును ఏర్పాటు చేశారు. చిరుతకు ఎరగా బోనులో ఓ కోడి పుంజును ఉంచారు. ఆ కోడి పుంజును పట్టుకునేందుకు కక్కుర్తిపడి ఓ వ్యక్తి చిరుత బోనులోకి ప్రవేశించాడు. అతను వెళ్లగానే బోను ఒక్కసారిగా మూతపడింది. దీంతో ఒకరోజు మొత్తం అందులోనే ఉన్నాడు. సమాచారం తెలిసి అటవీ అధికారులను అతన్ని బోను ఓపెన్ చేసి బయటకు … Read more

    పన్నీరు పెట్టలేదని పెళ్లిలో లొళ్లి!

    పెళ్లిలో పన్నీరు కూర పెట్టలేదని పెళ్లికొడుకు వారిపైకి బాహాబాహీకి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఓ వెయిటర్‌ అపస్మారక స్థితికి చేరుకోవడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. అయినా, ఎవరూ పట్టించుకోకుండా ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. చొక్కాలు చించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పన్నీరు కోసం ఇంత గొడవ చేయడమేంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా, ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని భాగ్‌పత్ జిల్లాలో చోటు చేసుకుంది. शादी में दूल्हे के फूफा को पनीर … Read more

    కోర్టు ఎదుట చిరుత బీభత్సం

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌‌లో చిరుత బీభత్సం సృష్టించింది. ఘాజియాబాద్ కోర్టు పరిసరాల్లోకి వచ్చి హల్‌చల్ చేసింది. అక్కడున్న స్థానికులపై పంజా విసిరింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సాయంత్రం 4 గంటలకు సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పులిని శాంతపరిచి.. అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, అక్కడికి పులి ఎలా వచ్చిందో సీసీ ఫుటేజీ పరిశీలించి దర్యాప్తు చేస్తామని అధికారులు తెలిపారు. #WATCH | District administration and … Read more

    లక్నోలో బైక్‌పై రెచ్చిపోయిన జంట

    బైక్‌పై ఓ జంట మరోసారి రెచ్చిపోయింది. రాత్రిపూట రోడ్డుపై వికృత చేష్టలు చేస్తూ కనిపించారు. స్కూటీ నడుపుతున్న యువకుడిని గట్టిగా హత్తుకుని ఎదురుగా కూర్చుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లక్నోలో జరిగిన ఈ ఘటనలో బైక్‌పై కూర్చున్నది మైనర్ బాలిక అని పోలీసులు వెల్లడించారు. యువకుడు విక్కీ శర్మ(23)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బైక్‌ని సీజ్ చేశారు. యువకుడిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల విశాఖపట్నంలో కూడా సరిగ్గా ఇలాగే ఓ జంట … Read more

    గన్ ఎలా పేల్చాలో తెలియని ఎస్ఐ; వీడియో వైరల్

    ఓ ఎస్ఐ గన్ ఎలా లోడ్ చేయాలో తెలియక.. చివరకు తుపాకీ గొట్టంలోకి బుల్లెట్లు చొప్పించాడు. యూపీలోని ఖలియాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘ టన చోటు చేసుకుంది. బస్తీ మండల్ ఐజీ ఆర్కే భరద్వాజ్ సంత్ కబీర్ నగర్ జిల్లాలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఐజీ పోలీసులతో గన్ ఫైర్ టెస్ట్ చేయించాడు. కానీ ఖలియాబాద్ ఎస్ఐ తుపాకీలో బుల్లెట్లు ఎలా పెట్టా లో తెలియక బిక్క మొకం వేశాడు. మరో సెంట్రీ టియర్ గన్ పేల్చలేక తంటాలు పడ్డాడు. ఇందుకు సంబంధించిన … Read more

    పట్టపగలే గన్‌తో బెదిరించి దోపిడి

    పట్టపగలే తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డాడు ఓ దొంగ. ఇందుకు సంబంధించిన సీసీటీవీ [ఫుటేజ్](url) వైరల్‌గా మారింది. యూపీలోని ఘజియాబాద్‌లో ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఓ దొంగ ఆమెకు తుపాకీ చూపించి మెడలోని గొలుసు, ఫొన్ ఇవ్వాలని బెదిరించాడు. ఆమె భయపడిపోయి వాటిని విసిరేయగా దొంగ తీసుకున్నాడు. పక్కనే ఉన్న ఓ బాలుడి ఫోన్ కూడా లాక్కున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అది బొమ్మ తుపాకీగా పోలీసులు భావిస్తున్నారు. #WATCH | Uttar Pradesh | A woman’s … Read more

    బల్బు చోరీ.. కానిస్టేబుల్ సస్పెండ్

    బల్బును చోరీ చేసి సస్పెండ్ అయ్యాడో పోలీస్ కానిస్టేబుల్. యూపీ ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలో రాత్రిపూట గస్తీల్లో ఉన్న కానిస్టేబుల్ రాజేశ్ శర్మ.. ఎవరూ లేనిది చూసి ఓ దుకాణం ముందున్న బల్బును గుట్టుగా తస్కరించాడు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి రావడంతో అధికారిని పోలీసులు సస్పెండ్ చేశారు. తను ఉన్న చోట చీకటిగా ఉండటంతోనే ఇలా చేసినట్లు కానిస్టేబుల్ తెలపడం గమనార్హం. కాగా, ఇటీవల ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఓ వ్యక్తి జేబులో నుంచి కానిస్టేబుల్ ఫోన్‌ని చోరీ చేసిన సంగతి వైరల్ అయ్యింది. प्रयागराज … Read more

    పాఠశాలలో తాగుబోతు టీచర్

    యూపీలోని హత్రాస్‌లో ఉన్న ఒక పాఠశాలలో ఒక టీచర్ పాడు పని చేస్తూ దొరికిపోయాడు. శైలైంద్ర సింగ్ అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే బీరు తాగుతూ పట్టుబడ్డాడు. తొటి సిబ్బందే అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. టీచర్ బీర్ తాగుతుండగా వీడియో రికార్డు చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది. ఈ విషయం యూపీ ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లింది. దీంతో సదరు టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించింది. यूपी: क्लास में शराब पीते मास्टर … Read more

    టాయిలెట్లలో క్రీడాకారులకు ఆహారం

    ఉత్తర్ ప్రదేశ్ కబడ్డీ ప్లేయర్లకు టాయిలెట్లలో ఆహారం అందజే యడం చర్చనీయాంశం అయింది. ప్లేట్లలో వేసుకుని ప్లేయర్లు టాయిలెట్ నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. అయితే, స్థలాభావంతో ఇలా చేశామనీ.. టాయిలెట్లలో భోజనం వండలేదని అధికారులు చెప్పారు. బయట వర్షం పడుతుండటంతో.. ఆహారాన్ని అందులోకి తరలించామన్నారు. క్రీడాకారులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఈ ఘటన అనుమానాలను రేకెత్తిస్తోంది. వీడియో కోసం Watch Onపై క్లిక్ చేయండి. Watch: Food Served To UP Kabaddi Players In Toilet, "Space Crunch", … Read more

    వీడియో: లిఫ్టులో పిల్లాడిని కరిచిన పెంపుడు కుక్క

    ఓ అపార్ట్‌మెంట్ లిఫ్టులో వెళ్తున్న స్కూల్ పిల్లాడిని మరో యజమానితోపాటు అందులోకి వచ్చిన పెంపుడు కుక్క కరిచింది. దీంతో ఆ పిల్లాడు నొప్పితో బాధపడుతూ కనిపించాడు. మళ్లీ కుక్క కరిచేందుకు ప్రయత్నించగా యజమాని పట్టుకున్నారు. తర్వాత ఆ కుక్కను తీసుకుని ఆ యజమాని బయటకు వెళ్లడంతో ఆ బాలుడు తన ఫ్లోర్‌కు చేరుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరుగగా, అక్కడి లిఫ్ట్‌లోని కెమెరాలో వీడియో రికార్డైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. ఈ వీడియోను మీరు కూడా చూసేందుకు … Read more