పట్టపగలే తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డాడు ఓ దొంగ. ఇందుకు సంబంధించిన సీసీటీవీ [ఫుటేజ్](url) వైరల్‌గా మారింది. యూపీలోని ఘజియాబాద్‌లో ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఓ దొంగ ఆమెకు తుపాకీ చూపించి మెడలోని గొలుసు, ఫొన్ ఇవ్వాలని బెదిరించాడు. ఆమె భయపడిపోయి వాటిని విసిరేయగా దొంగ తీసుకున్నాడు. పక్కనే ఉన్న ఓ బాలుడి ఫోన్ కూడా లాక్కున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అది బొమ్మ తుపాకీగా పోలీసులు భావిస్తున్నారు.