• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎయిర్‌పోర్ట్‌లో చోరీ.. వీడియో వైరల్‌

    అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో దొంగతనం జరిగింది. సెక్యూరిటీ సిబ్బందే ఈ చోరికి పాల్పడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ట్రాన్స్‌పోర్టేషన్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ (TSA)లో పనిచేసే ఇద్దరు వ్యక్తులే ఈ దొంతనం చేశారు. సెక్యూరిటీ స్కానర్‌ మెషిన్‌పై ఉంచిన ప్రయాణికుల బ్యాగుల నుంచి వారు కొన్ని వందల డాలర్లు, వస్తువులు దొంగిలించారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులను ఉద్యోగం నుంచి తొలగించారు. TSA Agents caught on surveillance video stealing hundreds of dollars in cash … Read more

    రెప్పపాటులో రూ.5 లక్షలు చోరీ

    ఇద్దరు దొంగలు రెప్పపాటులో రూ.5 లక్షలు దొంగతనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నల్గొండ జిల్లా దామరచర్లకు చెందిన రియల్టర్ అజ్మీరా మాలు తన కారులో రూ.5 లక్షలు ఉంచాడు. మిర్యాలగూడలోని ఓ రెస్టారెంట్ వద్ద కారును ఆపి భోజనానికి వెళ్లాడు. ఇంతలో వారిని అనుసరిస్తూ వస్తోన్న ఇద్దరు దొంగలు కారు అద్దాలు పగులగొట్టి రూ.5 లక్షల క్యాష్ బ్యాగ్‌తో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. https://x.com/TeluguScribe/status/1702175983523254665?s=20

    ఇదేం దొంగతనం రా నాయనా?

    గుంటూరులో ఓ వ్యక్తి రూ.20లకు కక్కుర్తి పడి రూ.10 లక్షలు పోగొట్టుకున్నాడు. దొంగలు ఎంతో తెలివితో రూ.10 లక్షలు కొట్టేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నగరంలోని లక్ష్మీపురంలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఓ మిర్చి వ్యాపారి రూ.10 లక్షలు విత్‌డ్రా చేశారు. అనంతరం బైక్‌ హ్యాండిల్‌కు తగిలించి స్టార్ట్ చేస్తుండగా ఓ వ్యక్తి వచ్చి మీ డబ్బులు కిందపడిపోయాయని చెప్పారు. దీంతో రూ.20లను తీసుకుంటుండగా మరో వ్యక్తి వచ్చి హ్యాండిల్‌కు ఉన్న రూ.10 లక్షల సంచి ఎత్తుకెళ్లాడు. Guntur : సినీ పక్కీలో … Read more

    పట్టపగలే రెచ్చిపోయన దొంగలు

    [VIDEO](url): ఢిల్లీలో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. నడిరోడ్డుపై కారును ఆపి రూ. 2 లక్షలు ఎత్తుకెళ్లారు. ఓ వ్యక్తి క్యాబ్‌లో గురుగ్రామ్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో ప్రగతి మైదాన్‌ టన్నెల్‌ లోపలికి కారు ప్రవేశించగానే రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు నడి రోడ్డుపైనే కారును ఆపారు. ఆపై తుపాకీతో బెదిరించి కారు వెనుక సీటులో ఉన్న నగదు బ్యాగుతో ఉడాయించారు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ ఘటనను ఖండించారు. Unknown daylight attackers robbed … Read more

    నడిరోడ్డులో రూ.40 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

    [వీడియో;](url) దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. నడిరోడ్డులో రూ.40 లక్షలను క్షణాల్లో కొట్టేశారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి బ్యాంకులో రూ.40 లక్షలు డ్రా చేసి బ్యాగులో పెట్టుకుని బైక్‌పై వెళ్తున్నాడు. ఓ చోట భారీ ట్రాఫిక్ ఏర్పడి బైక్ ఆపాడు. ఇంతలో ఓ దొంగల ముఠా బ్యాగును గమనించి జిప్పు తీసి క్షణాల్లో ఆ డబ్బును కొట్టేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి నిందితులను అరెస్ట్ చేసి.. రూ.38 … Read more

    పట్టపగలే గన్‌తో బెదిరించి దోపిడి

    పట్టపగలే తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డాడు ఓ దొంగ. ఇందుకు సంబంధించిన సీసీటీవీ [ఫుటేజ్](url) వైరల్‌గా మారింది. యూపీలోని ఘజియాబాద్‌లో ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఓ దొంగ ఆమెకు తుపాకీ చూపించి మెడలోని గొలుసు, ఫొన్ ఇవ్వాలని బెదిరించాడు. ఆమె భయపడిపోయి వాటిని విసిరేయగా దొంగ తీసుకున్నాడు. పక్కనే ఉన్న ఓ బాలుడి ఫోన్ కూడా లాక్కున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అది బొమ్మ తుపాకీగా పోలీసులు భావిస్తున్నారు. #WATCH | Uttar Pradesh | A woman’s … Read more

    కొడుకు కోసం తండ్రి సాహసం

    కొడుకుని చుట్టుముట్టిన దోపిడీ దొంగలను ఆ తండ్రి ధైర్యంగా ఎదుర్కొన్నాడు. కత్తి, స్టన్ గన్‌తో దొంగలు బెదిరిస్తున్నా వారితో పోరాడాడు. చెల్సియాలో తండ్రీ,కొడుకులు అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు దొంగలు వారిని అడ్డగించారు. కుమారుడి చేతికి ఉన్నరూ.కోటి విలువ చేసే రోలెక్స్ వాచీని ఇవ్వమని బెదిరించి, వాచీ లాక్కున్నారు. కుమారుడిపై స్టన్ గన్ ఉపయోగించారు. ఇంతలో తండ్రి వచ్చి వారితో పోరాడాడు. ఈ ఘటన అంతా సీసీ కెమెరాలో రికార్డైంది. https://metro.co.uk/video/thugs-snatch-100k-watch-tourist-violent-struggle-london-2794149/?ito=vjs-link