• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సోషల్‌మీడియాలో కాంగ్రెస్‌ VS బీఆర్‌ఎస్‌

    TS: పార్టీల మధ్య వివాదం సోషల్ మీడియాకెక్కింది. వరదలతో ధ్వంసమైన రోడ్ల ఫొటోలను షేర్ చేస్తూ ‘అవినీతితో వేసిన రోడ్లపై బంగారు తెలంగాణ ఇదిగో’ అంటూ కాంగ్రెస్‌ విమర్శించింది. దీనికి బీఆర్ఎస్ ధీటుగా స్పందించింది. అవినీతి గురించి ‘ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ’ మాట్లాడటం విడ్డూరమంటూ రిప్లై ఇచ్చింది. కాగా, చిల్లర రాజకీయాలు మానుకొని పార్టీలకతీతంగా సహాయక చర్యల్లో పాల్గొనాలని నెటిజన్లు సూచిస్తున్నారు. What an irony!The King of Corruption – 'All Indian Corruption Committee' is talking about corruption. … Read more

    భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే సీతక్క

    TS: ములుగు ఎమ్మెల్యే సీతక్క కంటతడి పెట్టారు. వరదలతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారని ఆవేదన చెందారు. ‘దయచేసి కేటీఆర్‌ గారిని అడుగుతున్నా. ఒక్క హెలికాప్టర్ పంపించండి. రెస్క్యూ టీం శాయాశక్తులా ప్రయత్నిస్తున్నా తరలింపు చర్యలు పూర్తి కావట్లేదు. 9 గంటల నుంచి హెలికాప్టర్ కోసం వేడుకుంటున్నాం. ఇకనైనా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి’ అంటూ సీతక్క కోరారు. ఏటూరు నాగారం మండలంలో కొండై గ్రామస్థులు దాదాపు 100 మంది ప్రాణాలతో పోరాడుతున్నారని ఆమె తెలిపారు. Please send helicopters to save our … Read more

    ప్రభుత్వమే బాధితుల్ని ఆదుకోవాలి: సీతక్క

    TS: ములుగు ఎమ్మెల్యే సీతక్క వరద ప్రభావిత ప్రాంత ప్రజలను పరామర్శించారు. ఆయా గ్రామాల్లో పర్యటించి బాధితులను ఓదార్చారు. నియోజకవర్గంలో పరిస్థితి మరింత దిగజారిందని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. వరదలల కారణంగా గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని చెప్పారు. ఈ వరదలతో ఎంత మేరకు ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందో చెప్పలేమని సీతక్క వెల్లడించారు. ప్రభుత్వం స్పందించి వీలైనంత త్వరగా రక్షణ చర్యలు చేపట్టాలని సీతక్క విన్నవించారు. ట్విటర్‌లో వీడియోను షేర్ చేశారు. Situation is very dangerous in my … Read more

    ఈటెల సీఎం అంటూ నినాదాలు

    TS: బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటెల రాజేందర్ పార్టీలో కీలక నేతగా మారారు. నేడు ఆయన షాద్‌నగర్‌లో పర్యటించగా అక్కడి నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేశారు. దీంతో వెంటనే ఈటెల స్పందించి వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ‘ష్ ష్’ అంటూ వేలిని నోటిపై వేసి సైగ చేశారు. దీంతో నాయకులు నినాదాన్ని మార్చారు. అయితే, ఈ వీడియో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. షాద్ నగర్ … Read more

    భారీ వరదలు.. తెగిపోయిన కనెక్టివిటీ

    TS: వరంగల్, హనుమకొండ మధ్య కనెక్టివిటీ తెగిపోయింది. హంటర్ రోడ్, నయీంనగర్ పూర్తిగా నీట మునగడంతో రహదారులు దెబ్బతిన్నాయి. బాధితులు భవనాలపై తలదాచుకుంటున్నారు. వరద నీరు బీభత్సంతో వాహనాలు కొట్టుకు పోయాయి. శివనగర్ బస్తీల్లో నీరు వచ్చి చేరింది. వరంగల్ రైల్వే స్టేషన్ సైతం నీటితో నిండిపోయింది. రాష్ట్ర విపత్తు స్పందన అధికారులు, రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. #Warangalfloods full of storm water enter tricities. #Warangalrains #Warangalfloods #TelanganaRains #TelanganaFloodspic.twitter.com/FheMkUtkP6 — Hi Warangal (@HiWarangal) … Read more

    రైల్వే ట్రాక్‌పైకి వచ్చి చేరిన నీరు

    TS: భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీటికి కాజీపేట రైల్వే స్టేషనులోని ట్రాక్‌పై నీరు వచ్చి చేరింది. ట్రాక్ మీద రెండు అడుగుల మేర నీరు నిల్వ ఉంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసి, దారి మళ్లించింది. ఇప్పటికే 6 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేయగా, పది రైళ్లను దారి మళ్లించింది. వర్షపు నీరు తొలగించడానికి స్టేషన్ అధికారులు సమాయత్తం అవుతున్నారు. Never seen #Kazipet Railway Station this way where … Read more

    కుమారుడి వద్దే కుప్పకూలిన MLA

    TS: కుమారుడి మృతితో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అచలమయ్యారు. పెద్ద కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి లేడన్న భావన ఆయన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. ఈ క్రమంలో కుమారుడి పార్థివ దేహం వద్దే కూర్చుని లోలోపల కుమిలిపోయారు. బోరున విలపించడంతో సొమ్మసిల్లి అక్కడే కుప్పకూలిపోయారు. స్థానిక నేతలు, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేని పక్కకి తీసుకెళ్లారు. గత కొంత కాలంగా విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. కొడుకు మృతదేహం చూసి సొమ్మసిల్లి పడిపోయిన … Read more

    ఆకలితో అలమటిస్తున్న యువతి

    మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లిన హైదరాబాద్ యువతి అక్కడ రోడ్లపై ఆకలితో అలమటిస్తోంది. విషయం తెలుసుకున్న ఆమె తల్లి భారత్‌కు తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్‌కు లేఖ రాసింది. మిన్హాజ్ జైదీ మాస్టర్స్ చేసేందుకు 2021లో అమెరికా వెళ్లింది. వస్తువులు ఎవరో దొంగిలించడంతో ఆమె చికాగో రోడ్లపై ఆకలి కడుపుతో తిరుగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన కొందరు జైదీని గుర్తించి తల్లికి సమాచారం అందించారు. దీంతో తన కుమార్తెను భారత్‌కు రప్పించేందుకు ఆమె తల్లి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. Syeda … Read more

    పట్టించుకోలేదని పామును తీసుకెళ్లాడు

    HYD: ఓ వ్యక్తి వినూత్న రీతిలో నిరసన తెలిపి GHMC అధికారులకు షాకిచ్చాడు. పామును అధికారుల వద్దకు తీసుకువచ్చి ఆందోళన చేశాడు. ఆల్వాల్ కాలనీలో చెట్ల పొదలు విస్తృతంగా పెరిగిపోయాయి. దీంతో వరద వచ్చినప్పుడల్లా వాటి నుంచి పాములు ఇళ్లల్లోకి వస్తున్నాయని కాలనీ వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో సంపత్ అనే వ్యక్తి తన ఇంట్లోకి వచ్చిన పామును తీసుకుని GHMC కార్యాలయానికి వెళ్లాడు. ఆఫీస్‌లో ఓ టేబుల్‌పై పామును విడిచిపెట్టి నిరసన తెలిపాడు. A resident releases … Read more

    సచివాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత

    TS: జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కానిస్టేబుల్ అభ్యర్థులు రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించారు. సెక్రెటరేట్ గేటు ఎదుట బైఠాయించి జీవోను రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2022 నోటిఫికేషన్లో కానిస్టేబుల్ నియామకాలను పాత పద్ధతిలోనే పూర్తి చేసి, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ సెక్రెటరేట్‌ను ముట్టడించిన కానిస్టేబుల్ అభ్యర్థులు. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని డిమాండ్. సెక్రెటరేట్ … Read more