• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం

    TS: మేళ్ల చెరువులోని మై హోం సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి కాంట్రాక్ట్ కార్మికులు కిందపడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందినట్లుగా సమాచారం. బాధితులు ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవారుగా తెలుస్తోంది. అనుమతి లేకుండా నూతనంగా నిర్మిస్తున్న యూనిట్-4 ప్లాంట్ వద్ద ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ప్రమాదంపై మై హోమ్ యాజమాన్యం గోప్యత పాటిస్తున్నట్లు తెలుస్తోంది. మేళ్ల చెరువులోని మై హోం సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఐదుగురు మృతి మృతుల … Read more

    ట్రాఫిక్ నియంత్రణకు పరిష్కారం లేదా?

    TS: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యమైంది. అయితే, వర్షం పడినప్పుడు ఇది మరింత తీవ్రంగా మారుతోంది. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి హైటెక్ సిటీలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఉద్యోగులంతా ఒక్కసారిగా బయటకు రావడంతో వాహనాలు బారులు తీరాయి. అయితే, ఉద్యోగులకు సాఫ్ట్‌వేర్ కంపెనీలు వర్క్ ఫ్రం హోం కల్పిస్తే కొద్ది మేరకు సమస్య పరిష్కారం కావొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు కంపెనీలు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్? వర్షాకాలంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం … Read more

    చెత్తను ఏరివేసిన మంత్రి హరీశ్

    TS: మంత్రి హరీశ్ రావు ఉదయం సిద్దిపేటలో పర్యటించారు. ఈ సందర్బంగా 18వ వార్డులో స్వచ్ఛ పట్టణం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వతహాగా డ్రైనేజీలోని చెత్తను ఏరేశారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. నడుస్తూ చెత్తను తొలగించే కార్యక్రమంలో పట్టణ పౌరులుగా, సామాజిక బాధ్యతగా ప్రజలందరు భాగస్వామ్యం కావాలన్నారు. చెత్త కుండీ లేని సిద్దిపేట గా మారుద్దామని పిలుపునిచ్చారు. డ్రైనేజీలో చెత్త తీసి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన … Read more

    మణిపూర్ ఘటన అనాగరికం: కేటీఆర్

    మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ‘జాతుల మధ్య ఘర్షణలతో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేయడం అనాగరికం. అయినా, ఈ భయానక హింసాకాండను చూస్తూ కేంద్రం మౌనంగా ఉంటోంది. మణిపూర్‌లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎక్కడ ఉన్నారు?’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కాగా, ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. We Indians were raging against Taliban when they … Read more

    హైదరాబాద్‌లో దంచికొడుతున్న వానలు.. ఈ పనులు మాత్రమే చేయండి! తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ!

    హైదరాబాద్‌లో గత రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాన నీరు రోడ్లపైకి రావడంతో పలు చోట్ల పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఉదయం 8 గంటల నుంచి హైదరాబాద్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆఫీస్‌లకు వెళ్లే ఉద్యోగులు వానలో తడుస్తూ ఇబ్బంది పడ్డారు.  వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ క్లియర్ అయ్యేవరకు వర్షంలో తడుస్తూ కాలం వెల్లదిశారు. పంజాగుట్ట నుంచి హైటెక్ సిటీ వెళ్లే రూట్‌లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి … Read more

    రేవంత్‌ని తరిమి కొట్టాలి: కవిత

    TS: రైతులకు 3 గంటల పాటు కరెంట్ ఇవ్వాలనే రేవంత్‌ని ఊరి పొలిమేర దాకా తరిమి కొట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు సారీ చెప్పేదాకా వారిని గ్రామాల్లో తిరగనీయొద్దని పిలుపునిచ్చారు. విద్యుత్ సౌధ వద్ద బీఆర్ఎస్ చేపట్టిన నిరసనల్లో పాల్గొని కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అవసరం లేదన్న రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఈ నిరసన చేపట్టింది. #WATCH | BRS MLC … Read more

    రాంగ్‌రూట్‌లో వచ్చి బైక్‌ను ఢీకొట్టిన కారు

    బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీఎండబ్ల్యూ కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొంది. అలా బైక్‌ను కొంత దూరం వరకు లాక్కెళ్లింది. ఈ ఘటనలో జీహెచ్‌ఎంసీ అధికారి బాలచందర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారును పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. #WATCH | Telangana | Hit and run incident … Read more

    రేవంత్, వెంకటరెడ్డిల మధ్య దూరం తగ్గలేదా?

    TS: టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మధ్య అభిప్రాయ భేదాలు ఇంకా తొలిగిపోలేనట్లు తెలుస్తోంది. గతంలో వీరు చేతులు కలిపినా లోలోపల కుమ్ములాటలు ఉన్నట్లు సమాచారం. నేడు ఖమ్మంలో కాంగ్రెస్ సభ జరగనున్న క్రమంలో వెంకటరెడ్డి సోషల్ మీడియా హ్యాండిల్‌లో చేసిన పోస్టు వీటిని బలపరుస్తోంది. రాహుల్ గాంధీని ఆహ్వానిస్తూ డిజైన్ చేసిన పోస్టర్‌లో, అంతకుముందు వాటిల్లో రేవంత్ రెడ్డి ఫొటో లేదు. ప్రొటోకాల్ ప్రకారం పెట్టాల్సిందని పలువురు సూచిస్తున్నారు. ఛలో ఖమ్మం తెలంగాణ ప్రజల బానిస సంకెళ్లు తెంచడానికి.. … Read more

    నేడు ‘స్కైవాక్‌’ వంతెన ప్రారంభం

    హైదరాబాద్‌లోని ఉప్పల్‌ చౌరస్తాలో నిర్మించిన ‘స్కైవాక్‌’ వంతెన నేడు ప్రారంభం కానుంది. మంత్రి కేటీఆర్‌ దీనిని లాంచ్‌ చేయనున్నారు. ఉప్పల్‌, సికింద్రాబాద్‌, LB నగర్‌, రామాంతపూర్‌, రహదారులతో పాటు మెట్రో స్టేషన్‌కు ఈ వంతెనను అనుసంధానించారు. మెట్లు ఎక్కలేని వారి కోసం ప్రత్యేకంగా ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. ఈ స్కైవాక్‌ నిర్మాణం కోసం HMDA రూ.25 కోట్లు ఖర్చు చేసింది. 660 మీటర్ల పొడవున్న ఈ వంతెనకు LED దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. Uppal Skywalk..The First-Ever Pedestrian- Friendly Elevated … Read more

    హైదరాబాద్‌లో ఘనంగా 2K రన్

    తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో 2కే రన్‌ను ఘనంగా నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ రన్‌ను మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ జెండాఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌, నగర మేయర్‌ విజయలక్ష్మి, క్రీడాకారులు నిఖత్‌ జరీన్‌, ఈషా సింగ్‌, నటి శ్రీలీల పాల్గొన్నారు. 4 వేలకు పైగా రన్నర్లు ఈ రన్‌లో పార్టిసిపేట్‌ చేశారు. #Telangana State … Read more