• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Telangana @ 10 Years: 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి దోహదపడిన 10 అంశాలు!

    తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది. 2014 జూన్‌ 2న దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ 2023 జూన్‌ 2తో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని పదో ఏట అడుగుపెట్టబోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తెలంగాణ ప్రాంతం.. ప్రస్తుతం ప్రగతిలో దేశానికే ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగింది. ఒకప్పుడు హైదరాబాద్‌ మినహా తెలంగాణలో ఎక్కడ అభివృద్ధి కనిపించేది కాదు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా కరెంటు లేని ఇళ్లే కనిపించేవి. నీరు లేక ఏడారిని తలపించే భూములు తారసపడేవి. కొత్త … Read more

    Second Hand Books In Hyderabad: సెకండ్‌ హ్యాండ్‌ బుక్స్‌ కోసం వెతుకున్నారా? ఇక్కడ ట్రై చేయండి

    మనిషి వికాసానికి పుస్తకాలు ఎంతగానో దోహదం చేస్తాయి. ప్రతీ మనిషి జీవితంలో పుస్తకం అంతర్బాగమనే చెప్పాలి. పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకు ప్రతీ దశలోనూ మానవుడి జీవితం పుస్తకాలతో ముడిపడి ఉంది. పుస్తకాలను చదవడం అలవాటు చేసుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అదిరోహిస్తారవి పెద్దలు చెబుతుంటారు. మనకు ఎంతో జ్ఙానాన్ని ఇచ్చే పుస్తకాలను ప్రస్తుత స్మార్ట్‌ యుగంలోనూ చాలా మంది ఇష్టంగా చదువుతున్నారు. అయితే ఎక్కువ డబ్బులు చెల్లించి పుస్తకాలను కొనుగోలు చేయడం వారికి కష్టంగా మారుతోంది. అయితే హైదరాబాద్‌ వాసులకు ఈ సమస్య లేదనే … Read more

    ఆరేళ్ల చిన్నారిని కాపాడిన ర్యాపిడో డ్రైవర్

    హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిని అత్యాచారయత్నం నుంచి ర్యాపిడో డ్రైవర్ కాపాడాడు. ఎర్రిమంజిల్‌ వద్ద కస్టమర్ కోసం అతడు ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో చిన్నారి ఏడ్చినట్లు వినిపించింది. అక్కడికి వెళ్లి చూడగా ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి ఒడిగడుతున్నట్లు కనిపించింది. అతడిని ఆపి ఎవరని ప్రశ్నించగా బాలిక తండ్రినంటూ దబాయించే ప్రయత్నం చేశాడు. కానీ, అనుమానంతో పోలీసులకు ఫోన్ చేయడంతో ఘటనాస్థలికి వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలికను సురక్షితంగా తల్లికి అప్పగించారు. Hear Kalyan narrate the incident & how he was … Read more

    Scenic Roads: తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత సుందరమైన రోడ్డు మార్గాలు.. వెళ్లారంటే ఫిదా కావాల్సిందే..!

    తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. చారిత్రక కట్టడాలు, ప్రసిద్ద దేవాలయాలు, అటవీ ప్రాంతాలు ఇలా ఎన్నో ప్రదేశాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లే రోడ్లు సైతం ఎంతో సుందరమైన ప్రకృతిని పరిచయం చేస్తుంటాయి. ఆ రోడ్లలో ప్రయాణించడం ద్వారా పర్యాటకులు, వాహనదారులు ఎన్నో మధురానుభూతులను పొందుతుంటారు. అక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి తెగ ఎంజాయ్‌ చేస్తుంటారు. అయితే ఏపీ, తెలంగాణలలో అందమైన మార్గాలు ఎన్ని ఉన్నాయి? సరిగ్గా ఏ ఏ మార్గాల్లో ప్రయాణిస్తే మంచి అనుభూతిని పొందొచ్చు? … Read more

    Neera Cafe: హైదరాబాద్‌ నడిబొడ్డున నీరా కేఫ్‌.. దీని ప్రత్యేకతలు తెలుసా..?

    హైదరాబాద్‌లో మరో సరికొత్త కేఫ్ అందుబాటులోకి వచ్చింది. హుస్సేన్‌ సాగర్‌ తీరంలో కొత్తగా నీరా కేఫ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకోసం రూ.20 కోట్లను ఖర్చు చేసింది. నోరూరించే తియ్యటి నీరాను నగరవాసులకు అందించడంతో పాటు నీరాను పరిశ్రమ స్థాయికి తీసుకురావాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ‘నీరా కేఫ్‌’కు ఏర్పాటు చేసింది. నెక్లెస్‌ రోడ్డులో 2020 జులై 23న నీరా కేఫ్‌కు శంకుస్థాపన చేశారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత నిర్మాణం పూర్తయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. నీరా కేఫ్‌లో మొత్తం 7 … Read more

    LIVE: సీఎం కేసీఆర్ ప్రసంగం

    తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ నూతన సచివాలయ శుభారంభ శుభాకాంక్షలు తెలియజేశారు.

    పిల్లలూ.. మీరు ఆకర్షణ మాదిరి చేయ్యాలి!

    11 ఏళ్ల చిన్నారి ఆకర్షణ సతీష్ అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది. హైదరాబాద్‌లో లైబ్రరీలు లేని ప్రాంతాల్లో చిన్నారుల కోసం గ్రంథాలయాలు ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. ఇప్పటి వరకు నగరంలో సనత్ నగర్ పోలీస్ స్టేషన్, MNJ పిల్లల క్యాన్సర్ ఆస్పత్రి, తాజాగా కాచిగుడ వద్ద మరో లైబ్రరీని ఏర్పాటు చేసింది. తన స్నేహితులు, బంధువులు, దాతల సాయంతో దాదాపు 4,800 పుస్తకాలను కలెక్ట్ చేసింది. ఆకర్షణ ఆలోచనను శిఖా గోయల్ IPS మెచ్చుకున్నారు. చిన్నారికి తమ వంతుగా పోలీసుల నుంచి సాయం అందజేస్తామని … Read more

    ఇది మన హైదరాబాదేనా భయ్యా? వీడియోలు వైరల్

    హైదరాబాద్‌లో ఉదయం కురిసిన వర్షాలు పలు చోట్ల బీభత్సం సృష్టించాయి. రోడ్లపై వరద ప్రవాహం నదీ ప్రవాహాలను తలపిస్తున్నాయి. ఈక్రమంలో తమ ప్రాంతాల్లో వరద పరిస్థితిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల వరదల ధాటికి బైక్‌లు కొట్టుకు పోయిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇది హైదరాబాదేనా భయ్యా.. ‘అమేజింగ్ డ్రైనేజ్ అందించిన కేటీఆర్‌కు థ్యాంక్స్’ అంటూ పోస్టుల్లో విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నాలాలో పడి చిన్నారి మృతి  సికింద్రాబాద్‌లో  వర్ష బీభత్సం  … Read more

    హైదరాాబాద్‌కు రెడ్ అలెర్ట్… మరో 4 రోజులు వర్షాలు

    హైదరాబాద్‌కు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. మరో నాలుగు రోజుల పాటు వర్ష ప్రభావ పరిస్థితులు కొనసాగుతాయని వెళ్లడించింది. పలు చోట్ల వడగండ్ల వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈరోజు నిర్మల్, నిజమాబాద్, జగిత్యాల, జనగాం, మహబూబాబాద్ జిల్లాలకు వర్ష ముప్పు ఉన్నట్లు తెలిపింది. రాబోయే 3గంటల్లో హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నీట మునిగింది. కేవలం గంటలోనే రామచంద్రాపురంలో 6సెంటీమీటర్ల … Read more

    Tallest statues: బాబోయ్‌.. మన దేశంలో ఇన్ని ఎత్తైన విగ్రహలు ఉన్నాయా.. వాటి ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

    ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌ ఎన్నో విభిన్న సంస్కృతులకు నెలవు. ఇక్కడ హిందూ జనాభా అధికంగా ఉండటంతో విగ్రహారాదనకు ప్రత్యేక స్థానమే ఉంది. ఫలితంగా భారత్ ఎన్నో ఎత్తైన విగ్రహాలకు నిలయంగా మారిపోయింది. అంతేగాక ఆ విగ్రహాలు ఉన్న ప్రదేశాలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా విలసిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద విగ్రహాలు, ఎత్తు, వాటి ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.  1. సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం (గుజరాత్‌) స్టాట్యూ ఆఫ్‌ యూనిటీగా పేరుగాంచిన గుజరాత్‌లోని సర్ధార్‌ వల్లభాయ్ పటేల్‌ విగ్రహం … Read more