• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైదరాాబాద్‌కు రెడ్ అలెర్ట్… మరో 4 రోజులు వర్షాలు

    హైదరాబాద్‌కు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. మరో నాలుగు రోజుల పాటు వర్ష ప్రభావ పరిస్థితులు కొనసాగుతాయని వెళ్లడించింది. పలు చోట్ల వడగండ్ల వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈరోజు నిర్మల్, నిజమాబాద్, జగిత్యాల, జనగాం, మహబూబాబాద్ జిల్లాలకు వర్ష ముప్పు ఉన్నట్లు తెలిపింది. రాబోయే 3గంటల్లో హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నీట మునిగింది. కేవలం గంటలోనే రామచంద్రాపురంలో 6సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శేరిలింగంపల్లి, గాజులరామారం, కూకట్‌పల్లి, సికింద్రబాద్, కాప్రా, మల్కాజ్‌గిరి ప్రాంతాలకు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. చాలా చోట్ల రాత్రి విద్యుత్ అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv