హైదరాబాద్‌లో ఉదయం కురిసిన వర్షాలు పలు చోట్ల బీభత్సం సృష్టించాయి. రోడ్లపై వరద ప్రవాహం నదీ ప్రవాహాలను తలపిస్తున్నాయి. ఈక్రమంలో తమ ప్రాంతాల్లో వరద పరిస్థితిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల వరదల ధాటికి బైక్‌లు కొట్టుకు పోయిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇది హైదరాబాదేనా భయ్యా.. ‘అమేజింగ్ డ్రైనేజ్ అందించిన కేటీఆర్‌కు థ్యాంక్స్’ అంటూ పోస్టుల్లో విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నాలాలో పడి చిన్నారి మృతి
సికింద్రాబాద్‌లో వర్ష బీభత్సం చిన్నారిని బలితీసుకుంది. కళాసిగూడలోని నాలాలో పడి 6 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఉదయం పాల ప్యాకెట్ తీసుకొచ్చేందుకు దుకాణానికి వెళ్తున్న క్రమంలో నాలాలో పడిపోయింది. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. GHMC సిబ్బంది సాయంతో నాలాలో పడిన చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కొన్ని చోట్ల భారీ వరదలకు బైక్‌లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. బయట పార్క్ చేసిన వాహనలు వరదల్లో కొట్టుకుపోయాన్ని వాహనదారులు వాపోతున్నారు. ప్రస్తుతం ఈవీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
మరోవైపు తెలంగాణవ్యాప్తంగా రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 29న ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నట్లు అంచనా వేసింది. ఏప్రిల్ 30న సూర్యపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షాలు పడనున్నట్లు హెచ్చరించింది. మే 2,3 తేదీల్లోనూ తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!