ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు
తెలంగాణలో ఇవాళ రేపు మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. నల్గొండలో 36 డిగ్రీల సెల్సియస్, ఖమ్మంలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైనట్లు పేర్కొంది.