తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. చారిత్రక కట్టడాలు, ప్రసిద్ద దేవాలయాలు, అటవీ ప్రాంతాలు ఇలా ఎన్నో ప్రదేశాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లే రోడ్లు సైతం ఎంతో సుందరమైన ప్రకృతిని పరిచయం చేస్తుంటాయి. ఆ రోడ్లలో ప్రయాణించడం ద్వారా పర్యాటకులు, వాహనదారులు ఎన్నో మధురానుభూతులను పొందుతుంటారు. అక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఏపీ, తెలంగాణలలో అందమైన మార్గాలు ఎన్ని ఉన్నాయి? సరిగ్గా ఏ ఏ మార్గాల్లో ప్రయాణిస్తే మంచి అనుభూతిని పొందొచ్చు? అని ఆలోచిస్తున్నారా. అయితే ఇది మీకోసమే..
1. మారేడుమిల్లి To అరకు
ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ అందమైన మార్గం ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి గ్రామం నుంచి విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన అరకు వరకు ఉన్న ఈ రోడ్డు మార్గం భూతల స్వర్గమని చెప్పొచ్చు. పచ్చటి ప్రకృతి రమణీయత మధ్య సాగే ఈ ప్రయాణం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. దట్టమైన అడవులను దారిపొడవున మిమ్మల్ని పలకరిస్తాయి. పక్షుల కిలకిలారావాలు మీ చెవిలో మార్మోగుతుంటాయి. ప్రకృతి ఓడిలో ప్రయాణాన్ని కోరుకునేవారికి ఈ మార్గం మెుదటి ఛాయిస్.
2. తిరుమల ఘాట్ రోడ్డు
ఏపీలోని అత్యంత అందమైన రోడ్డు మార్గాల్లో తిరుమలకు వెళ్లే ఘాట్‌రోడ్డు ఒకటి. 19 కిలోమీటర్లు పొడవైన ఈ ఘాట్‌రోడ్‌లో ప్రయాణం.. గొప్ప అనుభూతిని పంచుతుంది. ఘాట్ రోడ్డు మలుపులు, ప్రకృతి వనాలు.. ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటాయి. తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులు ఈ ఘాట్ రోడ్డులో ప్రయాణాన్ని అమితంగా ఇష్టపడతారు.
3. వైజాగ్ బీచ్ రోడ్డు
ఏపీలోని వైజాగ్ నగరం అత్యంత అందమైన సిటీగా గుర్తింపు పొందింది. సముద్ర తీరాన ఉన్న ఈ నగరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. అయితే వైజాగ్ పేరు చెప్పగానే ముందుగా బీచ్‌ను అనుకొని ఉన్న రోడ్డే గుర్తుకు వస్తుంది. సినిమాల్లోనూ వైజాగ్ సిటీని చూపించాలంటే ముందుగా ఈ మార్గాన్నే చూపిస్తారు. సముద్రంలో నుంచి వచ్చే చల్లటి గాలులతో ఈ రోడ్డుపై ప్రయాణం వాహనదారులకు ఎంతగానో నచ్చుతుంది.
4. రాజమహేంద్రవరం బ్రిడ్జ్
రాజమండ్రి పేరు చెప్పగానే ముందుగా గోదావరిపై నిర్మించిన భారీ వంతెనే గుర్తుకు వస్తుంది. రాజమహేంద్రవరం-కొవ్వూరు ప్రాంతాలను కలుపుతూ దీన్ని నిర్మించారు. ఈ వంతెన పర్యాటకంగానూ ఎంతో ప్రసిద్ధి. గలగల పారే గోదారమ్మ తల్లిని చూస్తూ సాగే ఈ ప్రయాణం ప్రతీ ఒక్కరికీ తప్పక నచ్చుతుంది.
5. హైదరాబాద్ To శ్రీశైలం
తెలంగాణలోని అందమైన రోడ్డు మార్గాల్లో హైదరాబాద్-శ్రీశైలం రోడ్డు ముందు వరుసలో ఉంటుంది. నల్లమల్ల ఫారెస్టు గుండా సాగే ఈ ప్రయాణం అద్భుతమనే చెప్పాలి. సుమారు 70 కి.మీ మేర అడవీలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఎటు చూసిన చెట్లు.. అందమైన పక్షులతో ఈ మార్గం అత్యంత సుందరంగా ఉంటుంది. ఫ్యామిలీతో సరదాగా ట్రిప్ వెళ్లాలనుకునేవారు ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చు. పైగా శీశైలం మల్లన్న దర్శన భాగ్యం కూడా కలుగుతుంది.
6. హైదరాబాద్ To వికారాబాద్
హైదరాబాద్ నుంచి వికారాబాద్‌కు వెళ్లే రోడ్డు మార్గం ఎంతో సుందరంగా ఉంటుంది. దట్టమైన అడవులు, కొండలు-గుట్టలు, అందమైన గ్రామాలు ఈ మార్గంలో పలకరిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ మార్గం గుండా ప్రయాణిస్తే జీవితంలో మర్చిపోరు.
7. వరంగల్ To ములుగు
వరంగల్ నుంచి మలుగు వరకూ రోడ్డు ప్రయాణం గిరిజన ప్రాంతాలను పరిచయం చేస్తుంది. ఈ మార్గంలో పురాతన నిర్మాణాలు, జలపాతాలు, దట్టమైన అడవులు చూడొచ్చు. ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం కూడా ఈ మార్గంలోనే దర్శనమిస్తుంది. అలాగే సమ్మక్క-సారలమ్మ ఆలయాలు కూడా దర్శించుకోవచ్చు.
8. నాగార్జునసాగర్ రోడ్డు
హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వరకూ ఉన్న రోడ్డుమార్గం కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఈ ప్రయాణంలో మీరు ప్రసిద్ధ కట్టడం నాగార్జున సాగర్ డ్యామ్ చూడొచ్చు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణా నది మీ మనసుకు ఎంతో అహ్లాదాన్ని పంచుతుంది.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్