• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • భక్తుల గమ్యస్థానంగా తిరుపతి

  దేశంలోనే భక్తులు అత్యధికంగా దర్శించుకునే రెండో పుణ్యక్షేత్రంగా తిరుపతి నిలిచినట్లు ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్ట్ తెలిపింది. మొదటి స్థానంలో వారణాసి ఉన్నట్లు వెల్లడించింది. లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో శ్రీవారిని దర్శించుకోవాడానికి భక్తులు పోటెత్తుతున్నట్లు పేర్కొంది. తిరుపతి తర్వాతి స్థానాల్లో పూరి, అమృత్‌సర్, హరిద్వార్‌, షిర్డీ, రిషికేష్, మధుర, మహాబలేశ్వర్, మధుర క్షేత్రాలు నిలిచినట్లు వెల్లడించింది.

  మాండౌస్ ఎఫెక్ట్; తిరుపతిలో భారీ వర్షాలు

  మాండౌస్ తుఫాన్ ప్రభావంతో తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సత్యవేడు, నగరి, శ్రీకాళహస్తిల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలు నిలిపివేశారు. పాపవినాశనం, శిలాతోరణం మార్గాలను కూడా మూసివేశారు. భారీ వర్షాలకు తిరుమల చుట్టుపక్కల ఉన్న డ్యామ్‌లు అన్నీ నిండుకుండల్లా మారాయి. తూపిలిపాలెం బీచ్ దగ్గర 10 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. అటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగానూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

  12నుంచి TTD అర్జిత సేవా టికెట్లు

  AP: 2023 జనవరి నెలకు సంబంధించిన అర్జిత సేవా టికెట్ల కోటా టోకెన్‌ను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇదే నెలకు సంబంధించిన మరికొన్ని అర్జిత సేవా టికెట్లకు ఆన్‌లైన్ లక్కీడిప్‌ని నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నెల 12న మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్జిత సేవా టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఆన్‌లైన్ లక్కీడిప్ కోసం ఈ నెల 12న ఉదయం 10 నుంచి 14న ఉదయం 10గంటల వరకు నమోదు ప్రక్రియ ఉంటుందని తెలిపింది. ఆ తరువాత … Read more

  ‘వందేభారత్’ రైళ్లు వచ్చేస్తున్నాయ్

  ఏపీకి రెండు ‘వందేభారత్’ రైళ్లు కేటాయించినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఎసీఆర్ పరిధిలో తొలి వందేభారత్ రైలును వచ్చే ఏడాది జనవరిలో నడపాలని నిర్ణయించింది. ఒక రైలును సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు నడుపుతారు. ఇక రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు నడపాలని రైల్వేశాఖ ఆలోచిస్తోంది. ఈ రైలు రూట్ మ్యాప్‌ ఇంకా ఖరారు కాలేదు. కాగా వందేభారత్ రైళ్ల ప్రవేశంతో తెలంగాణ, ఏపీల మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది.

  టికెట్లు ఉన్నవారికే వైకుంఠ దర్శనం

  టికెట్లు ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం అనంతరం ధర్మారెడ్డి ఈ విషయం వెల్లడించారు. టికెట్లు లేనివారికి తిరమలకు ప్రవేశం ఉంటుంది కానీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించబోమని స్పష్టం చేశారు. జనవరి 2నుంచి 11వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని ధర్మారెడ్డి తెలిపారు. 7.5లక్షల మందికి సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు. డిసెంబరు 29నుంచి జనవరి 3 వరకు తిరుమలలో అడ్వాన్స్ గదుల బుకింగుని నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

  TTDకి రూ.131.56కోట్ల హుండీ ఆదాయం

  AP: తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల కానుకలు పోటెత్తుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఎలాంటి ఆంక్షలు లేకుండా భక్తులను అనుమతిస్తుండటంతో టీటీడీ హుండీ ఆదాయం కూడా పెరిగింది. వరుసగా నవంబరు నెలలోనూ స్వామివారి హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటిందని టీటీడీ వెల్లడించింది. నవంబరులో ఏకంగా రూ.131.56కోట్ల హుండీ కానుకలు వచ్చాయని దేవస్థానం అధికారులు ప్రకటించారు. గత కొన్ని నెలలుగా హుండీ కానుకలు రూ.100 కోట్లకు పైగా వస్తున్నాయని చెప్పారు. భక్తులు పెద్ద ఎత్తున వేంకటేశుడిని దర్శించుకుని.. కానుకలు సమర్పించుకుంటున్నారని అధికారులు తెలిపారు.

  రోడ్డుపై ప్రసవించిన మహిళ

  ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది గర్భిణీని చేర్చుకునేందుకు నిరాకరించటంతో ఆమె రోడ్డుపై ప్రసవించింది. ఎవరూ తన వెంట రాని కారణంగా చేర్చుకోబోమని చెప్పినట్లు బాధితురులు చెప్పింది. ఆమెకు రహదారిపైనే నొప్పులు రావటంతో ఓ మహిళ దుప్పటి పట్టుకోగా..మరో వ్యక్తి సహాయం చేశారు. అతడు ప్రాథమిక ఆస్పత్రిలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఘటనపై సమాచారం అందుకున్న వైద్యరోగ్య శాఖ, ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

  మరోసారి మంత్రి రోజాకు చుక్కెదురు

  AP: నగరిలో మరోసారి అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి. సొంతపార్టీ నాయకుల నుంచి మంత్రి రోజాకు నిరసన తప్పడం లేదు. తిరుపతి జిల్లా పడమాలపేట మండలం పత్తిపుత్తూరు సచివాలయ భవనాన్ని నాటకీయ పరిణామాల మధ్య మంత్రి రోజా శనివారం ప్రారంభించారు. సచివాలయ భవనంతో పాటు పక్కనే కలిసి నిర్మించిన మిగతా భవనాలు పెండింగు బిల్లులు మంజూరు కాకుండానే రోజా ప్రారంభించడాన్ని వైకాపా జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని శాంతి భద్రతలను పర్యవేక్షించారు.

  తిరుపతిలో విద్యార్థులు మిస్సింగ్

  AP: తిరుపతిలో ఐదుగురు పదో తరగతి విద్యార్థులు అదృశ్యమైన ఘటన బుధవారం చోటు చేసుకుంది. నెహ్రు నగర్‌లోని అన్నమయ్య హైస్కూల్‌లో చదువుతున్న విద్యార్థులు ఉదయం 6 గంటలకు ట్యూషన్స్ కోసమని వెళ్లారు. కానీ, తిరిగి ఇంటికి రాలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పాఠశాల సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. తప్పిపోయిన వారిలో ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నట్లు తెలుస్తోంది.

  ఆ మూడు రోజులు దర్శనాలు రద్దు

  AP: తిరుమలలో అక్టోబ‌రు 24, 25, నవంబరు 8న బ్రేక్ ద‌ర్శనాలు ర‌ద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో అక్టోబరు 24న దీపావళి ఆస్థానం, 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్రగ్రహ‌ణం ఉండటంతో ఈ మూడు రోజుల్లో దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రోజుల్లో ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది. కాగా, 25న సూర్యగ్రహణం కారణంగా రాష్ట్రంలోని వివిధ ఆలయాలనూ మూసివేస్తున్నారు.