• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చైనాతో ముప్పు తొలగిపోలేదు: జైశంకర్‌

    చైనా-భారత్‌ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా తొలగిపోలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ‘నా దృష్టిలో చైనాతో పరిస్థితి ఇప్పటికి ముప్పుగానే ఉంది. కారణం సరిహద్దుల్లో మోహరింపులు చాలా దగ్గరగా ఉన్నాయి. సైనిక అంచనాల ప్రకారం ఇంకా కొన్ని ప్రదేశాల వద్ద పరిస్థితి ‍ప్రమాదకరంగానే ఉంది. అందువల్ల ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధం అసాధారణ సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోంది’ అని అన్నారు

    కుమార్తె డైపర్‌ నుంచి బంగారం అక్రమ రవాణా!

    మంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఓ వ్యక్తి తన 22 నెలల కూమార్తె ధరించిన డైపర్‌లో బంగారాన్ని దాచాడు. అధికారులు తనిఖీ చేయగా బంగారంతో అడ్డంగా దొరికిపోయాడు. బంగారాన్ని పేస్ట్‌ రూపంలో ప్యాకెట్లుగా రూపొందించి డైపర్‌లో ఉంచినట్లు అధికారులు గుర్తించారు. మరో ఘటనలో ఓ ప్రయాణికుడు తన నడుముకు ధరించే బెల్ట్‌కు బంగారాన్ని అతికించాడు. ఇంకో వ్యక్తి తన రహస్య భాగాల్లో బంగారాన్ని తరలిస్తూ పట్టుబడ్డాడు. ఈ ముగ్గురినీ కస్టమ్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు.

    100 కార్లతో ఛేజ్‌ చేసి నిందితుడి అరెస్టు

    పంజాబ్‌లో తీవ్ర అల్లర్లకు కారణమైన అమృత్‌పాల్‌ సింగ్‌ను పోలీసులు పక్కా వ్యూహంతో అరెస్టు చేశారు. సినీ ఫక్కీలో 100 కార్లలో వెంబడించి అదుపులోకి తీసుకున్నారు.జలంధర్‌లోని షాకోట్‌కు అమృత్‌పాల్‌ వస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున సిబ్బందితో పోలీసులు కాపు కాశారు. వారిని గమనించిన అమృత్‌పాల్‌ పారిపోయేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఛేజ్‌ చేసి మరీ అమృత్‌పాల్‌ ను పట్టుకున్నారు.

    కత్తితో గొంతు కోసుకొని.. రోడ్డుపై హల్‌చల్‌!

    [VIDEO](url): దిల్లీలోని షాహదారా ప్రాంతంలో భయానక ఘటన జరిగింది. కత్తితో గొంతు కోసుకున్న 29 ఏళ్ల క్రిషన్‌ షేర్వాల్‌ వీధుల్లో తిరుగుతూ హల్‌చల్‌ చేశాడు. రక్తం కారుతున్న క్రిషన్‌ను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడ్ని పట్టుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసుల వద్ద తుపాకీ దొంగిలించిన క్రిషన్‌ గాల్లోకి కాల్పులు జరిపాడు. అతికష్టం మీద క్రిషన్‌ను పోలీసులు పట్టుకోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. #WATCH | Two PCR calls were received at 6:40 pm & 6:50 … Read more

    TSPSC పేపర్‌ లీక్‌.. సిట్‌ దర్యాప్తు ముమ్మరం

    TSPSC పరీక్షా పేపర్ల లీక్‌ ఘటనపై ‘సిట్‌’ దర్యాప్తును ముమ్మరం చేసింది. నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌లను చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న సిట్‌ అధికారులు అక్కడి నుంచి నేరుగా TSPSC కార్యాలయానికి తరలించారు. అనంతరం అక్కడి కాన్ఫిడెన్షియల్‌ రూమ్‌లోకి నిందితులను తీసుకెళ్లారు.టెక్నికల్‌ విషయాలపై ప్రవీణ్‌, రాజశేఖర్‌లను సిట్‌ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.పేపర్‌ లీక్‌ ఎలా జరిగిందన్న కోణంలో నిందితులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

    టీమిండియా ప్లేయర్ల సంబరాలు చూశారా?

    ఆసీస్‌తో తొలి వన్డేలో గెలిచిన తర్వాత టీమీండియా ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పటా పటా వికెట్లు పడినప్పటికీ కేఎల్ రాహుల్(75*), రవీంద్ర జడేజా(45*) పోరాటంతో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఆసిస్‌పై గెలిచింది. వీరిద్దరూ 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. #TeamIndia go 1⃣-0⃣ up in the series! ? ? An unbeaten 1⃣0⃣8⃣-run partnership between @klrahul & @imjadeja as India sealed a 5⃣-wicket win over … Read more

    స్వప్నలోక్ ప్రమాదం కలచి వేసింది; పీఎం మోదీ

    సికింద్రాబాద్‌ స్వప్నలోక్ ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ఘటనలో అమాయకుల ప్రాణాలు పోవడం తనను బాధించిం దని..గాయపడిన వారు కోలుకోవాలని ఆకాంక్షిం చారు. ఈ సందర్భంగా స్వప్నలోక్ మృతులకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థికసాయం చేయనున్నట్లు తెలిపారు. కాగా స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగి 6 మంది ప్రాణాలు కోల్పోయారు.

    టీసీఎస్ సీఈఓ ప్యాకేజీ ఎంతో తెలుసా?

    టీసీఎస్ సీఈఓ రాజేశ్ గోపీనాథన్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆరేళ్లుగా ఈ కంపెనీలో సీఈఓగా పనిచేస్తున్న రాజేశ్ వార్షిక వేతనం రూ.25.75 కోట్లు. ఇతర కంపెనీల సీఈఓలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. హెచ్‌సీఎల్ సీఈఓ సి.విజయ్‌కుమార్ రూ.123.13 కోట్ల ప్యాకేజీ తీసుకుంటున్నారు. ఆయన తర్వాతి స్థానంలో విప్రో సీఈఓ డెలాపోర్టే రూ.79.8 కోట్లు, ఇన్ఫోసిస్ సీఈఓ రూ.71.02 కోట్లు, టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ రూ.63.4 కోట్ల వార్షిక వేతనం తీసుకుంటున్నారు.

    మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. దాదాపు అర్ధగంట పాటు వీరి సమావేశం కొనసాగింది. ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన 14 అంశాలపై చర్చించారు. రాష్ట్ర విభజన హామీలు, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ప్రధానిని జగన్ కోరారు. కాగా నిన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం జగన్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ హోం మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు.

    పంజాబి నటుడిపై అమెరికాలో దాడి

    [VIDEO](url): ప్రముఖ పంజాబీ నటుడు అమన్‌ ధలివాల్‌పై అమెరికాలో గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. కత్తితో శరీరంపై పలుచోట్ల గాయపరిచాడు. కాలిఫోర్నియాలోని ప్లానెట్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. కసరత్తు చేసేందుకు వెళ్లిన ధలివాల్‌పై నిందితుడు దాడికి దిగడంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. అనంతరం తీవ్ర గాయాలపాలైన ఆయన్ను జిమ్‌ సిబ్బంది దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. పంజాబీతో పాటు హిందీ, తెలుగు చిత్రాల్లోనూ అమన్‌ నటించారు. पंजाबी एक्टर अमन धालीवाल पर अमेरिका में हमला, जिम करते … Read more