• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అసెంబ్లీ ఎదుట ఫడణవీస్, ఉద్ధవ్ ఠాక్రే ముచ్చట

    [VIDEO:](url) మహారాష్ట్ర రాజకీయాల్లో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. మహా డిప్యూటీ సీఎం ఫడణవీస్, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఒకరినొకరు పలకరించుకున్నారు. అసెంబ్లీలోకి ప్రవేశిస్తున్న సమయంలో వీరు తారసపడ్డారు. దీంతో అలా ముందుకు నడుస్తూ కాసేపు ముచ్చటించారు. గతంలో శివసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఫడణవీస్ సీఎంగా పనిచేసిన విషయం తెలిసిందే. అనంతరం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో బీజేపీ, శివసేన విడిపోయాయి. కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపి ఉద్ధవ్ ఠాక్రే గద్దెనెక్కారు. కానీ, ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో ఠాక్రే ప్రభుత్వం … Read more

    రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

    ప్రయాణికులకు భారత రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వేసవిలో తక్కువ ధరకే ఏసీ ప్రయాణ సౌకర్యం కల్పించబోతుంది. ఈ నెల 22 నుంచి ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ప్రయాణికులకు దుప్పట్లు కూడా అందించనుంది. ఈ మేరకు రైల్వే శాఖ ఉత్తర్వులు మంజూరు చేసింది.ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న వారికి రీఫండ్ ఇస్తామని ప్రకటించింది. కౌంటర్లలో టికెట్ బుక్ చేసుకున్న వారికి రైల్వే స్టేషన్ కౌంటర్లలో రీఫండ్ అందించనున్నట్లు తెలిపింది. రైల్వే ప్రయాణికులకు అత్యుత్తమమైన … Read more

    షారుక్‌ సినిమాలో బికినీలో నయనతార !

    షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో నయనతార రోల్ గురించి బజ్ వినిపిస్తోంది. ఆమె ముందు సినిమాలతో పోలీస్తే చాలా గ్లామర్‌గా కనిపించబోతుందని టాక్. నయన్ బికినీలో దర్శనమిస్తుందని వినిపిస్తోంది. ఫస్టాఫ్‌లోనే గ్లామర్‌ సీన్లు ఉంటాయని చెబుతున్నారు. ప్రతి సినిమాకు 6 నుంచి 7 కోట్లు తీసుకునే ఆమె… ఏకంగా 10 కోట్ల పారితోషికం తీసుకుంటుందని సమాచారం. కెరీర్ ప్రారంభంలో నయన్ స్కిన్‌ షో చేసేందుకు వెనుకాడ లేదు. వల్లభ చిత్రంలో శింభుతో లిప్‌ లాక్‌లు కూడా చేసింది. ఆ … Read more

    క్షణాల్లో కుప్పకూలిన పురాతన టవర్‌

    [VIDEO](url): గుజరాత్‌ సూరత్‌లోని ఓ పాత పవర్‌హౌజ్‌లోని కూలింగ్‌ టవర్‌ను అధికారులు నేలకూల్చారు. కంట్రోల్డ్‌ బ్లాస్టింగ్‌ ద్వారా క్షణాల్లో టవర్‌ను నేలమట్టం చేశారు. టవర్ నేలమట్టం కావడంతోనే ఒక్కసారిగా దుమ్ము చెలరేగింది. ఆ ప్రాంతంలోని పక్షులు ఎక్కడివక్కడ ఎగిరిపోయాయి. #WATCH | Gujarat: An old cooling tower of Utran Power House in Surat demolished with a controlled blast. pic.twitter.com/SeFug7Skk5 — ANI (@ANI) March 21, 2023

    ఎస్‌బీఐ ఆఫర్; రూ.7 వేల ఈఎంఐతో కొత్త కారు

    ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ తక్కువ ఈఎంఐలతో కారు లోన్లు అందిస్తోంది. తక్కువ వడ్డీ రేటు, తక్కువ ఈఎంఐలతో కొత్త కార్లను సొంతం చేసుకోవచ్చు. రూ.7,733 ఈఎంఐతో హ్యూందాయ్ శాంట్రో కారును దక్కించుకోవచ్చు. గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్‌పై ఈఎంఐ రూ.8,433 నుంచి ప్రారంభం అవుతుంది. హ్యూందాయ్ ఆరా కారుకు రూ.9,547 చెల్లించవచ్చు. హ్యూందాయ్ క్రెటా కారు ఈఎంఐ రూ.16,342 నుంచి ఉంది. అలాగే హ్యూందాయ్ కోన ఎలక్ట్రిక్ కారుపై ఈఎంఐ రూ.37,855 నుంచి ప్రారంభం అవుతుంది. పండుగ సమయంలో క్రెడిట్ కార్డుపైనా అదిరిపోయే … Read more

    ద్రాక్ష, ఉల్లిపాయలతో అసెంబ్లీ ఎదుట నిరసన!

    [VIDEO](url): మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉల్లిపాయలు, ద్రాక్షలతో నిరసనకు దిగారు. బుట్టల్లో వాటిని ప్రదర్శిస్తూ అసెంబ్లీ ఎదుట బైఠాయించారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. కాగా, ఇటీవల మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు ఉల్లి, ద్రాక్ష సహా పలు పంటలు దెబ్బతిన్నాయి. #WATCH | Opposition MLAs carry onions, grapes as they protest on … Read more

    గడువు తీరినా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు

    క్రెడిట్ కార్డు నిబంధనలను ఆర్బీఐ తాజాగా సవరించింది. గడువు తేదీ ముగిసినా ఎలాంటి జరిమానా లేకుండా బిల్లు చెల్లించేందుకు వీలు కల్పిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. గడువు తేదీ ముగిసిన 3 రోజుల వరకూ ఫైన్ లేకుండా బిల్లు కట్టవచ్చు. పైగా, ఇలా చేయడం వల్ల క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపదు. దీంతో ఎప్పుడైనా బిల్లు చెల్లించడం మర్చిపోయినా కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఆ 3 రోజుల సమయం కూడా దాటిపోతే క్రెడిట్ కార్డు కంపెనీలు పెనాల్టీలు విధిస్తాయి. బిల్లును బట్టి … Read more

    ఏప్రిల్‌1 కంటే ముందే పాఠశాలలు తెరవొద్దు!

    ఏప్రిల్‌ 1 కంటే ముందు పాఠశాలలు ప్రారంభిస్తే తీవ్రంగా పరిగణిస్తామని అనుబంధ సంస్థలకు సీబీఎస్‌ఈ హెచ్చరించింది. ఈ మేరకు సెక్రెటరీ అనురాగ్‌ త్రిపాఠీ ఉత్తర్వులు జారీ చేశారు. ‘అకడమిక్‌ సంవత్సరం ప్రారంభానికి ముందే కొన్ని CBSE అనుబంధ పాఠశాలలు క్లాసులు ప్రారంభిస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. నిర్దేశిత సమయం కంటే ముందే సిలబస్‌ పూర్తి చేసేందుకు యత్నిస్తే విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో వాళ్లు తీవ్ర అందోళనకు గురవుతారు’ అని అనురాగ్ అన్నారు.

    నటులకు ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్!

    అసోంలో సినిమా అవార్డు గ్రహీతలకు ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అయ్యాయి. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల ఆ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వేడుక జరిగింది. అస్సాం స్టేట్ ఫిల్మ్ ఫైనాన్స్ అండ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ దీనిని నిర్వహించింది. ఆ రాష్ట్ర సినీ పరిశ్రమకు చెందిన పలువురికి అవార్డులతోపాటు చెక్కులు అందజేశారు. వీరిలో ఎనిమిది మందికి చెందిన చెక్కులు బౌన్స్‌ అయ్యాయి. అయితే సాంకేతిక కారణాల వల్లే చెక్కులు బౌన్స్‌ అయినట్లు ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి తెలిపారు.

    వివాహేతర సంబంధం; తోటి సైనికుడి భార్య హత్య!

    యూపీలోని బరేలీ జిల్లాలో దారుణం జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి భార్యను ఆర్మీ జవాన్‌ నితీశ్‌ పాండే హత్య చేశాడు. తోటి జవాన్ మనోజ్ సేనాపతితో తన భార్యకు ఎఫైర్ ఉన్నట్లు నితీశ్‌ తెలుసుకున్నాడు. దీంతో మనోజ్‌ ఇంటికి వెళ్లిన నిందితుడు అతని భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో సుధేష్ణపై కత్తితో దాడికి తెగబడ్డాడు. తీవ్రగాయాలతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.