• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

    ప్రయాణికులకు భారత రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వేసవిలో తక్కువ ధరకే ఏసీ ప్రయాణ సౌకర్యం కల్పించబోతుంది. ఈ నెల 22 నుంచి ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ప్రయాణికులకు దుప్పట్లు కూడా అందించనుంది. ఈ మేరకు రైల్వే శాఖ ఉత్తర్వులు మంజూరు చేసింది.ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న వారికి రీఫండ్ ఇస్తామని ప్రకటించింది. కౌంటర్లలో టికెట్ బుక్ చేసుకున్న వారికి రైల్వే స్టేషన్ కౌంటర్లలో రీఫండ్ అందించనున్నట్లు తెలిపింది.

    @aniphoto

    రైల్వే ప్రయాణికులకు అత్యుత్తమమైన చౌకైన ఏసీ ప్రయాణం అందించడానికి భారతీయ రైల్వే త్రీ టైర్ ఎకానమీ కోచ్‌లను ప్రవేశపెట్టింది. ఇతర రైళ్లలో సాధారణ ఏసీ 3 టైర్‌ కోచ్‌ల కన్నా 3 టైర్‌ ఎకానమీ ఛార్జీలు చాలా తక్కువ. ఇందులోనూ తగ్గిస్తుండటం ప్రయాణికులకు కలిసొచ్చే విషయం. 

    @aniphoto

    గతసంవత్సరం జారీ చేసిన సర్క్యూలర్ ప్రకారం…. AC-3 టైర్ టికెట్ ధరతో సమానంగా 3 టైర్ ఎకానమీ రేట్లు ఉంటాయని నిర్ణయించారు. కానీ, ప్రయాణికులకు తక్కువ ధరకు ఏసీ ప్రయాణాన్ని కల్పించడం రైల్వే లక్ష్యం. అందుకే రేట్లను తగ్గిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏసీ 3 టైర్ ఎకానమీ బోగీలను 2021 సెప్టెంబర్‌లో అందుబాటులోకీ వచ్చాయి. ప్రవేశపెట్టిన ఏడాదిలోనే రూ. 231 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv