షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో నయనతార రోల్ గురించి బజ్ వినిపిస్తోంది. ఆమె ముందు సినిమాలతో పోలీస్తే చాలా గ్లామర్‌గా కనిపించబోతుందని టాక్. నయన్ బికినీలో దర్శనమిస్తుందని వినిపిస్తోంది. ఫస్టాఫ్‌లోనే గ్లామర్ సీన్లు ఉంటాయని చెబుతున్నారు. ప్రతి సినిమాకు 6 నుంచి 7 కోట్లు తీసుకునే ఆమె… ఏకంగా 10 కోట్ల పారితోషికం తీసుకుంటుందని సమాచారం.
కెరీర్ ప్రారంభంలో నయన్ స్కిన్ షో చేసేందుకు వెనుకాడ లేదు. వల్లభ చిత్రంలో శింభుతో లిప్ లాక్‌లు కూడా చేసింది. ఆ తర్వాత బిల్లాలోనూ గ్లామర్‌తో యువతను తనవైపుకి తిప్పుకుంది. కానీ, ఇటీవల పెళ్లి చేసుకున్న ఆమె మళ్లీ ఇలాంటి రోల్ చేస్తుందా అని చాలా మందికి అనుమానం కలుగుతుంది.
బాలీవుడ్ సినిమా అందులోనూ షారుఖ్ వంటి బడా హీరో సరసన నటించాలంటే కాస్త గ్లామర్ ఉండాల్సిందే. అలా అయితేనే.. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇటీవల షారుఖ్ పఠాన్ సినిమాలో దీపికా పదుకొణె అందాల ఆరబోత చూస్తేనే అర్థమవుతుంది. ఈ యాంగిల్‌లో ఆలోచించినట్లయితే నయన్ కూడా ఒప్పుకుంటుందనే అనుకోవాలి.
కొంతకాలంగా మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. అంజలి సీబీఐ, నేత్రికన్, O2 వంటి చిత్రాలు చేస్తోంది. మరోవైపు అగ్రహీరోల సరసన హీరోయిన్‌గాను నటిస్తోంది. ఇలాంటి తరుణంలో బికినీ లాంటి సీన్లు చేస్తుందో లేదో చూడాలి. అట్లీ దర్శకత్వం వహించిన బిగిల్ చిత్రంలో నయనతారనే హీరోయిన్. షారుక్ జవాన్ చిత్రానికి అట్లీనే దర్శకుడు.
Celebrities Featured Articles
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?