• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rahul Gandhi: అనర్హత వేటు నుంచి రాహుల్ తప్పించుకోగలడా? కేసులో శిక్షపడినా ఎంపీగా కొనసాగే అవకాశం ఉందా? 

    దేశమంతా ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించే చర్చిస్తోంది. పరువు నష్టం కేసులో ఆయన్ని కోర్టు దోషిగా తేల్చటం, రెండేళ్లు జైలు శిక్ష విధించడం… తీర్పు వచ్చిన 24 గంటల్లోనే ఎంపీ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం వంటివి చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఏం చేయనున్నారు? సభ్యత్వం రద్దు రాజ్యాంగబద్ధమేనా? పైకోర్టుకి వెళ్తే అనర్హత వేటు తొలిగిపోతుందా? అనే విషయాలు తెలుసుకుందాం. అసలేం జరిగింది? ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపేరును ఉద్దేశించి గతంలో రాహుల్‌ గాంధీ 2019లో వ్యాఖ్యలు … Read more

    అసెంబ్లీ ఎదుట ఫడణవీస్, ఉద్ధవ్ ఠాక్రే ముచ్చట

    [VIDEO:](url) మహారాష్ట్ర రాజకీయాల్లో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. మహా డిప్యూటీ సీఎం ఫడణవీస్, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఒకరినొకరు పలకరించుకున్నారు. అసెంబ్లీలోకి ప్రవేశిస్తున్న సమయంలో వీరు తారసపడ్డారు. దీంతో అలా ముందుకు నడుస్తూ కాసేపు ముచ్చటించారు. గతంలో శివసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఫడణవీస్ సీఎంగా పనిచేసిన విషయం తెలిసిందే. అనంతరం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో బీజేపీ, శివసేన విడిపోయాయి. కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపి ఉద్ధవ్ ఠాక్రే గద్దెనెక్కారు. కానీ, ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో ఠాక్రే ప్రభుత్వం … Read more

    ద్రాక్ష, ఉల్లిపాయలతో అసెంబ్లీ ఎదుట నిరసన!

    [VIDEO](url): మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉల్లిపాయలు, ద్రాక్షలతో నిరసనకు దిగారు. బుట్టల్లో వాటిని ప్రదర్శిస్తూ అసెంబ్లీ ఎదుట బైఠాయించారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. కాగా, ఇటీవల మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు ఉల్లి, ద్రాక్ష సహా పలు పంటలు దెబ్బతిన్నాయి. #WATCH | Opposition MLAs carry onions, grapes as they protest on … Read more

    వైకాపాకు షాక్‌; మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో తెదేపా గెలుపు

    ఏపీలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెదేపా విజయం సాధించింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడగా, పశ్చిమ రాయలసీమ (కడప-అనంతపురము-కర్నూలు) నియోజకవర్గం ఫలితం తాజాగా వెల్లడైంది. వైకాపా అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై 7,543 ఓట్ల ఆధిక్యంతో తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాలరెడ్డి గెలుపొందారు. ఈ స్థానంలో మొత్తం 49మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

    ఇది ప్రజావిజయం, మార్పునకు సంకేతం: చంద్రబాబు

    పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతలను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్‌ వేదికగా అభినందించారు. ఈ ఫలితాలు ప్రజావిజయం, మార్పునకు సంకేతమని వ్యాఖ్యానించారు. పట్టభద్రుల తీర్పు.. మంచికి మార్గం, రాష్ట్రానికి శుభసూచకమన్నారు. తెదేపా అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వైకాపా అక్రమాలకు ఎదురొడ్డి నిలిచిన పార్టీ శ్రేణులకు సెల్యూట్‌ చేస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెదేపా స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది.

    ఎమ్మెల్సీ ఫలితాలను హెచ్చరికగా భావించట్లేదు: సజ్జల

    ఏపీ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తెదేపా సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదని, ఈ ఫలితాలను హెచ్చరికగా భావించడం లేదన్నారు. ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదని, ఒక వర్గం ఓటర్లను రాష్ట్రం మొత్తానికి ఎలా అపాదిస్తారని ప్రశ్నించారు. 3 పట్టభద్రుల స్థానాల ఎన్నికల్లో రెండు చోట్ల తెదేపా గెలవగా, పశ్చిమ రాయలసీమలో మాత్రం వైకాపా, తెదేపా అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.

    ఇద్దరే నిందితులని కేటీఆర్‌ ఎలా చెప్తారు: రేవంత్

    TSPSC పేపర్ లీక్ వ్యవహారంలో రోజుకో నాటకం ఆడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. సిట్ చెప్పకుండానే ఇద్దరు నిందితులని కేటీఆర్ ఎలా చెప్తారని మండిపడ్డారు. 9 మందిని అరెస్ట్ చేస్తే ఇద్దరే నిందితులు ఎలా అవుతారని ప్రశ్నించారు. కేసును కేటీఆర్‌ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. BRS విస్తరణపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారని అందుకే ఎగ్జామ్స్ రద్దు చేసి చేతులు దులుపుకున్నారన్నారు. తెలంగాణ వచ్చాక ప్రతినోటిఫికేషన్‌ గందరగోళమేనని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. దాదాపు అర్ధగంట పాటు వీరి సమావేశం కొనసాగింది. ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన 14 అంశాలపై చర్చించారు. రాష్ట్ర విభజన హామీలు, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ప్రధానిని జగన్ కోరారు. కాగా నిన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం జగన్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ హోం మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు.

    కవిత, ED రోజంతా నాటకీయ పరిణామాలు-మళ్లీ నోటీసులు

    దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దర్యాప్తు వేగవంతం చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరేక్టరేట్‌… విచారణకు హాజురు కాలేనన్న కవిత విజ్ఞప్తిని అంగీకరించి మరో తేదీని ఖరారు చేసింది. ఈ నెల 20న వ్యక్తిగతంగా విచారణకు రావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. అంతేకాదు, ఇప్పటివరకు ఆమెను సాక్షిగా పరిగణించిన ఈడీ… ఇప్పుడు అనుమానితురాలిగా పేర్కొంది. దీంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. విచారణకు డుమ్మా ఉదయం నుంచి ఈ కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 11 గంటలకు విచారణ … Read more

    కరీంనగర్‌: రాష్ట్ర మంత్రి వర్సెస్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు…. గెలిచి నిలిచేదెవరో?

    ఉత్తర తెలంగాణలో కీలకమైన జిల్లా కరీంనగర్. వచ్చే ఎన్నికల వేళ ఇక్కడ ఉన్నంత హడావుడి మరెక్కడా ఉండదని చెప్పాలి. ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గంలో పోరు రసవత్తరం కానుంది. ఎందుకంటే భారాసకు మంచి పట్టు ఉండటంతో పాటు భాజపాకు బలం పెరగటమే కారణం. హ్యాట్రిక్‌ కొట్టి 15 ఏళ్లుగా జిల్లాను ఒంటి చేత్తో ఏలుతున్న గంగుల కమలాకర్‌… మెుదటిసారి ఎంపీగా గెలిచి ఏకంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడి మధ్య మళ్లీ పోరు జరిగే అవకాశం ఉంది. నియోజకవర్గం ఓటర్లు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మెుత్తంగా 16 … Read more