• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాలుడిపై వీధి శునకాలు దాడి

    TS: హైదరాబాద్‌లో అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా సంగారెడ్డి బాలాజీనగర్ కాలనీలోనూ ఓ చిన్నారిపై 5 కుక్కలు దాడికి ఎగబడ్డాయి. వెంటనే అక్కడున్న మహిళ వాటిని తరిమేయడంతో బాలుడు గాయాలతో బయట పడ్డాడు. వీధి కుక్కల విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తగిన రక్షణ కల్పించాలని కోరుతున్నారు. సంగారెడ్డిలోని బాలాజీనగర్ కాలనీలో ఆడుకుంటున్న బాలుడిని వెంబడించి కరిచిన 5 కుక్కలు. పక్కనే ఉన్న ఓ మహిళ … Read more

    హెలికాప్టర్ లేకే ప్రాణాలు పోయాయ్: సీతక్క

    TS: ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో 8 మంది గల్లంతై మృతి చెందారు. దీంతో వీరి మరణానికి కారణం అలసత్వమేనని ఆరోపించారు. సమయానికి హెలికాప్టర్‌ని పంపించి ఉంటే కనీసం ప్రాణాలైనా కాపాడుకునే వారమని ఆవేదన చెందారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని సీతక్క డిమాండ్ చేశారు. కాగా, జంపన్నవాగు ఉప్పొంగడంతో కొండాయి గ్రామం అతలాకుతలం అయింది. My heart broke to see 8 members lost their … Read more

    సోషల్‌మీడియాలో కాంగ్రెస్‌ VS బీఆర్‌ఎస్‌

    TS: పార్టీల మధ్య వివాదం సోషల్ మీడియాకెక్కింది. వరదలతో ధ్వంసమైన రోడ్ల ఫొటోలను షేర్ చేస్తూ ‘అవినీతితో వేసిన రోడ్లపై బంగారు తెలంగాణ ఇదిగో’ అంటూ కాంగ్రెస్‌ విమర్శించింది. దీనికి బీఆర్ఎస్ ధీటుగా స్పందించింది. అవినీతి గురించి ‘ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ’ మాట్లాడటం విడ్డూరమంటూ రిప్లై ఇచ్చింది. కాగా, చిల్లర రాజకీయాలు మానుకొని పార్టీలకతీతంగా సహాయక చర్యల్లో పాల్గొనాలని నెటిజన్లు సూచిస్తున్నారు. What an irony!The King of Corruption – 'All Indian Corruption Committee' is talking about corruption. … Read more

    బ్రో మూవీ ఫ్లెక్సీలను చించేసిన యాజమాన్యం

    AP: గూడూరులో K3K సంగం దియేటర్ దగ్గర కాసేపు గందరగోళం నెలకొంది. ఫ్యాన్స్‌కి, యాజమాన్యానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్కో ఫ్లెక్సీ కట్టడానికి యాజమాన్యం రూ.2500 డిమాండ్ చేయడంపై ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేశారు. సారీ చెప్పేంత వరకు స్క్రీనింగ్ జరగనివ్వబోమని మొండికేసి కూర్చోవడంతో యజమాన్యం దిగొచ్చింది. సయోధ్య కుదుర్చుకుని ఫ్లెక్సీలు కట్టేందుకు అనుమతించింది. దీంతో వివాదం సద్దుమణిగింది. వైసీపీ నేతల ప్రోద్బలంతోనే ఫ్లెక్సీలు చించేశారని ఫ్యాన్స్ ఆరోపించారు. గూడూరులో K3K సంగం దియేటర్ దగ్గర గందరగోళం.. పవన్ కళ్యాణ్ బ్రో సినిమా … Read more

    5కి.మీ మేర నిలిచిన వాహనాలు

    TS: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామయ్యింది. ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచపోయాయి. హైవేపై వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు రాకపోకలను నిలిపి వేశారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్ నగర్, మిర్యాల గూడ మీదుగా మళ్లిస్తున్నారు. దీంతో కోదాడ- హుజూర్ నగర్ రహదారిపై దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ – విజయవాడ హైవే మీద భారీగా ట్రాఫిక్ జాం.. నిలిచిన రాకపోకలు ఐతవరం వద్ద హైవేపై … Read more

    తీరానికి కొట్టుకొచ్చిన నీలి తిమింగళం

    AP: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్ర తీరానికి అరుదైన నీలి తిమింగళం(బ్లూ వేల్) మృతదేహం కొట్టుకొచ్చింది. ఈ తిమింగళం సుమారు 25 అడుగులు పొడవు 5 టన్నులు బరువు ఉంటుందని స్థానిక మత్స్యకారులు అంచనా వేస్తున్నారు. ఈ తరహా తిమింగళాలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని తెలిపారు. సముద్రంలో లోతులేని ప్రాంతంలోకి చేరి ఈ తిమింగలం చనిపోయి ఉండవచ్చని మత్స్యకారులు భావిస్తున్నారు. కాగా, ఈ తిమింగళాన్ని చూడటానికి చూపరులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం … Read more

    సునామీ కన్నా తక్కువ కాదు: సీతక్క

    TS: భారీ వరదలకు ములుగు జిల్లా అతలాకుతలం అయింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే సీతక్క పర్యటించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. జంపన్న వాగు ఉప్పొంగడంతో మేడారం, కొండాయి గ్రామాలు చెల్లా చెదురయ్యాయి. రోడ్లు కొట్టుకుపోయి.. బ్రిడ్జిలు కుంగిపోయాయి. ప్రాణాలను పణంగా పెట్టి కూలిన బ్రిడ్జిని సైతం దాటుకొని పర్యటించాల్సి వస్తోందని ఆమె తెలిపారు. ఈ వరద సృష్టించిన బీభత్సాన్ని ఉద్దేశించి సునామీ కన్నా తక్కువేమీ కాదని సీతక్క పోల్చారు. It’s not less than a tsunami.crossed the collapsed bridge … Read more

    భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే సీతక్క

    TS: ములుగు ఎమ్మెల్యే సీతక్క కంటతడి పెట్టారు. వరదలతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారని ఆవేదన చెందారు. ‘దయచేసి కేటీఆర్‌ గారిని అడుగుతున్నా. ఒక్క హెలికాప్టర్ పంపించండి. రెస్క్యూ టీం శాయాశక్తులా ప్రయత్నిస్తున్నా తరలింపు చర్యలు పూర్తి కావట్లేదు. 9 గంటల నుంచి హెలికాప్టర్ కోసం వేడుకుంటున్నాం. ఇకనైనా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి’ అంటూ సీతక్క కోరారు. ఏటూరు నాగారం మండలంలో కొండై గ్రామస్థులు దాదాపు 100 మంది ప్రాణాలతో పోరాడుతున్నారని ఆమె తెలిపారు. Please send helicopters to save our … Read more

    ప్రభుత్వమే బాధితుల్ని ఆదుకోవాలి: సీతక్క

    TS: ములుగు ఎమ్మెల్యే సీతక్క వరద ప్రభావిత ప్రాంత ప్రజలను పరామర్శించారు. ఆయా గ్రామాల్లో పర్యటించి బాధితులను ఓదార్చారు. నియోజకవర్గంలో పరిస్థితి మరింత దిగజారిందని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. వరదలల కారణంగా గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని చెప్పారు. ఈ వరదలతో ఎంత మేరకు ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందో చెప్పలేమని సీతక్క వెల్లడించారు. ప్రభుత్వం స్పందించి వీలైనంత త్వరగా రక్షణ చర్యలు చేపట్టాలని సీతక్క విన్నవించారు. ట్విటర్‌లో వీడియోను షేర్ చేశారు. Situation is very dangerous in my … Read more

    ఈటెల సీఎం అంటూ నినాదాలు

    TS: బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటెల రాజేందర్ పార్టీలో కీలక నేతగా మారారు. నేడు ఆయన షాద్‌నగర్‌లో పర్యటించగా అక్కడి నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేశారు. దీంతో వెంటనే ఈటెల స్పందించి వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ‘ష్ ష్’ అంటూ వేలిని నోటిపై వేసి సైగ చేశారు. దీంతో నాయకులు నినాదాన్ని మార్చారు. అయితే, ఈ వీడియో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. షాద్ నగర్ … Read more