• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రుషికొండపై ట్వీట్.. సరిచేసుకున్న వైసీపీ

    AP: రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పడంపై వైసీపీ మాట మార్చింది. నిన్న రాత్రి చేసిన ట్వీట్ పొరపాటుగా వచ్చిందని, అక్కడ కడుతున్నది ప్రభుత్వ నిర్మాణాలేనని స్పష్టం చేసింది. ‘మా అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్‌ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన ట్వీట్‌లో పొరపాటున పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణలోకి తీసుకోగలరు’ అని వైసీపీ ట్వీట్ చేసింది. మా అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్‌ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన … Read more

    పవన్ కళ్యాణ్ అందుకే నన్ను వదిలేశాడు: రేణుదేశాయ్

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తాను మద్దతు ఇస్తున్నట్లు ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ ప్రకటించారు. ‘పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదు. సమాజం, పేద వాళ్లకు మంచి చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం కుటుంబాన్ని ప్రక్కన పెట్టారు. పవన్ కళ్యాణ్ మూడు 3 పెళ్లిళ్ల పై చర్చ అపండి. పెళ్లిళ్లు, భార్యలు, పిల్లలపై ఓ సినిమా, వెబ్ సిరీస్ తీస్తున్నట్లు కొందరు అన్నారు. నా పిల్లలనే కాదు మిగతా ఇద్దరు పిల్లలను కూడా దయచేసి ఇందులోకి లాగకండి. ఓ తల్లిగా ఇది నా అభ్యర్థన … Read more

    అప్పు తిరిగివ్వాలని కుటుంబం సూసైడ్

    గోదావరిఖని- కళ్యాణ్ నగర్‌కు చెందిన శ్రీనివాస్ గతంలో అదే కాలనీకి చెందిన కైలాసానికి రూ.6.5 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఇప్పటికీ తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన చెందిన శ్రీనివాస్ తన కుటుంబంతో పాటు కైలాసం ఇంటి ఎదుట కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నామని, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇరువర్గాలను మందలించిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వాలని కుటుంబం ఆత్మహత్యాయత్నం గోదావరిఖని పట్టణంలోని కళ్యాణ్ నగర్‌కు చెందిన శ్రీనివాస్ గతంలో … Read more

    వందేభారత్‌కు తప్పిన ప్రమాదం

    వందేభారత్ రైలుకు ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న వందేభారత్ రైలులో పొగలు రావడంతో నిలిపివేశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా మునుబోలు రైల్వేస్టేషన్‌లో జరిగింది. ఓ టికెట్ లేని వ్యక్తి వాష్‌రూమ్‌లో సిగరెట్ కాల్చి పడేశాడు. అది ప్లాస్టిక్ వస్తువులకు అంటుకోవడంతో పొగలు అలుముకున్నాయి. దీంతో రైలు మొత్తం దట్టమైన పొగలు అంటుకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దాదాపు అర గంటకుపైగా రైలు నిలిచిపోయింది. వందే భారత్ రైలులో పొగలు గూడూరు – మనుబోలు మధ్య రైలు నిలిపివేత. తిరుపతి నుంచి … Read more

    గద్దర్ నటించిన ఫస్ట్ సినిమా ఇదే!

    ప్రజా యుద్ధ నౌక గద్దర్ సినీరంగంలోనూ తనదైన ముద్ర వేశారు. తన పాటల పదునుతో సామాజిక స్పృహ కల్పించారు. తొలిసారి ఆయన 1979లో విడుదలైన ‘మా భూమి’ సినిమాలో బండెనక బండి కట్టి పాటలో కనిపించారు. ఆతర్వాత ‘ఒరేయ్ రిక్షా’ మూవీలో ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమా’ పాటను రాశారు. అమ్మ తెలంగాణమా, జైభోలో తెలంగాణ సినిమాలో పొడుస్తున్న పొద్దుమీద వంటి పాటలు తెలంగాణ ఉద్యమానికి మరింత ఊపుతెచ్చాయి. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమా’ పాటకు నంది అవార్డు వచ్చినా ఆ … Read more

    మీమ్స్ రూపంలో ఫ్రెండ్‌షిప్ డే విషెస్

    Friendship Day Memes: ‘మీమ్స్’(Memes)కి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. సోషల్ మీడియా యూజర్లకు ఇవి లేకపోతే ఏదో కోల్పోయినట్లు ఉంటుంది. అందుకే ఏ సందర్భాన్నైనా మీమ్స్ రూపంలో సెలబ్రేట్ చేసుకుంటారు. నేడు ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా మీమర్లు పలు రకాల మీమ్స్, వీడియో మీమ్స్ చేస్తున్నారు. ‘హ్యాపీడేస్’ మూవీలోని సాంగ్‌తో బ్రహ్మానందం సీన్లను ఎడిట్ విషెస్ చెబుతున్నారు. హైదరాబాద్ హవా ట్విట్టర్ ఛానల్‌లో పోస్ట్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీరూ చూసేయండి. Happy Friendship Day❤Tag Ur Friends? pic.twitter.com/19oRuD2j7v — Hyderabad … Read more

    వచ్చే అసెంబ్లీలో నేను ఉండనేమో: రాజాసింగ్

    TS: అసెంబ్లీలో మూడో రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగాా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇందులో ఎంతమంది ఉంటారో, ఎంతమంది ఉండరో తెలియదు. నేనైతే ఉండనేమోనని అనిపిస్తోంది అధ్యక్షా. ఎందుకంటే నాకు తెలిసిపోతోంది. బయటివాళ్లు, సొంతవాళ్లు కూడా నేను రావొద్దనే అనుకుంటున్నారు. ఏదేమైనా, నేను, వచ్చినా రాకపోయినా మా ధూళ్‌పేట్ ప్రజలపై సీఎం కేసీఆర్, ప్రభుత్వ ఆశీస్సులు ఉండాలి. వారికి ఏదైనా ఉపాధి కల్పించండి’ అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల తర్వాత నేను అసెంబ్లీలో నేను … Read more

    మళ్లీ మాట జారిన మంత్రి మల్లారెడ్డి

    తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి మాట జారారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ఎన్నికల స్టంట్ అని ఆయన టంగ్ స్లిప్ అయ్యారు. ‘‘టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా సీఎం కేసీఆర్ గుర్తించారు. ఎన్నికల స్టంట్ అనుకోండి.. ఏదైనా అనుకోండి. మాది రాజకీయ పార్టీ. ఎలక్షన్లకు వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల స్టంట్ ఉంటుంది.’’ అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. వెంటనే సవరించుకుని.. ఏదైతేనేం కార్మికులకు మంచి జరిగింది కదా అంటూ సర్దిచెప్పుకున్నారు. Mallareddy: మాది రాజకీయ పార్టీ.. ఎన్నికల స్టంట్ ఎట్లైనా ఉంటది: … Read more

    మానవత్వం చాటుకున్న సీఐ, ఎస్సై

    TS: భూపాలపల్లి సీఐ, చిట్యాల ఎస్సై మానవత్వాన్ని చాటుకున్నారు. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిని ఇటీవల వరద ముంచేసింది. దీంతో నలుగురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. అయితే, శవం కుళ్లిన స్థితిలో ఉండటంతో ఎవరూ దగ్గరికి రాలేదు. ఈ క్రమంలో భూపాలపల్లి సీఐ రాంనర్సింహా రెడ్డి శవాన్ని ఓ కట్టెకు కట్టించి స్వయంగా మోసుకొచ్చారు. చిట్యాల ఎస్సై రమేశ్ సాయం తీసుకున్నారు. దాదాపు రెండున్నర కిలోమీటర్ల పాటు మోసుకొచ్చి బంధువులకు అప్పగించారు. దీంతో వీరిని జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే గండ్ర అభినందించారు. … Read more

    రేవంత్ పర్యటన.. ఉప్పల్‌లో ఉద్రిక్తత

    HYD: ఉప్పల్‌లో కాంగ్రెస్ నేతలు మధ్య ఘర్షణ తలెత్తింది. రేవంత్ పర్యటన నేపథ్యంలో రేగా లక్ష్మారెడ్డి ఫ్లెక్సీలను మందముల పరమేశ్వర్ రెడ్డి అనుచరులు చించేశారు. ఈ తతంగాన్ని వీడియో తీసిన వ్యక్తులపై లక్ష్మారెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. పోలీసుల ఎదుటే తీవ్రంగా దూషిస్తూ కొట్టారు. ఈ క్రమంలో ఓ పోలీసు అధికారి కిందపడ్డారు. రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడంతో ఉప్పల్‌లో ఉద్రిక్తత నెలకొంది. ‘ఎంపీ కనబడుట లేదు’ అనే పోస్టర్లు వెలిసిన అనంతరం రేవంత్ ఈ పర్యటన చేపట్టడం గమనార్హం. రేవంత్ రెడ్డి పర్యటనలో … Read more