• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బెల్లంపల్లి PSలో నిందితుడు మృతి

    తెలంగాణలోని బెల్లంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఓ నిందితుడు ఫిట్స్‌తో మృతి చెందాడు. అతడు కుప్పకూలిపోవడం సీసీ కెమెరాలో రికార్డైంది. కీర్తి అంజి(27) అనే యువకుడు ఇటీవల ఓ మహిళ ఇంటికి వెళ్లి ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్ చేశారు. విచారణ కోసం అంజి పోలీస్ స్టేషన్‌లోని కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో ఫిట్స్ వచ్చి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లలేదని యువకుడి బంధువులు ఆరోపిస్తున్నారు. బెల్లంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిట్స్ వచ్చి నిందితుడు మృతి మంచిర్యాల … Read more

    తప్పు చేశా.. క్షమాపణ కోరా: తలసాని

    TG: భైంసా ఏఎంసీ ఛైర్మన్‌ రాజేష్‌కుమార్‌ బాబును మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నెట్టేసిన ఘటన వివాదాస్పదం కావడం తెలిసిందే. దీనిపై మంత్రి వివరణ ఇచ్చారు. ‘ఆయన బూటుతో నా కాలు తొక్కాడు. ఆ బాధలో ఆయన్ను వెనక్కి లాగా. అతను గిరిజనుడు, భైంసా ఏఎంసీ చైర్మన్‌ అని తర్వాత తెలిసింది. వెంటనే ఆయనకు ఫోన్‌ చేసి పొరపాటు జరిగిందని చెప్పి క్షమాపణ కోరా. అతనితో పాటు గిరిజన సమాజానికి నా క్షమాపణలు. కొందరు కావాలనే ఈ విషయాన్ని పెద్దది చేస్తున్నారు’ అని తలసాని … Read more

    మైనంపల్లి ఆడియో లీక్: వైరల్

    మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆడియో కాల్ లీకైంది. ప్రస్తుతం ఈ ఆడియో కాల్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘‘మోదీ, కేసీఆర్, కేటీఆర్‌లకు కూడా నేను భయపడను. నేను తలచుకుంటే ఎవరినైనా మర్డర్ చేయగలను. టీడీపీలో ఉన్నప్పుడు నేను ఒక్కడినే సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్ధతిచ్చాను. మహేందర్ రెడ్డి, రేవంత్‌రెడ్డిలకు కూడా అప్పట్లో వార్నింగ్ ఇచ్చా. బాల్క సుమన్‌ను హైదరాబాద్‌లో తిరగలేవని చెప్పా.’’ అంటూ తీవ్ర పదజాలంతో మైనంపల్లి మాట్లాడారు. రేవంత్ రెడ్డిని తొక్కుతానాన్న మైనంపల్లి హన్మంతరావు.. ఆడియో వైరల్ నేను కేసీఆర్, కేటీఆర్, మోడీ ఎవరికీ … Read more

    భోరున ఏడ్చేసిన BRS ఎమ్మెల్యే

    స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భోరున ఏడ్చేశారు. ఎమ్మెల్యేను ఓదారుస్తూ పక్కనున్నవారు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నిన్న సీఎం కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితాలో రాజయ్యకు టికెట్ రాలేదు. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురైన రాజయ్య.. అంబేడ్కర్ విగ్రహం ముందు మోకరిల్లి వెక్కి వెక్కి ఏడ్చాడు. కాగా కేసీఆర్ తనకు టికెట్ ఇవ్వకపోయినా పార్టీ గీత దాటనని రాజయ్య స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో అంబేడ్కర్ విగ్రహం ముందు పడుకొని … Read more

    BRS తొలి జాబితా ఇదే

    వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీఆర్ఎస్ తన తొలి జాబితా విడుదల చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో పూర్తి జాబితా ప్రకటించారు. మొత్తం 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను కేటాయించారు. నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. మరో 4 రోజుల్లో ఈ నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిపారు. జనగామ, గోషామహల్, నాంపల్లి, నర్సాపూర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. పూర్తి జాబితా కోసం YouSay Webపై క్లిక్ చేయండి. రానున్న తెలంగాణ శాసనసభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను (115 … Read more

    మంత్రి హరీశ్‌కు BRS ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

    మంత్రి హరీశ్ రావుకు మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మైనంపల్లి మాట్లాడుతూ ‘‘నేను ఎక్కడ పోటీ చేయాలో చెప్పడానికి హరీశ్ ఎవరు? నేను మల్కాజ్‌గిరి.. నా కుమారుడు మెదక్ నుంచి పోటీ చేస్తాం. ఎవరు అడ్డుకుంటారో చూస్తా. హరీశ్ కీప్‌నకు కూడా టికెట్ కేటాయిస్తున్నారు. అలాంటప్పుడు మా ఇంట్లో రెండు టికెట్లు ఎందుకివ్వరు. సిద్దిపేటలో హరీశ్‌ను ఓడిస్తా.’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. Talks in political circles—that BRS Malkajgiri MLA … Read more

    STEEL BRIDGE: హైదరాబాద్ సిగలో మరో మణిహారం… దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం… ప్రత్యేకతలు ఇవే!

    దక్షిణ భారతదేశంలో అతిపెద్దదైన స్టీల్ బ్రిడ్జి హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వ్యూహాత్మక రోడ్ల(SRDP) అభివృద్ధిలో భాగంగా 36వ ప్రాజెక్టుగా మంత్రి కేటీఆర్ దీనిని ప్రారంభించారు.  ఇందిరాపార్కు నుంచి VST వరకు 2.62 కిలోమీటర్ల పొడవున దీనిని నిర్మించారు. ఈ స్టీల్ బ్రిడ్జికి బీఆర్ఎస్ మాజీమంత్రి, దివంగత నేత నాయిని నరసింహారెడ్డి పేరును తెలంగాణ ప్రభుత్వం బ్రిడ్జికి పెట్టింది. మరి ఈ బ్రిడ్జి ప్రత్యేకతలు, దీని వల్ల నగరవాసులకు కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం. ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు వాహనాల ట్రాఫిక్‌, రవాణాలో చోటు … Read more

    ట్రంప్‌కు పోటీగా భారత సంతతి వ్యక్తి

    అమెరికా అధ్యక్షుడి పదవి కోసం పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వివేక్ రామస్వామిపై ఎలాన్ మస్క్ ప్రశంసలు కురిపించారు. అతను చాలా నమ్మకమైన నాయకుడంటూ ట్విట్ చేశారు. త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరఫున ముగ్గురు భారత సంతతికి చెందిన వ్యక్తులు అధ్యక్ష అభ్యర్థుల బరిలో ఉన్నారు. నిక్కీ హాలే, హిర్ష్‌వర్ధన్ సింగ్, వివేక్ రామస్వామి పోటీ పడుతున్నారు. అయితే వీరందరికంటే డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థి రేసులో ముందు వరుసలో ఉన్నారు. Ep. 17 Vivek … Read more

    BRS Contestants List 2023: గులాబీ బాస్ రెడీ చేసిన MLA అభ్యర్థుల లిస్ట్ ఇదే..!

    ws_Live-Updates-CM-KCR-national-party-name

    తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార బీఆర్ఎస్ పార్టీ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుని బరిలోకి దిగుతోంది. కచ్చితంగా గెలుస్తామన్న ధీమా ఉన్న నియోజకవర్గాల లిస్ట్‌ని తొలి జాబితాలో వెల్లడించనుంది. ఈ మేరకు ఇప్పటికే లిస్ట్ ఫైనలైజ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇలా ఫస్ట్ లిస్ట్‌లో దాదాపు 80 నుంచి 90 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. మిగతా నియోజకవర్గాల్లో బుజ్జగింపులు, సర్దుబాట్లు చూసి రెండో విడతలో తుది జాబితాను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అయితే, తొలి విడతలో అభ్యర్థులకు టికెట్లు ఖరారైనట్లుగా ఓ … Read more

    ఊత కర్రలు వచ్చేశాయ్!

    తిరుమలలో కాలినడకన వెళ్లే భక్తుల కోసం టీటీడీ ఊతకర్రలు సిద్ధం చేసింది. భక్తుల ఆత్మరక్షణ కోసం ఊతకర్రలు ఇచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది. భారీ ఎత్తున ఊతకర్రలు దిగుమతి చేసుకుంది. వీటిని త్వరలోనే కాలినడక భక్తులకు అందజేయనున్నారు. కాగా ఇటీవల తిరుమల కాలినడక మార్గంలో చిరుతల సంచారం ఎక్కువైంది. ఓ ఆరేళ్లను పాపను కూడా చిరుత చంపేసింది. దీంతో చిరుతల నుంచి రక్షణ కోసం ఊతకర్రలు అందించనుంది. తిరుమలలో కాలి నడకన వెళ్లే భక్తులకు ఊతకర్రలు ఇచ్చేందుకు సిద్దమవుతోన్న … Read more