తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార బీఆర్ఎస్ పార్టీ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుని బరిలోకి దిగుతోంది. కచ్చితంగా గెలుస్తామన్న ధీమా ఉన్న నియోజకవర్గాల లిస్ట్‌ని తొలి జాబితాలో వెల్లడించనుంది. ఈ మేరకు ఇప్పటికే లిస్ట్ ఫైనలైజ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇలా ఫస్ట్ లిస్ట్‌లో దాదాపు 80 నుంచి 90 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. మిగతా నియోజకవర్గాల్లో బుజ్జగింపులు, సర్దుబాట్లు చూసి రెండో విడతలో తుది జాబితాను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అయితే, తొలి విడతలో అభ్యర్థులకు టికెట్లు ఖరారైనట్లుగా ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అధికారికంగా వెల్లడించనప్పటికీ ప్రచారం అవుతున్న అభ్యర్థులు, స్థానాల వివరాలు ఉమ్మడి జిల్లాల వారీగా చూద్దాం.
ఉమ్మడి మెదక్
సిద్దిపేట- హరీశ్ రావు
గజ్వేల్- కేసీఆర్
దుబ్బాక- కొత్త ప్రభాకర్ రెడ్డి
పఠాన్‌చెరు- గూడెం మహిపాల్ రెడ్డి
హైదరాబాద్
సనత్ నగర్- తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్- పద్మారావు
జూబ్లీహిల్స్- మాగంటి గోపీనాథ్
ఖైరతాబాద్- దానం నాగేందర్
ముషీరాబాద్- ముఠా గోపాల్
రంగారెడ్డి
శేరిలింగంపల్లి- అరికెపూడి గాంధీ
కూకట్పల్లి- మాధవరం కృష్ణారావు
కుత్బుల్లాపూర్- కేపీ వివేకానంద
మేడ్చల్- మల్లారెడ్డి
మల్కాజిగిరి- మైనంపల్లి హన్మంతరావు
వికారాబాద్- మెతుకు ఆనంద్
తాండూరు- పైలట్ రోహిత్ రెడ్డి
ఎల్బీనగర్- దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
మహేశ్వరం- సబితా ఇంద్రారెడ్డి
వరంగల్
పాలకుర్తి- ఎర్రబెల్లి దయాకర్ రావు
జనగాం- పల్లా రాజేశ్వర్ రెడ్డి
పరకాల- చల్లా ధర్మారెడ్డి
నర్సంపేట- పెద్ది సుదర్శన్ రెడ్డి
వరంగల్ ఈస్ట్- వద్దిరాజు రవిచంద్ర
వరంగల్ వెస్ట్- దాస్యం వినయ్ భాస్కర్
స్టేషన్ ఘన్పూర్- కడియం శ్రీహరి
భూపాలపల్లి- గండ్ర వెంకటరమణా రెడ్డి
వర్ధన్నపేట- ఆరూరి రమేశ్
కరీంనగర్
సిరిసిల్ల- కేటీఆర్
కరీంనగర్- గంగుల కమలాకర్
మానకొండూరు- రసమయి బాలకిషన్
రామగుండం- కోరుగంటి చందర్
హుస్నాబాద్- వొడితెల సతీష్
మహబూబ్ నగర్
నాగర్‌కర్నూల్- మర్రి జనార్ధన్ రెడ్డి
కొడంగల్- పట్నం మహేందర్ రెడ్డి
మహబూబ్ నగర్- శ్రీనివాస్ గౌడ్
వనపర్తి- నిరంజన్ రెడ్డి
జడ్చర్ల- లక్ష్మారెడ్డి
దేవరకద్ర- ఆల వెంకటేశ్వర్ రెడ్డి
మక్తల్- చిట్టెం రామ్మోహన్ రెడ్డి
ఆదిలాబాద్
ఆసిఫాబాద్- ఆత్రం సక్కు
ఆదిలాబాద్- జోగు రామన్న
బోథ్- రాథోడ్ బాపూరావు
నిర్మల్- అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
చెన్నూరు- బాల్క సుమన్
నల్గొండ
సూర్యాపేట- జగదీశ్వర్ గౌడ్
నల్గొండ- కంచర్ల భూపాల్ రెడ్డి
భువనగిరి- అనిల్ రెడ్డి
ఆలేరు- పైళ్ల శేఖర్ రెడ్డి
హుజూర్ నగర్- శానంపూడి సైదిరెడ్డి
తుంగతుర్తి- గాదరి కిషోర్
నకిరేకల్- చిరుమర్తి లింగయ్య
నిజామాబాద్
ఆర్మూర్- జీవన్ రెడ్డి
బాల్కొండ- ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ రూరల్- బాజిరెడ్డి గోవర్ధన్
బోధన్- షకీల్
నిజామాబాద్ అర్బన్- గణేష్ బిగాలా
బాన్సువాడ- పోచారం శ్రీనివాస్
ఖమ్మం
పినపాక- రేగా కాంతారావు
ఖమ్మం- పువ్వాడ అజయ్
పాలేరు- కందాల ఉపేందర్ రెడ్డి
సత్తుపల్లి- సండ్ర వెంకటవీరయ్య
ఇల్లందు- బానోత్ హరిప్రియ నాయక్