కలెక్షన్ల పరంగా, వినోదం పరంగా గతవారం తెలుగు ఇండస్ట్రీకి తీవ్ర నిరాశ మిగిల్చింది.’కంగువ’, ‘మట్కా’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో ఈవారం విడుదలయ్యే కొత్త సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ వారం పెద్ద హీరోల సినిమాలు లేనప్పటికీ.. విష్వక్ సేన్ నటించిన ‘మెకానిక్ రాకీ’ కాస్త చెప్పుకోదగింది. ఆ తర్వాత ‘రోటీ కపడా రొమాన్స్’, ‘జీబ్రా’, లాంటి చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మరోవైపు ఓటీటీలో 30కి పైగా కొత్త చిత్రాలు- వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి. మరి ఆ చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.
దేవకీ నందన వాసుదేవ
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా చేస్తోన్న రెండో చిత్రం ‘దేవకి నందన వాసుదేవ‘. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ట్రైలర్‌లో అశోక్ మంచి స్క్రీన్ ప్రజెన్స్‌లో కనిపించారు. ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకుడు. హీరోయిన్‌గా మాజీ మిస్ ఇండియా మానస వారణాసి నటిస్తోంది. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథను అందించారు. తొలుత ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేయాలనుకున్నప్పటికీ… ఈ వారంలో నవంబర్ 22న విడుదల చేస్తున్నారు.
మెకానిక్ రాకీ
సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న విష్వక్ సేన్.. మరో విభిన్నమైన కథతో మెకానిక్ రాకీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్‌పై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ‘మెకానిక్ రాకీ చిత్రం ద్వారా రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ట్రైయాంగిల్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మాత. నవంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది.
రోటి కపడా రొమాన్స్
గత ఏడాదిగా వివిధ కారణాల చేత వాయిదా పడుతూ వస్తున్న రోటి కపడా రొమాన్స్ ఎట్టకేలకు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హాట్ బ్యూటీ నువేక్ష, హర్ష నర్రా, ఖుష్బు చౌదరీ, మేఘలేఖ, తరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను విక్రమ్ రెడ్డి డైరెక్ట్ చేశారు.
జీబ్రా
విలక్షణ నటుడు సత్యదేవ్ కంచరాణా ప్రధాన పాత్రలో తెలుగులో రాబోతున్న చిత్రం జీబ్రా. విభిన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ సాధించింంది. ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ అమృత అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈశ్వర్ కార్తిక్ డైరెక్ట్ చేయగా.. దినేష్ సుందరం ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఈ వారం( November 18- 24) ఓటీటీలో విడుదల కానున్న తెలుగు చిత్రాలు
మరో వైపు ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాల విషయానికి వస్తే, ‘నయనతార లైఫ్ డాక్యుమెంటరీ, కిష్కింద కాండం’ అనే డబ్బింగ్ సినిమా, దీనితో పాటు రానా హోస్ట్ చేసిన టాక్ షో ‘ఉన్నంతలో’ కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు మరికొన్ని హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు/ వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
Platform | Movie/Webseries Name | Language/Type | Release Date |
Hotstar | Kishkindha Kandam | Telugu Dubbed Movie | November 19 |
Interior Chinatown | English Series | November 19 | |
Alien: Romulus | English Movie | November 21 | |
Bia & Victor | Portuguese Series | November 22 | |
Out of My Mind | English Movie | November 22 | |
ETV Win | I Hate Love | Telugu Movie | November 21 |
Repathi Velugu | Telugu Movie | November 21 | |
Netflix | Nayanthara: Beyond the Fairytale | Documentary | November 18 |
Wonderoos Season 2 | English Series | November 18 | |
Zombiverse Season 2 | Korean Series | November 19 | |
See Her Again | Cantonese Series | November 20 | |
Adoration | Italian Series | November 20 | |
A Man on the Inside | English Series | November 21 | |
Tokyo Over Ride | Japanese Series | November 21 | |
Joy | English Movie | November 22 | |
Pokémon Horizons Part 4 | Japanese Series | November 22 | |
Spellbound | English Movie | November 22 | |
The Helicopter Heist | Swedish Series | November 22 | |
The Piano Lesson | English Movie | November 22 | |
Transmith | Spanish Movie | November 22 | |
Yeh Kaali Kaali Ankhein Season 2 | Hindi Series | November 22 | |
The Empress Season 2 | German Series | November 22 | |
Amazon Prime | Campus Beats Season 4 | Hindi Series | November 20 |
Wack Girls | Hindi Series | November 22 | |
Pimpinero | Spanish Movie | November 22 | |
The Rana Daggubati Show | Telugu Talk Show | November 23 | |
Jio Cinema | Dune: Prophecy | English Series | November 18 |
Based on a True Story Season 2 | English Series | November 22 | |
The Sex Lives of College Girls Season 3 | English Series | November 22 | |
Harold and the Purple Crayon | English Movie | November 23 | |
Manorama Max | Tekku Vadakku | Malayalam Movie | November 19 |
Apple TV+ | Blitz | English Movie | November 22 |
BookMyShow | From Darkness | Swedish Movie | November 22 |
The Girl in the Trunk | English Movie | November 22 | |
The Night My Dad Saved Christmas | Spanish Movie | November 22 | |
Lionsgate Play | Greedy People | English Movie | November 22 |
Celebrities Featured Articles Political Figure
Revanth Reddy: టాలీవుడ్‌పై రేవంత్ సర్కార్ పగ? వరుస ఘటనలు ఏం చెబుతున్నాయి?