‘కేజీయఫ్’ (KGF), ‘కాంతార’ (Kantara), ‘సలార్’ (Salaar) తదితర చిత్రాలను ప్రేక్షకులను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (hombale films) మరో సరికొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించింది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో ‘మహావతార్: నరసింహ’ను (Mahavatar Narsimha) ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో..
‘మహావతార్: నరసింహ’ (Mahavatar Narsimha) పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానున్నట్లు తెలిపింది. ఈ చిత్రాన్ని అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేయనుండగా సామ్ సీఎస్ సంగీతం అందిస్తారు. అత్యంత భారీ బడ్జెట్‌తో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్‌లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అంతేకాదు, మహావతార్ సిరీస్‌లో మరిన్ని చిత్రాలు రానున్నట్లు తెలుస్తోంది. ఇతర అవతారాలతో సినిమాలు రాబోతున్నాయని నిర్మాణ సంస్థ చెప్పకనే చెప్తోంది.
మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్స్
హోంబలే ఫిల్మ్స్ విషయానికొస్తే ఇప్పటికే విజయవంతమైన ‘కాంతార’, ‘సలార్’ ప్రపంచాలను కొనసాగిస్తూ కొత్త చిత్రాలు వస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో రిషభ్‌శెట్టి కీలక పాత్రలో ‘కాంతార: చాప్టర్1’ (kantara chapter 1) ఇప్పటికే శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. తొలి భాగానికి ప్రీక్వెల్‌గా భారీ హంగులతో ఇది రూపుదిద్దుకుంటోంది. మరోవైపు ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా ‘సలార్: శౌర్యంగ పర్వం’ (salaar 2: shouryanga parvam) షూటింగ్ ఇటీవలే మొదలైంది. దీంతో పాటు, ప్రభాస్‌తో మరో రెండు సినిమాలను చేసేందుకు ఒప్పందం కూడా కుదిరింది.
మూడేళ్లు.. మూడు చిత్రాలు
ప్రభాస్‌తో మరో రెండు సినిమాలు ప్రకటించిన హోంబలే ఫిల్మ్స్ ఆ సందర్భంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్ సినిమాలకు వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. ఎప్పటికీ సినిమాటిక్ అనుభూతిని సృష్టించాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభాస్‌తో సినిమాలు అనౌన్స్ చేసినట్లు చెప్పింది. ‘ది హోంబలే ఈజ్ కాలింగ్ ప్రభాస్’ అని పేర్కొంది. 2026, 2027, 2028ల్లో ఈ చిత్రాలు ఉండనున్నట్లు చెప్పింది. ‘సలార్ 2’ మినహాయించి మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
Celebrities Featured Articles Political Figure
Revanth Reddy: టాలీవుడ్‌పై రేవంత్ సర్కార్ పగ? వరుస ఘటనలు ఏం చెబుతున్నాయి?