• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంగ్రెస్‌కు మళ్లీ 20 సీట్లే వస్తాయి: KCR

    ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మళ్లీ 20 సీట్లు మాత్రమే వస్తామని సీఎం కేసీఆర్ జోష్యం చెప్పారు. మధిరలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ తయారైందని చెప్పారు. కాంగ్రెస్‌ అభ్యర్థి భట్టి విక్రమార్కకు ఓటు వేస్తే ప్రజలు నష్టపోతారన్నారు. కాంగ్రెస్‌కు మళ్లీ 20 సీట్లు మాత్రమే వస్తాయని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

    విజయశాంతికి కాంగ్రెస్ కొత్త బాధ్యతలు

    కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో బీజేపీని వీడి విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ప్రచార, ప్లానింగ్‌ కమిటీని కాంగ్రెస్‌ పార్టీ నియమించింది. అందులో15 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ ప్రచార, ప్లానింగ్‌ కమిటీ చీఫ్‌ కోఆర్డినేటర్‌ బాధ్యతలను విజయశాంతికి అప్పగించింది. కన్వీనర్లుగా సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లు రవి, కోదండరెడ్డి, నరేందర్‌రెడ్డి, రామ్మూర్తి నాయక్‌, అలీ బిన్‌ ఇబ్రహీం, తదితరులను నియమించింది.

    కాంగ్రెస్‌లోకి విజయశాంతి.. ముహూర్తం ఫిక్స్?

    బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రేపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారని సమాచారం. పార్టీలో చేరిక తర్వాత వచ్చే ఎన్నికల్లో మెదక్ నుంచి విజయశాంతి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బీజేపీకి విజయశాంతి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీబీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపారు.

    ఓటర్లు పరిణతితో ఆలోచించాలి: కేసీఆర్

    ఓటర్లు పరిణతితో ఆలోచించి ఓటేస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ప్రజలు తమ ఓటు హక్కును సరిగ్గా వాడితే మంచి భవిష్యత్‌ ఉంటుంది. వలసలు వెళ్లి చాలా బాధలు అనుభవించిన జిల్లా పాలమూరు. గతంలో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులకు కాంగ్రెస్‌ కారణం వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి.’ అని కేసీఆర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

    BRS గెలవకపోతే అభివృద్ది ఆగిపోతుంది: KTR

    కేసీఆర్‌ మళ్లీ సీఎం కాకపోతే రాష్ట్ర అభివృద్ది ఆగిపోతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ను ఓడించడానికి అందరూ ఏకమవుతున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన హైదరాబాద్‌లో అభివృద్ధి అందరికీ కనిపిస్తోందన్నారు. కానీ విపక్షాలకు అది కనిపించట్లేదని విమర్శించారు. కేసీఆర్‌ మళ్లీ గెలవకపోతే పెరుగుతున్న హైదరాబాద్‌ అభివృద్ధి ఆగిపోతుందన్నారు. తెలంగాణ సీఎం ఎవరు అనేది ప్రజలు నిర్ణయించాలని తెలిపారు. ఈ పోరాటం దిల్లీ దొరలకు.. తెలంగాణ ప్రజలకు మధ్యే జరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు.

    కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు

    ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోది కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి సొమ్ముతో కాంగ్రెస్ ఖజానాను నింపుకోంటుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘మహాదేవ్’ పేరును కూడా వదిలిపెట్టలేదని విమర్శించారు. మహాదేవ్ బెట్టింగ్ నుంచి భారీగా డబ్బులు తీసుకుంటుందని ఆరోపించారు. కొన్ని రాజకీయ పార్టీలు కొత్త కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. కులతత్వ విషాన్ని వ్యాపింపజేస్తున్నాయని మోదీ ఆరోపించారు.

    తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలి: రాహుల్

    కొల్లాపూర్‌లో సభలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా తెలంగాణ.. దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరగనున్నాయన్నారు. ‘ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలి. కాంగ్రెస్‌ వస్తే రైతుబంధు నిలిచిపోతుదంటున్నారు. అందులో వాస్తవం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా రూ.15వేలు అందిస్తాం. ఉపాధి హామీ కూలీలకు రూ.12వేలు ఇచ్చి ఆదుకుంటాం’ అని రాహుల్ హామీ ఇచ్చారు.

    తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుకున్నాం: కేసీఆర్

    తెలంగాణ ప్రజల హక్కులు కాపాడుకున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ తెలంగాణ ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్‌ నేతలు పోరాడలేదని విమర్శించారు. ఆ పార్టీ వైఖరి, చరిత్ర, ప్రజల పట్ల వారికున్న దృక్పథం ఏంటనేది ప్రజలు ఆలోచించాలన్నారు. దళిత బిడ్డలు ఏళ్ల తరబడి వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు ప్రజల తలరాత, భవిష్యత్తును మార్చేస్తుందన్నారు. ఏది నిజమో తెలుసుకున్న తర్వాతే ప్రజలు ఓటు వేయాలని కేసీఆర్ సూచించారు.

    వాళ్లు సర్వేల్లో గెలిస్తే.. మేం ఎన్నికల్లో గెలుస్తాం: కవిత

    బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తానని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పడం ఎలక్షన్‌ స్టంట్‌ అని ఆరోపించారు. బీజేపీతో తమకు ఎలాంటి డీల్‌ లేదన్నారు. ప్రజల ఆశీర్వాదంతో కచ్చితంగా 95-105 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సర్వేల్లో కాంగ్రెస్ గెలిస్తే.. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుస్తుందన్నారు. ఓబీసీల కుల గణన చేయడాన్ని కేంద్రం నిరాకరిస్తోందిని మండిపడ్డారు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్‌ ఇవ్వడానికి కేంద్రం సుముఖంగా లేదని కవిత పేర్కొన్నారు.

    కాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్‌ టికెట్‌ పంచాయితీ

    తెలంగాణ కాంగ్రెస్‌ రెండో జాబితా నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.. జూబ్లీహిల్స్‌ టికెట్‌‌ను అజహరుద్ధీన్‌కు కేటాయించారు. తనకే టికెట్ వస్తుందని భావించిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విష్ణు తన వర్గీయులతో సమావేశమై చర్చించి గాంధీ భవన్‌కు చేరుకుని నిరసన తెలిపారు. వారిని గాంధీభవన్‌ లోపలికి వెళ్లకుండా ప్రధాన ద్వారానికి తాళం చేశారు. దీంతో గాంధీ భవన్‌ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.