కాంగ్రెస్ కమిటీలకు మరో 13మంది రాజీనామా
TS: కాంగ్రెస్‌లో రోజురోజుకు విభేదాలు బయటపడుతున్నాయి. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన 13 మంది నేతలు పార్టీలోని కమిటీల పదవులకు రాజీనామా చేశారు. వీరిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క ఉండటమూ గమనార్హం. ఈ 13 మంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. వేం నరేందర్ రెడ్డి, విజయ రామారావు, చారగొండి వెంకటేశ్, ఎర్రశేఖర్ సహా పలువరు నేతలు ఉన్నారు. మాణిక్యం ఠాగూర్‌కు రాజీనామా లేఖను పంపించనున్నట్లు ప్రకటించారు. ఇటీవల టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.