• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మళ్లీ అధికారం బీఆర్‌ఎస్‌దే: కవిత

    తెలంగాణలో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. జరగబోయే ఎన్నికల్లో తన పార్టీ వంద సీట్లలు గెలుస్తుందన్నారు. ‘కేసీఆర్‌ పథకాల సృష్టికర్త ఆయన ఇతర పార్టీల మేనిఫెస్టోను కాపీ చేయాల్సిన అవసరం లేదు. బీజేపీకి తెలంగాణలో డిపాజిట్లు కూడా రావు ఆ పార్టీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది. బీజేపీ నేత ధర్మపురి అర్వింద్‌ను ఓడిస్తాం. ప్రజలు కాంగ్రెస్‌ గ్యారంటీలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగాలేరు. ఆ పార్టీ కేవలం ప్రజలను ఓటు బ్యాంకుగానే చూస్తోంది’. అని కవిత విమర్శించారు.

    భారాసపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

    TG: భారాస ప్రభుత్వం ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘సంక్షేమ పథకాల నగదు బదిలీపై ఎన్నికల అధికారులకు సూచనలు చేశాం. నోటిఫికేషన్‌కు ముందే నగదు బదిలీ పూర్తి అయ్యేలా ఆదేశాలివ్వాలని చెప్పాం. భారాస కార్యకర్తల్లా పని చేస్తున్న అధికారులను బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశాం. నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను రాష్ట్రంలో నియమించాలని ఈసీని కోరాం’ అని రేవంత్ తెలిపారు.

    పదవుల కోసం పార్టీ మారలేదు: రాజగోపాల్

    పదవుల కోసం పార్టీ మారే వ్యక్తిని కాదని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ నెల 27న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. బీజేపీ నేతలు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ప్రజలు నమ్మకం పోయింది. బీజేపీ. బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటే అందుకే కేసీఆర్‌పై పోరాడేందుకు కాంగ్రెస్‌లో చేరుతున్నాను. 100 మంది బీఆర్‌ఎస్ నేతలు ఎంతో కష్టపడితే మునుగోడు ఉపఎన్నిక గెలిచింది. కాంగ్రెస్‌లో ఉంటేనే మీరు గెలుస్తారని ప్రజలు నాతో చెప్పారు’ అని రాజగోపాల్ పేర్కొన్నారు.

    ‘కాంగ్రెస్‌‌ను నమ్మి మోసపోవద్దు’

    ఒక్క అవకాశం ఇవ్వమంటున్న కాంగ్రెస్‌ మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి కేటీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయిన కర్ణాటక ప్రజలు కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారు. 24 గంటలా.. 3 గంటల కరెంటు కావాలా? ప్రజలే ఆలోచించుకోవాలి’ అని కేటీఆర్ అన్నారు.

    రెండో జాబితాపై కాంగ్రెస్ కీలక భేటి

    TG: మధ్యాహ్నం 12.00 గంటలకు కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం కానుంది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనుంది. ఈ భేటిలో 60 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్ ఉంది. మిగిలిన 10 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక మరికొన్ని రోజులు పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. చేరికల దృష్ట్యా కొన్ని స్థానాల్లో ప్రకటన ఉండకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. సీఈసీ భేటి తర్వాత అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యే అవకాశముంది.

    కాంగ్రెస్‌ గూటికి రాజగోపాల్‌రెడ్డి?

    TG: నల్గొండ జిల్లాకు చెందిన కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తిరిగి యూటర్న్‌ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయన భాజపాను వదిలి తిరిగి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా భాజపాలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన ప్రస్తుతం కాంగ్రెస్‌వైపు చూస్తున్నట్లు సమాచారం. పార్టీలో చేరే విషయమై ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలతో రాజగోపాల్‌ చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలిసింది. రేపు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీతో భేటి కూడా అవుతారని ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే భాజపాకు గట్టి షాక్‌ తప్పదు.

    25న కాంగ్రెస్‌ రెండో జాబితా.!

    తెలంగాణ కాంగ్రెస్‌ రెండో అభ్యర్థుల జాబితా ప్రకటనపై స్క్రీనింగ్‌ కమిటీ కసరత్తు తుదిదశకు చేరినట్టు తెలుస్తోంది. మిగిలిన 64 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే 35 నుంచి 40 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. ఈనెల 25న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. అదే రోజున కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    ఆ పార్టీలకు అభ్యర్థులే లేరు: కేటీఆర్

    ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వచ్చిన 88 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని చెప్పారు. కేసీఆర్‌‌పై ప్రజలకు దృఢమైన విశ్వాసం ఉందన్నారు. అభ్యర్థులకు బీఫారాల పంపిణీ దాదాపు పూర్తయిందని తెలిపారు. ప్రచారంలో ముందున్నామన్న కేటీఆర్‌.. ఫలితాల్లోనూ ముందే ఉంటామని వెల్లడించారు. కాంగ్రెస్‌కు 40చోట్ల అభ్యర్థులు లేరని చెప్పారు, బీజేపీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోతుందని కేటీఆర్ జోష్యం చెప్పారు.

    ఎన్నికల్లో పోటీకి సిద్ధం: గద్దర్ కుమార్తె

    తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నానని గద్దర్ కుమార్తె వెన్నెల ప్రకటించారు. రాజకీయాల్లోకి రావాలని చేలా మంది ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తానని తెలిపారు. తండ్రి ఆశయ సాధన కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని వెల్లడించారు. గద్దర్ జీవితాంతం సమాజం కోసం తపన పడ్డారన్నారు. టికెట్ ఇవ్వకపోయినా తమ మద్దతు కాంగ్రెస్‌కు ఉంటుందని వెన్నెల పేర్కొన్నారు.

    మోదీ వైఖరిపై కాంగ్రెస్ అసంతృప్తి

    ఇజ్రాయెల్‌-పాలస్తీనాల సంక్షోభంపై భారత వైఖరిని కాంగ్రెస్ తప్పుబట్టింది. ఈ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం తీరు మొదటి నుంచి భిన్నంగా ఉందని చెప్పింది.‘పాలస్తీనా హక్కుల కోసం వారు చేస్తున్న పోరాటానికి భారత్‌ మద్దతుగా నిలిచేది. దాడుల విషయానికొస్తే వాటిని తీవ్రంగా ఖండించేంది. ప్రస్తుతం భారత వైఖరి మాత్రం యుద్ధానికి ముగింపు పలికేలా లేదు. ఇజ్రాయెల్‌-పాలస్తీనా విషయంపై భారత్‌ తన వైఖరిని హుందాగా, గౌరవప్రదమైన రీతిలో వెల్లడించాలి’అని కాంగ్రెస్ పేర్కొంది.