• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేసీఆర్‌పై రాహుల్ గాంధీ ఫైర్

    తెలంగాణలో దొరల పాలన సాగుతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ విజయభేరి సభలో రాహుల్‌ మాట్లాడుతూ.. 2004లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు.. నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చిందన్నారు. కేసీఆర్‌ గతంలో ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడం మర్చిపోయారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నీ తెలంగాణలో కూడా నెరవేరుస్తామని రాహుల్‌ గాంధీ అన్నారు.

    కేసీఆర్‌పై రాహుల్ గాంధీ ఫైర్

    తెలంగాణలో దొరల పాలన సాగుతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ విజయభేరి సభలో రాహుల్‌ మాట్లాడుతూ.. 2004లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు.. నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చిందన్నారు. కేసీఆర్‌ గతంలో ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడం మర్చిపోయారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నీ తెలంగాణలో కూడా నెరవేరుస్తామని రాహుల్‌ గాంధీ అన్నారు.

    కాంగ్రెస్ 6 క్యారెంటీ కార్టులకు పూజలు

    నేడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించారు. ముందుగా పాలంపేటలోని పార్టీ సీనియర్ నేతలతో కలిసి రామప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీ కార్టులను రామప్ప స్వామి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రాహుల్, ప్రియాంక పాల్గొన్నారు.

    ప్రజలకు నేనే సీఎం కావాలని ఉంది: జానారెడ్డి

    ప్రజల మనసులో తానే సీఎం కావాలని ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, జానారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఏ పదవీ కోరుకోవట్లేదు. సీఎం అయ్యే అవకాశం హఠాత్తుగా రావచ్చేమో. ఏ పదవి వచ్చినా కాదు అనను 21 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చా మంత్రి గా అన్ని శాఖలను నిర్వహించా 36 ఏళ్లకే మంత్రిని అయ్యా. నాకు 55 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. నాకు ఏ పదవులైనా వాటంతట అవే వస్తాయి’’ అని జానారెడ్డి అన్నారు.

    కాంగ్రెస్‌తో పెను ప్రమాదం: కేసీఆర్

    సిరిసిల్ల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ విపక్షాలపై విరుచుకపడ్డారు. ప్రతిపక్షాలతో పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు, రైతులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్‌ పెద్దలు చెబుతున్నారని మడిపడ్డారు. ధరణి రద్దయితే మళ్లీ వీఆర్వోలు వచ్చి పెత్తనం చేస్తారని చెప్పారు. ధరణి పోర్టల్‌ తీసేసి రైతులను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్‌ చూస్తోందని ఆరోపించారు.. రైతులంతా అప్రమత్తంగా ఉండాలి. ధరణి ఉండాలో?.. రద్దు కావాలో? రైతులే నిర్ణయించుకోవాలి కేసీఆర్ సూచించారు.

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్

    గన్ పార్క్‌ వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేసేందుకు వచ్చిన ఆయన్ను అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందునా అనుమతి లేదని పోలీసులు చెప్పారు. దీంతో రేవంత్ రెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. దీంతో ఉద్రిక్తతలు పెరగడంతో రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    కాంగ్రెస్ బీజేపీ పోటీనే కాదు: కవిత

    ఎమ్మెల్సీ కవిత బీజేపీ, కాంగ్రెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌లు బీఆర్ఎస్‌కు పోటీనే కాదు. దేశవ్యాప్తంగా బీజేపీ అమలు చేస్తున్న పథకాలు పరిశీలిస్తే.. అవన్నీ బీఆర్ఎస్ పథకాలే. తెలంగాణ ప్రజలు తెలివైనవారు. బీజేపీ, కాంగ్రెస్ మాయమాటలను విశ్వసించరు. ఎన్నికల్లో గెలిచేది బీఆర్‌ఎస్‌నే. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా కేసీఆర్ తెలంగాణలో పాలన కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ వస్తే అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు.

    కాంగ్రెస్‌లో చేరిన రేవూరి ప్రకాశ్ రెడ్డి

    బీజేపీకి షాకిస్తూ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రగకాశ్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. పరకాల కాంగ్రెస్‌ టికెట్‌ను రేవూరి ఆశిస్తున్నారు. గత కొంత కాలంగా బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న రేవూరి కాంగ్రెస్ నాయకత్వంతో టచ్‌లో ఉంటున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఇతర పార్టీల ఆశవాహులను బుట్టలో వేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. బీఆర్ఎస్ అసంతృప్త నేత మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లిన రేవంత్‌ రెడ్డి. కాంగ్రెస్‌లోకి రావాలని ఆయన్ను ఆహ్వానించారు.

    కాంగ్రెస్ జాబితాలో 12 కొత్త ముఖాలు

    కాంగ్రెస్‌ ప్రకటించిన తొలి జాబితాలోని 55 మందిలో 12 మంది కొత్త అభ్యర్థులు ఉన్నారు. సీపీఎం అడిగిన భద్రాచలంలో పొదెం వీరయ్యకు టికెట్ కేటాయించారు. ఇటీవల పార్టీలో చేరిన వేముల వీరేషంకు నకిరేకల్ టికెట్ ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి కుటుంబంలో ఇద్దరికి సీట్లు కేటాయించారు. నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి కుమారుడు జయవీర్ ఈసారి బరిలోకి దిగుతున్నారు.

    ఖమ్మం కాంగ్రెస్‌ కీలక నేతల సీట్లు ఖరారు

    ఖమ్మం అసెంబ్లీ సీటుపై కాంగ్రెస్ నేతల పంచాయితీ ఓ కొలిక్కి వచ్చింది. ఖమ్మం​ నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు అసెంబ్లీ స్థానాలపై ఓ స్పష్టత వచ్చింది. పాలేరు నుంచి పొంగులేటి, ఖమ్మం నుంచి తుమ్మలను బరిలోకి దింపాలని అధిష్టానం నిర్ణయించింది. రాహుల్ గాంధీ సూచనతో ఈ ఇద్దరు నేతలు ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు సుముఖత చూపించారని సమాచారం. దీంతో ఈ ఇద్దరి నేతల సీట్ల కోసం జరుగుతున్న పంచాయితీ ముగిసింది.