• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడే కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటన

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను నేడు కాంగ్రెస్ ప్రకటించనుంది. ఈ మేరకు ఈ విషయాన్ని ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ తెలిపారు. 58 మంది పేర్లతో తుది జాబితా వెల్లడిస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు. వామపక్షాలతో పొత్తుల అంశం తుది దశలో ఉందని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే నేతలకు అవకాశం ఇచ్చామని స్పష్టం చేశారు. అన్ని మతాలు, కులాలకు కాంగ్రెస్ అధిష్ఠానం పాధాన్యత ఇస్తుందని మురళీధరన్ పేర్కొన్నారు.

    తెలంగాణలో ‘స్కామ్ గ్రెస్‌’కు చోటు లేదు: KTR

    కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఓటర్లను కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ కర్ణాటక నుంచి డబ్బులు తలిస్తుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి దొంగల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని విమర్శించారు. కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణ ఎన్నికల్లో ప్రలోభాల కోసం తరలిస్తూ కాంగ్రెస్ నేతలు దొరికిపోయారని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘స్కామ్ గ్రెస్‌’కు తెలంగాణలో చోటు లేదని మంత్రి పేర్కొన్నారు.

    రేవంత్, హరీష్ బలికా బకరాలు: బండి

    BRS, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటేనని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. “ఇతర పార్టీలలో డబ్బులు ఇచ్చి కండువాలు కప్పుతున్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ ఒక్కటి. ప్రధాని మాట్లాడిన తర్వాత వాస్తవ విషయాన్ని ప్రజలు గుర్తించారు. బీజేపీని గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారు. మంచి అభ్యర్థులను కిషన్ రెడ్డి నాయకత్వంలో ఎంపిక చేసి ఢిల్లీకి పంపాం. కానీ కాంగ్రెస్ లిస్ట్ ప్రగతి భవన్‌కి వెళ్ళింది. రేవంత్ రెడ్డికి తెలియట్లేదు. కేసీఆర్‌ 30 మందికి పైసలు పంపారు. తెరవెనుక ఏమీ జరుగుతుందో అయన తెలుసుకోవడం లేదు. … Read more

    ‘కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు’

    తెలంగాణలో సీఎం కేసీఆర్ అవినీతి పాలన కొనసాగుతోందని కేఏపాల్ ఆరోపించారు. కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు ఉన్నారని తెలిపారు. వారు గెలిచి మళ్లీ ఆ పార్టీలోనే చేరుతారని చెప్పారు. కాంగ్రెస్‌లో ఉన్న తమ వాళ్లను గెలిపించుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు.. అలాగే తెలంగాణ జనసేన, వైసీపీ పార్టీలను కూడా కేసీఆర్ వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీలో 60శాతం మంది బీసీలకు సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేఏపాల్ స్పష్టం చేశారు. మరో వారం రోజుల్లో తమ పార్టీ అభ్యుర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

    లెఫ్ట్ పార్టీలతో కుదిరిన కాంగ్రెస్ పొత్తు

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లెఫ్ట్ పార్టీలతో పొత్తు కుదిరింది. సీపీఐకి రెండు స్థానాలు, సీపీఎంకు రెండు స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకుంది. సీపీఐకి కొత్తగూడెం, మునుగోడు స్థానాలు కేటాయించగా.. సీపీఎంకు భద్రాచలం, మిర్యాలగూడ స్థానాలు ఖరారు చేసింది. మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్‌కు సీపీఐ, సీపీఎం సపోర్ట్‌ చేసినప్పటికీ… అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో దోస్తీకి కేసీఆర్ ముఖం చాటేశారు.

    ఢిల్లీలో కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ చర్చలు

    TG: కాంగ్రెస్‌ పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం దిల్లీలో కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారుపై నేతలు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో జాబితాను ఖరారు చేసి అధిష్ఠానానికి పంపనున్నారు. అనంతరం మంగళవారం లేదా బుధవారం భేటీ కానున్న ఏఐసీసీ ఎన్నికల కమిటీ ఈనెల 14లోపు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయనుంది. మరోవైపు, సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని ఓబీసీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. కనీసం 35 సీట్లు ఇవ్వాలని అధిష్ఠానానికి ఇప్పటికే వినతి పత్రాలు అందజేశారు.

    కూకట్‌పల్లి బరిలో బండ్ల గణేశ్‌!

    HYD: కూకట్‌పల్లి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఒక టికెట్‌ను బలమైన సామాజిక వర్గానికి ఇవ్వాలని భావిస్తున్న అధిష్ఠానం ఆయన పేరును కూకట్‌పల్లికి పరిశీలిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ విషయానికి సంబంధించి అధిష్ఠానం ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌కు ప్రచారం చేశారు.

    మేనిఫెస్టోపై కేసీఆర్ దృష్టి

    సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై దృష్టిసారించారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలిచేందుకు మేనిఫెస్టోను రెడీ చేస్తున్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీ స్కీమ్‌లకు ధీటుగా.. మహిళలు, రైతులే ప్రధానంగా హామీలు రూపొందిస్తున్నారు. రైతులకు ఉచిత ఎరువులు, మహిళలకు జీరో వడ్డీ రుణాలు వంటి స్కీమ్స్‌ తీసుకొచ్చేందుకు అధికారులు, పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఈనెల 16న వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.

    కాంగ్రెస్‌ను నడిపేది దేశ వ్యతిరేక శక్తులు: మోదీ

    ఛత్తీస్‌గఢ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మోదీ ఫైరయ్యారు. రాష్ట్రంలో అవినీతి, నేరాలు అధికంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ను నడుపుతోంది ఆ పార్టీ నేతలు కాదని దేశ వ్యతిరేక శక్తులతో అనుబంధం ఉన్నవారు నడుపుతున్నారని విమర్శించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి సారథ్యంలో గతంలో బీజేపీ ఆదివాసీల కోసం ప్రత్యేక మంత్రిత్యశాఖ ఏర్పాటు చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మోదీ పేర్కొన్నారు.

    కాంగ్రెస్‌ పార్టీ సంచలన వాగ్దానాలు

    TG: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన విజయభేరి బహిరంగ సభలో కాంగ్రెస్‌ పార్టీ కీలక వాగ్దానాలు ప్రకటించింది. తెలంగాణలో అధికారంలోకి వస్తే ‘మహిళలకు మహాలక్ష్మీ పథకం కింద నెలకు రూ.2500. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. పేద మహిళలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌. రైతు భరోసా కింద ఎకరాకు రైతుకు ఏడాదికి రూ.15 వేలు, కౌలు రైతుకూ ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, వరి పంటకు క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్‌’ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్‌ అగ్రనేతలు … Read more