• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కాంగ్రెస్‌కు గులాం నబీ ఆజాద్ రాజీనామా

  కాంగ్రెస్ పార్టీకి బిగ్‌ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు. రాజీనామా లేఖలో రాహుల్ గాంధీ తీరును తప్పుబట్టారు. సీనియర్లందర్నీ రాహుల్ పక్కన పెట్టేశారు అని ఆరోపించారు. పార్టీలో సంప్రదింపుల ప్రక్రియ లేకుండా పోయిందని విమర్శించారు. గులాం నబీ ఆజాద్ గతంలో ఉమ్మడి ఏపీకి కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. © ANI Photo © ANI Photo … Read more

  కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ ఎన్నిక‌లు వాయిదా!

  జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిని ఎంచుకునేందుకు జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు వాయిదాప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కొన్నివారాల పాటు వీటిని వాయిదా వేయ‌నున్న‌ట్లు సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఎన్నిక‌ల ఫైన‌ల్ షెడ్యూల్ ఆగ‌స్ట్ 28న జ‌ర‌గ‌నున్న కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ మీటింగ్‌లో నిర్ణ‌యించ‌నున్నారు. ఈసారి ఎలాగైనా రాహుల్ గాందీని ఒప్పించి అధ్య‌క్షుడిగా ఉండాల‌ని కోరేందుకు సీనియ‌ర్లు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇంత‌కుముందు చాలాసార్లు దీన్ని తిర‌స్క‌రించిన రాహుల్ ఇప్పుడు కూడా అంగీక‌రిస్తాడో లేదోన‌న్న సందేహాలూ ఉన్నాయి. ప్ర‌స్తుతం సోనియా గాందీ తాత్కాలిక అధ్య‌క్షురాలిగా కొన‌సాగుతుంది.

  ఢిల్లీకి వెళ్లిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

  కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఈమేరకు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీతో భేటీ కానున్నారు. వెంకట్ రెడ్డి సోదరుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం ప్రియాంక గాంధీతో ఆయన సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల మునుగోడు అభ్యర్థి ఎంపిక విషయంలో వెంకట్ రెడ్డి అభిప్రాయం తీసుకోవాలని ప్రియాంక గాంధీ.. రేవంత్ రెడ్డికి సూచించారు. వెంకట్ రెడ్డిపై అద్దంకి దయాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు, మునుగోడులో పార్టీ విజయావకాశాలపై ఆమె చర్చించనున్నారు.

  బండి సంజయ్  పాదయత్రతోనే ఆపరేషన్ ఆకర్ష్.. లిస్ట్ లో రాజగోపాల్ రెడ్డి సహా మరికొందరు?

  బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించారు. యాదాద్రి లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్న ఆయన, పార్టీ శ్రేణులతో పాదయాత్ర చేపట్టారు. యాదాద్రి నుంచి చేపట్టిన ఈ పాదయాత్ర వరంగల్ భద్రకాళి ఆలయం వరకు కొనసాగనుంది. ఈ యాత్ర భువనగిరి, వరంగల్ పార్లమెంట్ నియోజవర్గాల పరిధిలోని మొత్తం 12 అసెంబ్లీ స్థానాలను కవర్ చేయనుంది. 24 రోజుల పాటు సాగనున్న పాదయాత్ర ఆగస్టు 26న వరంగల్ లో ముగియనుంది. ఈ పాదయాత్రనే వేదికగా చేసుకుని ఇతర పార్టీల కీలక నేతలను పార్టీలోకి చేర్చుకునేలా … Read more

  రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ఓటింగ్ నేప‌థ్యంలో ఎమ్మెల్యే సీత‌క్క ఓటు గంద‌ర‌గోళం

  నేడు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క అయోమ‌యానికి గురైంది. దీంతో మ‌రో బ్యాలెట్ పేప‌ర్ కావాలని ఆమె కోరింది. కానీ అందుకు అధికారులు అనుమ‌తించ‌లేదు. ఓటు వేసే క్ర‌మంలో బ్యాలెట్ పేప‌ర్‌పై పెన్ ఇంక్ ప‌డింద‌ని అందుకే మ‌రో బ్యాలెట్ పేప‌ర్ కావాల‌ని కోరిన‌ట్లు సీత‌క్క తెలిపారు. తాను అనుకున్న అభ్య‌ర్థికే ఓటు వేశాన‌ని బ‌య‌ట‌కు వ‌చ్చాక సీత‌క్క ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. కానీ దానిపై ఇంక్ పడ‌టంతో ఆ ఓటు చెల్లుతుందో లేదోన‌ని కాంగ్రెస్ వ‌ర్గాలకు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. … Read more

  ఢిల్లీకి పయనమైన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. కారణం అదే

  తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలైన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఏఐసీసీ పెద్దల వద్దకు వెళ్లారు. ఇటీవల పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటల మీద చర్చించేందుకే వీరు ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. రేవంత్ రెడ్డికి, భట్టి విక్రమార్కకు కూడా పొసగడం లేదని టాక్ నడుస్తోంది. రేవంత్ సీనియర్లను కాదని కొత్త వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు దీంతోనే పలువురు సీనియర్లు చాలా రోజుల నుంచి గాంధీ భవన్ కు కూడా రావడం లేదని టాక్ నడుస్తోంది.

  మోదీ సమక్షంలో కమలం కండువా కప్పుకోనున్న మాజీ ఎంపీ?

  కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కమలం కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయన వద్దకు నిన్న బీజేపీ నేతలు తరుణ్ చుగ్, బండి సంజయ్ వెళ్లి మంతనాలు జరిపారు. జూలై 2 వ తేదీన మోదీ హైదరాబాద్ కు రానున్న తరుణంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరతారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రామ్ గోపాల్ రెడ్డితో కూడా బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం అందుతోంది.

  నేడు మరోసారి ED ముందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేడు మరోసారి ఈడీ ముందు హాజరుకానున్నారు. ఇప్పటికే 4 రోజుల పాటు రాహుల్ ను ప్రశ్నించిన ఈడీ నేడు మరోసారి హాజరు కావాలని ఆదేశించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ ను ఈడీ విచారిస్తోంది. ఆయన చెప్పిన సమాధానాలను ఈడీ రికార్డ్ చేస్తోంది. రాహుల్ జూన్ 13వ తేదీన ఈడీ విచారణకు మొదటి సారి హాజరయ్యారు.

  మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత

  కాంగ్రెస్ నేత సుబోధ్ కాంతి సహాయ్ ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. హిట్లర్ లా వ్యవహరించే వారు హిట్లర్ లాగానే గతి లేని చావు చస్తారని అన్నారు. సుబోధ్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు పలువురు మండిపడుతున్నారు. ఒక దేశ ప్రధానిని పట్టుకుని ఇలా మాట్లాడడం సబబు కాదని.. కాంగ్రెస్ ఇలా వ్యాఖ్యానించడం మానుకోవాలని హితవు పలికారు. జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్ దాస్ మాట్లాడుతూ.. గుజరాత్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మోదీని … Read more

  సాయంత్రం రాష్ట్రపతి వద్దకు..

  నేడు రాహుల్ గాంధీ నాలుగో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. మరో పక్క దేశం మొత్తం అగ్నిపథ్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. ఈడీ విచారణల పేరుతో రాహుల్‌ను వేధించడం, అగ్నిపథ్ అంశాలపై వారు రాష్ట్రపతితో చర్చించనున్నారు.