నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పాపులర్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 4 (Unstoppable Season 4) విజయవంతంగా కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ (Aha)లో ఏపీ సీఎం చంద్రబాబు, దుల్కర్ సల్మాన్, సూర్య ఎపిసోడ్లు రిలీజై ట్రెండింగ్‌లో దూసుకెళ్లాయి. తాజాగా మరో స్టార్ హీరోకు సంబంధించిన ఎపిసోడ్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఆయనెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). ఇందులో సినీ హీరోల గురించి బాలయ్య కొన్ని ప్రశ్నలు వేయగా బన్నీ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్ జరుగుతున్న వేళ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
పవన్‌పై ఏమన్నారంటే?
బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable Season 4). ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్ కూడా ఫుల్ జోష్‌తో అలరిస్తోంది. తాజాగా 4వ ఎపిసోడ్ స్ట్రీమింగ్కు వచ్చింది. ఇందులో పలు హీరోలను స్క్రీన్‌పై చూపిస్తూ వారికి గురించి అభిప్రాయం ఏంటో చెప్పాలని బాలయ్య అడిగారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఫొటోను ప్రదర్శించగా బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ధైర్యం అంటే తనకు చాలా ఇష్టమని బన్నీ చెప్పారు. సొసైటీలో చాలా మంది లీడర్స్, బిజినెస్ మెన్స్‌ను దగ్గర నుంచి చూస్తుంటానని తెలిపారు. కానీ తాను లైవ్‌లో మాత్రం పవన్ కల్యాణ్ ధైర్యాన్ని చూస్తుంటానని ప్రశంసించారు. చాలా డేరింగ్ పర్సన్ అంటూ పవన్‌ను ఆకాశానికెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బన్నీ వ్యాఖ్యలను పవన్ అభిమానులు స్వాగతిస్తున్నారు.
‘ఆ స్టార్‌తో మల్టీస్టారర్ చేయాలి’
పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు స్టార్ హీరోల ఫొటోలు స్క్రీన్‌పై రాగా వారిపైనా అల్లు అర్జున్ (Allu Arjun) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ముందుగా మహేష్ బాబు (Mahesh Babu) గురించి మాట్లాడుతూ అందరూ అతడి అందం గురించే మాట్లాడతారని, కానీ అయన కమ్‌బ్యాక్స్ చాలా బాగుంటాయని పేర్కొన్నారు. ఫెయిల్యూర్స్ తర్వాత వచ్చే ఆయన కమ్‌బ్యాక్స్ చాలా బాగుంటాయన్నారు. ఇక ప్రభాస్ (Prabhas) గురించి ప్రస్తావిస్తూ అతడు ఆరడుగుల బంగారమని కొనియాడాడు. తాము మంచి స్నేహితులమని చెప్పుకొచ్చాడు. తాను ప్రతీ ఏటా క్రిస్మస్ ట్రీ పెడతానని తెలిసి తనకోసం యూరప్ నుంచి డెకరేషన్ ఐటెమ్స్ తీసుకొచ్చారని తెలిపాడు. అటు బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) గురించి మాట్లాడుతూ ఈ జనరేషన్ హీరోల్లో వావ్ అనిపించే యాక్టర్ అంటూ వ్యాఖ్యానించాడు. తాను రణ్‌బీర్‌తో మల్టీస్టారర్ చేస్తే అద్భుతంగా ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు.
ఈ తరం ఫేవరేట్ హీరో
ఈ జనరేషన్ హీరోల్లో నీకు ఇష్టమైన హీరో ఎవరని బాలయ్య ప్రశ్నించగా బన్నీ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ తరం వాళ్లందరూ బాగా నటిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) యాక్టింగ్ తనకు బాగా నచ్చిందని అన్నాడు. తర్వాత నవీన్ పొలిశెట్టి చేసిన జాతిరత్నాలు మూవీ చూసి పడి పడి నవ్వుకున్నట్లు తెలిపాడు. సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), విష్వక్ సేన్ (Vishwak Sen), అడివిశేష్ (Adivi Sesh)లు బాగా నటిస్తున్నట్లు ప్రశంసించాడు. ఒకరి పేరు చెప్పమంటే మాత్రం సిద్ధూ (Siddhu Jonnalagadda) అని స్పష్టం చేశాడు. మరోవైపు ఇండస్ట్రీలో టాప్ డ్యాన్సర్ నువ్వే అనుకుంటున్నావా? అని బాలయ్య ప్రశ్నించగా ‘నిజమే సర్’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. బాలకృష్ణ గారు చెప్పారు కాబట్టి నేనే నవంబర్ వన్ డ్యాన్సర్ అంటూ చెప్పుకొచ్చాడు.
‘ఇండస్ట్రీలో నాకు నేనే పోటీ’
ప్రస్తుతం ఇండస్ట్రీలో నీకు ఎవరు పోటీ అని అల్లు అర్జున్ను బాలయ్య ప్రశ్నించారు. దీనికి బన్నీ సమాధానం ఇస్తూ పుష్పా 2 టైటిల్ సాంగ్‌లోనూ లిరిక్‌ను చదివాడు. ‘నన్ను మించి ఎదిగినవాడు ఇంకోడు ఉన్నాడు చూడు.. ఎవరంటే అది రేపటి నేనే. నాను నేనే పోటీ. అలాగే నేను అందరినీ గౌరవిస్తాను’ అంటు బన్నీ సమాధానం ఇచ్చారు. ఇక త్రివిక్రమ్, సుకుమార్‌లో ఎవరు ఎక్కువ ఇష్టం అంటూ బాలయ్య ప్రశ్నించారు. దానిపై బన్నీ మాట్లాడుతూ ‘చేస్తున్న దర్శకుడు ఒకరు.. చేయనున్న దర్శకుడు ఒకరు. నేను ఇప్పుడే చెప్పాను కదా.. ఏ సినిమా చేస్తే. ఆ చిత్ర బృందం నా ఫేవరేట్ అని. అందుకే సుకుమార్ అంటే ఇష్టం’ అని ఆన్సర్ ఇచ్చాడు.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్