• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పేపర్ లీక్ చేసింది బీజేపీ కార్యకర్తే: కేటీఆర్

    TSPSC ప్రశ్నాపత్రాలు లీకవడం దురదృష్టకరం. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు వల్ల వ్యవస్థకే చెడ్డపేరు వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. పేపర్ లీకేజీలో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షిస్తాం. పొరపాటు జరిగినప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. 2 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. నిందితుడిగా ఉన్న రాజశేకర్ రెడ్డి బీజేపీ క్రియశీల కార్యకర్త అని తెలిపారు. లీకేజీలో కుట్ర కోణం దాగిఉందని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

    పేపర్ లీకేజీపై కేటీఆర్ ప్రెస్‌మీట్

    LIVE: పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టారు. పేపర్ లీకేజీ ఘటనపై సీఎం కేసీఆర్‌కి నివేదిక అందించామని కేటీఆర్ వెల్లడించారు. దేశంలోనే అత్యుత్తమమైన కమిషన్లలో టీఎస్‌పీఎస్సీ ఒకటని పేర్కొన్నారు. ఎనిమిదేళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్లు కేటీఆర్ చెప్పారు. యూపీఎస్సీ ఛైర్మన్, 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్లు టీఎస్‌పీఎస్సీని సందర్శించారని వెల్లడించారు. గత ఎనిమిదేళ్లలో అత్యధిక నియామకాలు జరిపిన కమిషన్ టీఎస్‌పీఎస్సీ అని కొనియాడారు.

    దుమారం రేపిన పేపర్ లీక్ ఘటన

    TS: TSPSC పేపర్ల లీక్ ఘటన రాష్ట్రంలో దుమారం రేపింది. వివిధ పరీక్షలను రద్దు చేయడం వల్ల నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పేపర్ లీగ్ ఘటనపై బీజేపీ, బీఎస్పీ పార్టీ నేతలు గవర్నర్‌ను కలిశారు. రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యులు రాజీనామా చేయాలని, మంత్రి కేటీఆర్‌ని బర్తరఫ్ చేయాలని … Read more

    ఇది సార్ ఎన్టీఆర్ అంటే.. వీడియో వైరల్

    [VIDEO:](url) అభిమానులంటే ఎన్టీఆర్‌కి ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్యాన్స్ యోగక్షేమాలను ఆరా తీసే నటుల్లో యంగ్ టైగర్ ఎల్లప్పుడూ ముందుంటాడు. తాజాగా ఇది మరోసారి నిరూపితం అయింది. ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని దూసుకుంటూ వచ్చి ఎన్టీఆర్‌తో ఫొటో దిగడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బాడీ గార్డులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని నిలువరించి అభిమానితో ఫొటోకు పోజులిచ్చాడు. ఈ వీడియో చూసి ‘ఇది సార్ ఎన్టీఆర్ అంటే’ … Read more

    శ్రీవారి దర్శనానికి 12 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి 12 గంటల వరకు సమయంపడుతోంది. వైకుంఠ కాంప్లెక్సుల్లోని 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 62,938 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 30,751 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.24 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

    హైదరాబాద్ శాస్త్రీపురంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున ప్లాస్టిక్ గోదాం నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. పక్కనే ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలు విద్యార్థులను అధికారులు ఖాళీ చేయించారు. రెండు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. పెద్దఎత్తున వ్యాపించిన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

    మరో నాలుగు రోజులు వానలు

    తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. వడగండ్ల వాన కూడా కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. శని ఆదివారాల్లో హైదరాబాద్‌తో పాటు.. నల్గొండ, సూర్యపేట, ఖమ్మం, వరంగల్, వికారాబాద్, కరీంనగర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పిడుగులు పడే అవకాశం దృష్ట్యా.. వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద నిల్చోరాదని సూచించింది.

    ఎంపీ అరవింద్‌కు హైకోర్టు షాక్

    బీజేపీ ఎంపీ అరవింద్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. SC,STలను కించపరిచే వాఖ్యలు చేశారని మాదన్నపేటలో 2022లో నమోదైన SC STకేస్ ట్రైయిల్ ఫేస్ చేయాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈకేసుపై హైకోర్టు స్టే వేకెట్ చేసింది. FIR పై అరవింద్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. పోలీసులు తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది.

    రామ్‌ చరణ్‌కు అమిత్ షా సన్మానం

    మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సత్కరించారు. RRRలో నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దేశానికే గర్వకారణమని కొనియాడారు. షాలువా కప్పి అభినందించారు. ఆస్కార్ వేడుకల అనంతరం అమిత్ షా ఆహ్వానం మేరకు చిరంజీవితో కలిసి ఆయన షా నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    భారీగా పెరిగిన బంగారం ధర

    తెలుగురాష్ట్రాల్లో ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.250 పెరిగి రూ. 53,800కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.270 పెరిగి 58,690కి ఎగబాకింది. కిలో వెండి ధర రూ.400 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 73,100కు చేరింది. అటు విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.