MLAల వ్యవహారంలో ఆడియో
నలుగురు TRS ఎమ్మెల్యేల వ్యవహారంలో ఆడియో బయటికొచ్చింది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రోడ్డి నిందితుల్లో ఒకరైన రామచంద్రభారతితో మాట్లాడుతున్న ఆడియో లీకయింది. దీనిపై ఇవాళ సీఎం కూడా మాట్లాడే అవకాశముంది.
నలుగురు TRS ఎమ్మెల్యేల వ్యవహారంలో ఆడియో బయటికొచ్చింది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రోడ్డి నిందితుల్లో ఒకరైన రామచంద్రభారతితో మాట్లాడుతున్న ఆడియో లీకయింది. దీనిపై ఇవాళ సీఎం కూడా మాట్లాడే అవకాశముంది.
హైదరాబాద్‌లో కీలకమైన నాగోల్ ప్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గత 8 ఏళ్లలో హైదరాబాద్‌లో నిర్మించిన ప్లైఓవర్లను, రోడ్ అండర్ బ్రిడ్జ్‌లను [వీడియో](url) రూపంలో తెలంగాణ డిజిటల్ వింగ్ పోస్ట్ చేసింది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం వీటిని వ్యూహాత్మకంగా నిర్మిస్తోంది. వీడియోలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, ఎల్బీనగర్ ప్లైఓవర్, మైండ్‌స్పేస్ ప్లైఓవర్, JNTUH ఓవర్లు కనిపించాయి. As the #NagoleFlyover is all set for inauguration by @TSMAUDOnline Minister Sri @KTRTRS today, … Read more
దీపావళి సంబరాల్లో పలువురి విషాదాన్ని మిగిల్చాయి. హైదరాబాద్‌లో టపాసుల కారణంగా గాయపడిన వారి సంఖ్య 41కి చేరింది. బాధితులంతా సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. 41 మందిలో 19 మందికి చికిత్స అందించి పంపించారు. మిగతా వారందరూ ఆసుపత్రిలో చేరారు. ఇద్దరికి వైద్యులు కంటి ఆపరేషన్ పూర్తిచేశారు. ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటుచేసి చికిత్స అందిస్తున్నారు. వీడియో కోసం ట్విట్టర్ గుర్తుపై క్లిక్ చేయండి. Till now 24 people, including children had sustained different kinds of eye … Read more
తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు కన్నుల పండువగా జరిగిప్పటికీ అక్కడక్కడా విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లో బాణసంచా కాలుస్తూ 24 మంది గాయపడ్డారు. కళ్లకు గాయాలతో సరోజినీ కంటి ఆసుపత్రిలో చేరారు. వీరిలో 12 మంది చిన్నారులే ఉన్నారు. బాధితుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్ గుర్తుపై క్లిక్ చేసి వీడియో చూడండి. Till now 24 people, including children had sustained different kinds of eye … Read more
మునుగోడులో ఓ దివ్యాంగురాలికి GNM పోస్ట్ ఇప్పించిన కేటీఆర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఉన్న కేటీఆర్ వద్దకు ఓ దివ్యాంగురాలు వచ్చింది. తన కుటుంబ పోషణ నిమిత్తం ఉద్యోగం కావాలని అభ్యర్థించింది. వెంటనే స్పందించిన కేటీఆర్ మంత్రి హరీశ్ రావుకు ఫోన్ చేశారు. ‘బావ ఒక చిన్న రిక్వెస్ట్.. అమ్మాయి పేరు యశోద బాగా చదువుకుంది. కానీ దివ్యాంగురాలు. ఇదివరకు కామినేనిలో GNMగా చేసిందట. చండూరు PHCలో వెకెన్సీలు ఉన్నాయి. ఓసారి వాట్సాప్‌లో పంపిస్తా చూడండి అంటూ … Read more
మునుగోడు ఉపఎన్నికలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీలో ఉన్న తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వెయ్యాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. పార్టీలను చూడొద్దు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలి. ఈ దెబ్బతో టీపీసీసీ ప్రెసిడెంట్ అవుతా. అధికారంలోకి వస్తే తెలంగాణ మొత్తం పాదయాత్ర చేస్తా అంటూ కాల్‌లో కాంగ్రెస్ నేతలను కోరారు. ఈ వీడియోపై కాంగ్రెస్ నేతలు స్పందించాల్సి ఉంది.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కలిశారు. మంగళవారం విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో వీరిద్దరూ భేటీ అయ్యారు. విశాఖలో చోటు చేసుకున్న ఘటనలపై పవన్‌కు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. అంతకుముందు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పవన్‌ను కలసి సంఘీభావం తెలిపారు. కాగా ఇటీవల విశాఖలో పవన్ మీటింగ్‌ను ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసేందుకు విజయవాడ నోవా టెల్ హోటల్ కు చేరుకున్న టి డి పి అధినేత … Read more
ఓ ఎమోషనల్ [వీడియో](url)ను భారత మాజీ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ పంచుకున్నారు. ఓ తల్లి పిల్లి మరణించడంతో రెండు పిల్లి కూనలు అనాథలయ్యాయి. దిక్కులేని స్థితిలో ఉన్న కూనలను చూసిన ఓ కుక్క వాటిని నోట కర్చుకుని హక్కున చేర్చుకుంది. ఈ వీడియోపై నెట్టింట్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. తల్లిప్రేమ అంటే ఇదే అంటూ ఎమోషనల్ కామెంట్ చేస్తున్నారు. రియల్లీ గ్రేట్ అంటూ షేర్ చేస్తున్నారు. A dog mother taking care of Kittens after Cat Mother died. "Motherhood … Read more
చిరుతతో ఓ యువతి రొమాన్స్ చేసిన [వీడియో](url) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో యువతి ఏ మాత్రం భయంలేకుండా చిరుతకు ముద్దులు పెట్టింది. ఆమె ప్రేమతో ఆనందపడుతున్న చీతా..యువితిపై ప్రేమ కురిపించింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు అవక్కావుతున్నారు. ఇదెక్కడి ప్రేమ అంటూ కామెంట్ చేస్తున్నారు. యువతి చేసిన సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోను ఆఫ్రికా యానిమల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by African animals (@african_animal)
TS: మునుగోడు ఉపఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వేళ.. బీజేపీకి నిరసన సెగ తగిలింది. ప్రచారంలో BJP అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురవుతోంది. సంస్థాన్ నారాయణపురంలోని గుజ్జ, కోతులాపురం గ్రామస్థులు నిరసన తెలిపారు. ప్రచారాన్ని అడ్డుకొని తమ గ్రామానికి ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదంటూ రాజగోపాల్‌రెడ్డిని నిలదీశారు. కాగా, రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా వెలుస్తున్న పోస్టర్లు బీజేపీకి తలనొప్పిగా మారాయి. ఐపాయ్ మునుగోడు ఉపఎన్నికల సందర్బంగా సంస్థాన్ నారాయణపురం గుజ్జ గ్రామానికి వచ్చిన #18000Crores రాజగోపాల్ రెడ్డిని #GoBack #RajGopalReddy అంటూ … Read more