• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గమనిక.. ఈ 4 రోజులు అటు వెళ్లకండి

    [VIDEO:](url) దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఫార్ములా ఈ ప్రిక్స్ కారు రేసింగ్ నిర్వహిస్తుండటంతో ట్రాక్ ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఎన్టీఆర్ మార్గ్ చుట్టూ 2.7కి.మీ. పొడవైన ట్రాక్ సిద్ధమైంది. అయితే, ఈ నెల 19, 20న తొలి విడత ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 10, 11న రెండో విడత ట్రయల్ చేపట్టనున్నారు. ఈ నాలుగు రోజులు ఎన్టీఆర్ మార్గ్‌ని మూసివేస్తామని అధికారులు వెల్లడించారు. కాగా, ట్రయల్ రన్‌ని వీక్షించేందుకు టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. వీక్షకులకు స్టాల్స్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. As … Read more

    ఆలోచింపజేస్తున్న పవన్ స్పెషల్ వీడియో

    సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ స్పెషల్ వీడియో ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఏముందంటే.. ‘‘వందల ఏళ్లు పాలించిన బ్రిటీషర్లను ఇప్పుడు రిషి సునాక్ ఏలుతున్నాడు. అలాంటిది ఏపీలో స్వేచ్ఛగా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేకపోతున్నాం. నిరంకుశతత్వాన్ని ప్రశ్నించాలి’’ అంటూ ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ వీడియో నెటిజన్లను, అభిమానులను ఆలోచింపజేస్తోంది. pic.twitter.com/qGQrRnaIvf — Pawan Kalyan (@PawanKalyan) November 8, 2022

    ‘హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే’

    TS: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం అనంతరం ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని రాజగోపాల్ రెడ్డి నిరూపించారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన దుమ్మెత్తి పోశారు. మునుగోడు ఉపఎన్నికలో విజయం కోసం బీజేపీ నానా అక్రమాలకు పాల్పడిందని ఆయన విమర్శించారు. ‘డబ్బుతో గెలవాలని బీజేపీ చూసింది. ఓటర్లకు పంచేందుకు తెస్తూ పలువురు పట్టుబడ్డారు. నల్గొండలో తొలసారిగా 12కు 12 సీట్లు టీఆర్ఎస్ కైవసం … Read more

    తెలంగాణ భవన్‌లో సంబరాలు

    TS: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు దిశగా పయనిస్తోంది. ఇప్పటివరకు 12 రౌండ్లు ముగియగా టీఆర్ఎస్ మెజారిటీతో దూసుకెళ్తోంది. మరోవైపు, రాజగోపాల్ రెడ్డి తన ఓటమిని ఒప్పుకొన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్దకు టీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకుంటున్నారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకొంటున్నారు. ఈ వేడుకలకు కేటీఆర్ హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అనంతరం కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. Another 90k votes to be counted still. Will anything … Read more

    వైసీపీ గూండల్లారా జాగ్రత్త: పవన్ కళ్యాణ్

    గుంటూరు-ఇప్పంటంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామార్శించేందుకు వచ్చిన పవన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ‘పోలీసుల వ్యవహారతీరుపై పవన్ [ఆగ్రహం](url) వ్యక్తం చేశారు. మార్చిలో ఇప్పంటం ప్రజలు జనసేనకు భూమిస్తే.. ఏప్రిల్‌లో ఇళ్లు కూల్చివేస్తామని నోటీసులిచ్చారు. వైసీపీ గూండాల్లారా జాగ్రత్త. రోడ్డు విస్తరణ చేయడానికి ఇప్పంటం ఏమైనా కాకినాడనా? రాజమండ్రినా? గుంతలు పూడ్చలేరు, రోడ్డు వేయలేరు కానీ గ్రామంలో రోడ్డు విస్తరణనా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటం గ్రామం బయలుదేరిన శ్రీ పవన్ … Read more

    సీఎం కేసీఆర్‌ లైవ్‌

    ముఖ్యమంత్రి కేసీఆర్‌ లైవ్‌లో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు తదితర అంశాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ఆధారాలను న్యాయ వ్యవస్థ ముందుంచుతామన్నారు.

    మునుగోడులో పరుగులు తీసిన కేఏ పాల్

    ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, మునుగోడు ఉప ఎన్నిక స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ మునుగోడులో పరుగులు పెట్టారు. పోలింగ్ కేంద్రాల్లోపోలింగ్ సరళిని పరిశీలించి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. నియోజకవర్గంలో బిజీబిజీగా తిరుగుతూ సందడి చేశారు. కాగా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కేఏ పాల్ తన విన్యాసాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రజలతో కలసి డ్యాన్స్ చేయడం, పాటలు పాడడం, సైకిల్ తొక్కడం వంటి చేష్టలతో నవ్వించారు. #KAPaul also running in the #Munugodu race … Read more

    మయోసైటిస్‌ త్వరగా నయం కాదు

    మయోసైటిస్‌ వ్యాధి త్వరగా నయం కాదని సన్‌ స్పిరిచ్యువల్‌ వ్యవస్థాపకులు విక్రమాదిత్య అన్నారు. ప్రతి సంవత్సరం 1500 నుంచి 2000 మయోసైటిస్‌ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. జీవన విధానాల మార్పుల కారణంగానే ఈ వ్యాధి సోకుతుందని వెల్లడించారు. అతిగా శారీరక శ్రమ చేయటంతో పాటు ఆహారపు అలవాట్ల కారణంగా మయోసైటిస్‌ సోకే ప్రమాదం ఉందని విక్రమాదిత్య తెలిపారు. హీరోయిన్‌ సమంత ఈ వ్యాధితోనే బాధపడుతున్నారు.

    న్యాయ రాజధాని కోసం కర్నూలులో మిలయన్ మార్చ్

    ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకల వేళ.. కర్నూలులో ఉద్రిక్తత నెలకొంది.రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో [మిలియన్](url) మార్చ్ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్దఎత్తున కర్నూలు ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్.. రాజ్ విహార్ నుంచి కలెక్టరేట్ వరకు మిలియన్ మార్చ్ చేపట్టారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని దానిని సీఎం జగన్ నెరవెర్చాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలంటూ కర్నూలులో మిలియన్ మార్చ్‌ … Read more

    6వేల మందితో చిరు చిత్రం

    మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని విద్యార్థులు వినూత్నంగా చాటుకున్నారు. తమ మైదానంలో మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు చిరు ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని డ్రా చేసి.. ఆరు వేల మంది ఆ లైన్‌పై కూర్చున్నారు. ‘క్యాన్సర్‌పై పోరాటం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లిన చిరుకి ఈ వీడియో చూపించి సర్‌ప్రైజ్ చేశారు. ఈ వీడియో చూసిన చిరు ఎంతో మురిసిపోయి విద్యార్థులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ వీడియోను చిత్ర దర్శకుడు బాబీ ట్విటర్‌లో షేర్ చేయగా.. వావ్ సూపర్ అటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వీడియో … Read more