• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తన కూతురి తెరగేట్రంపై రోజా క్లారిటీ

    తన పిల్లలు సినిమాల్లోకి వస్తానంటే చాలా సంతోషిస్తానని మంత్రి రోజా అన్నారు. నటన తప్పు అని నేనెప్పుడూ చెప్పను. వారు సినిమాల్లోకి వస్తామంటే నిజంగా నేను చాలా సంతోషిస్తా. కానీ నా కూతురు సైంటిస్ట్‌ కావాలనుకుంటోంది. బాగా చదువుతోంది. ఇప్పటికైతే తనకు సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదు. వస్తే ఒక హీరోయిన్‌గా, ఒక తల్లిగా అండగా నిలుస్తా’ అని రోజా అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా ఈ వ్యాఖ్యలు చేశారు.

    తాత నాకు చాలా నేర్పించారు:సితార

    సూపర్ స్టార్ కృష్ణ మృతితో మహేశ్ కుమార్తె సితార భావోద్వేగానికి లోనయ్యింది. కృష్ణ భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించింది. “ఇక నుంచి వారాంతంలో మధ్యాహ్నం భోజనం ఒకేలా ఉండదు. మీరు నాకు ఎన్నో విషయాలు నేర్పించారు. నన్ను ఎప్పుడూ నవ్వుతూ ఉండేలా చేశారు. కానీ, ఇప్పుడు మీ జ్ఞాపకాల మాత్రమే మిగిలాయి. మీరు నాకు హీరో. ఏదో ఒక రోజు మీరు గర్వపడేలా చేస్తాను. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను తాతగారు” అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

    రష్మిక మందనాకు సారీ చెప్పిన వార్నర్

    ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా నితిన్ నటించిన భీష్మ సినిమాలో ఓ సాంగ్‌ను స్పూఫ్ చేశాడు. రష్మిక మందనా ఫేస్‌ను తన ముఖంగా మార్చాడు. దాంతో నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ‘వాటే బ్యూటీ’పాటలోని.. ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు’ అనే లిరిక్స్‌ను ఎడిట్ చేశాడు. రష్మిక ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇమిటేట్ చేశాడు. ఈ వీడియో చేసినందుకు రష్మిక మందన్నకి సారీ అంటూ కామెంట్ కూడా … Read more

    వైరల్ అవుతున్న మహేశ్ వీడియో

    [VIDEO:](url) సూపర్ స్టార్ కృష్ణ మృతికి నెట్టిళ్లు కూడా శోక సంద్రమైంది. కృష్ణ గురించి మహేశ్ బాబు చెప్పిన మాటల్ని అభిమానులు మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఏడాది తొలినాళ్లలో మహేశ్ తన సోదరుడిని కోల్పోయాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్ బాబు.. అభిమానుల ప్రేమకు తరించిపోయాడు. ‘ఈ మధ్య నాకు బాగా దగ్గరగా ఉండేవారు ఉన్నట్టుండి దూరమయ్యారు. అయినా, మీ అభిమానం అలాగే ఉంది. ఇదొక్కటి చాలు నన్ను ముందుకు నడిపించడానికి’ అని మహేశ్ భావోద్వేగంతో చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. రెండు … Read more

    సూపర్‌ స్టార్ కృష్ణ కడచూపు

    సూపర్‌ స్టార్‌ కృష్ణ కడచూపు కోసం సినీ రాజకీయ ప్రముఖులు తరలివెళ్తున్నారు. ఆయన పార్థీవ దేహానికి పూలమాలలు సమర్పించి నివాళి అర్పిస్తున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు.

    నాన్న లాగే కూతురు; రేణుదేశాయ్

    సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో పవన్ కుమార్తె ఆద్య కారుపై గ్లాస్ తొలగించి నిలబడి ఎంజాయ్ చేస్తూ ప్రయాణిస్తోంది. దీన్ని రేణుదేశాయ్ వీడియో తీసి.. ‘నాన్నఎలాగో కూతురు అలాగే’ అనే క్యాప్షన్ ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ [వీడియో](url) వైరల్‌గా మారింది. కాగా ఇటీవల పవన్ ఏపీలోని ఇప్పటం గ్రామానికి కారు టాప్‌పై కూర్చుని ట్రావెల్ చేసిన సంగతి … Read more

    కొడుకుతో కలిసి నాని రచ్చ

    చిల్డ్రన్స్‌ డే సందర్భంగా తన కొడుకు అర్జున్‌తో కలిసి నాని సరదగా సమయాన్ని గడిపాడు. కొడుకు కోసం షూటింగ్స్‌ను పక్కన పెట్టి ఫ్యామిలీతో కలిసి అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.కాలిఫోర్నియాలోని డిస్నీ ల్యాండ్‌లో సందడి చేశాడు. అక్కడ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచే ది పార్ట్‌నర్స్ స్టాచ్యూ ముందు నాని, అర్జున్‌ అచ్చం అలాగే నిలబడి కెమెరాకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఆ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. https://www.instagram.com/p/Ck7qSHNSQ7V/

    పార్వతి నాయర్‌పై పనిమనిషి సంచలన ఆరోపణలు

    తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించిన నటి పార్వతి నాయర్. ఇటీవల తన ఇంట్లో దాదాపు రూ.13 లక్షల విలువైన సామగ్రి పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటి పనిమనిషి సుభాష్‌పై అనుమానం వ్యక్తం చేసింది. అయితే పోలీసుల విచారణలో సుభాష్‌, నటిపై సంచలన ఆరోపణలు చేశాడు. పార్వతి ఇంటికి రాత్రిపూట ఎవరెవరో వచ్చేవారని, అది నేను చూడటంతో నన్ను వేధించడం మొదలు పెట్టిందని చెప్పాడు. తనపై లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరించేదని, ఇప్పుడు కావాలనే ఈ దొంగతనం కేసులో ఇరికించిందని … Read more

    ఆ సీన్‌ అమ్మా,నాన్నలకు చెప్పే చేశా: ఇవానా

    మలయాళ కుట్టి ఇవానా ఇప్పుడు చాలా మంది కుర్రకారుకి క్రష్‌. 12వ ఏటనే సినిమాల్లోకి వచ్చిన ఇవానా ప్రస్తుతం హీరోయిన్‌గా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. తాజాగా ‘లవ్‌ టుడే’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ సినిమాలో హీరోతో పడక గదిలో ఉండే ఓ బోల్డ్‌ సీన్‌ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. దీనిపై తాజాగా ఈ అమ్మడు స్పందించింది. ‘నాకు దర్శకుడు కథ చెప్పినప్పుడే ఆ సన్నివేశం గురించి నా తల్లిదండ్రులతో చర్చించాను. వారు కూడా ఓకే చెప్పారు. అయినా ఎలాంటి … Read more

    డబ్బులు తీసుకుని మోసం చేశారు: గీతూ రాయల్‌

    బిగ్‌ బాస్‌ బ్యూటీ గీతూ రాయల్‌, ఆ షోకు రాకముందే సోషల్‌ మీడియాలో చాలా పాపులర్‌. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌గా చిత్తూరు యాసతో ఫాలోవర్లను పెంచుకుంది. బిగ్‌ బాస్‌ సీజన్‌-6 నుంచి బయటికి వచ్చాక కుండ బద్దలు కొట్టే ఆరోపణలు చేస్తోంది. బిగ్‌బాస్‌లో తాను నిజాయతీగా ఆడానని అయితే తనను స్నేహితులు, అయినవాళ్లే మోసం చేశారని కన్నీరు పెట్టుకుంది. తనను ప్రమోట్‌ చేసేందుకు PR టీంను పెట్టుకుంటే వారు డబ్బులు తీసుకుని మోసం చేశారని భావోద్వేగానికి లోనైంది.