• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 100cr CLUB: టాలీవుడ్‌లో ఇప్పటిదాకా  రూ. 100 కోట్లు కొళ్లగొట్టిన  సినిమాలివే!!

    తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద సినిమాల హవా నడుస్తోంది. స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే దాదాపు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందనే చెప్పాలి. సినిమాకు మార్కెట్ పెరగటంతో పాటు ప్రేక్షకులు కూడా అదేస్థాయిలో ఆదరిస్తున్న కారణంగా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. టాలీవుడ్‌లో ఈ జాబితాలో సుమారు 40 సినిమాలు ఉన్నాయి. సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు 100 కోట్ల క్లబ్‌లో టాప్‌లో ఉన్నాడు.రూ.100 కోట్లు కొళ్లగొట్టిన సినిమాలు, హీరోలు ఎవరో ఓ సారి చూద్దాం. హీరో -సినిమాలు హీరో సినిమాలు మహేశ్‌బాబు 6 … Read more

    SS RAJAMOULI: రాజమౌళి సినిమాల్లో కామన్‌గా కామాంధుడి పాత్ర… అసలు ఎందుకిలా ?

    దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి సినిమాను ఎమోషన్‌తో నడిపిస్తాడు. ప్రేక్షకులు చిత్రంలో లీనమయ్యేందుకు కొన్ని క్యారెక్టర్లను సృష్టిస్తాడు. తన సినిమాల్లో ఓ కామాంధుడి పాత్ర కామన్‌గా ఉంటుంది. మెుదటి సినిమా స్టూడెంట్‌ నంబర్‌ 1 నుంచి మెుదలుకొని చాలా సినిమాల్లో మనకు ఈ పాత్రలు కనిపిస్తాయి. ఆ క్యారెక్టర్లు ఏంటో ఓసారి చూద్దాం..  స్టూడెంట్‌ నంబర్‌ 1 ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్‌ నంబర్‌ 1 సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు రాజమౌళి. ఈ చిత్రంలో ఛత్రపతి శేఖర్‌ ఓ అమ్మాయిని రేప్ చేయాలని … Read more

    ఏజెంట్‌ నుంచి ‘వైల్డ్‌ సాల’ పాట రిలీజ్

    అఖిల్‌ అక్కినేని హీరోగా తెరకెక్కిన ఏజెంట్‌ సినిమా నుంచి ‘వైల్డ్‌ సాల’ సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాటను భీమ్స్‌ సిసిరోలియో కంపోజ్‌ చేశారు. ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఏజెంట్‌ సినిమాకు.. హిప్ హాప్ తమిజా సంగీతం అందించారు. ఈ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్‌గా చేస్తోంది. ఏప్రిల్‌ 28న ఏజెంట్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్‌ తన గత సినిమాల కంటే ఎంతో భిన్నంగా ఏజెంట్‌లో కనిపించనున్నాడు.

    MOVIE RELEASES: ఈ వారం ( ఏప్రిల్ 28 )న థియేటర్లు/ ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు

    వేసవి సెలవులు వచ్చాయి. ఈ వారం పెద్ద సినిమాలు కూడా సందడి చేయనున్నాయి. మణిరత్నం, అక్కినేని అఖిల్ బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడుతున్నారు. అంతేకాదు, బ్లాక్‌ బస్టర్ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి, ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో రిలీజ్ అయ్యే వాటి గురించి తెలుసుకుందాం.  ఏజెంట్‌ అఖిల్‌ అక్కినేని, సాక్షి వైద్య జంటగా వస్తున్న ఏజెంట్ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించగా… … Read more

    3rd Day BOX OFFICE: స్టార్‌ హీరో లేకున్నా కలెక్షన్లు  కుమ్మేసిన టాప్‌-10 మీడియం రేంజ్ సినిమాలు ఇవే!

    కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్‌ ఊహించనంతగా వస్తాయి. కానీ, సినిమా బాలేకపోతే తర్వాత రోజు నుంచి తగ్గిపోతాయి. చిత్రం బాగున్నప్పటికీ అసలు వసూళ్లు రాని సినిమాలు కూడా ఉన్నాయి. ఇక పెద్ద సినిమాలకు వరుసగా మూడ్రోజులు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. హీరో స్టార్‌ ఇమేజ్‌ ప్రేక్షకులను థియేటర్‌కు లాగుతుంది. కానీ మీడియం రేంజ్ చిత్రాలకు ఆ పరిస్థితి ఉండదు. సినిమా బాగుందని టాక్‌ వస్తే తప్ప థియేటర్‌కు ఎవరూ వెళ్లరు. అలా  తొలి రోజు కలెక్షన్లు తక్కువగా ఉన్నా…. ప్రేక్షకుల టాక్‌తో మూడో రోజు కల్లా … Read more

    ఫర్హానా టీజర్‌కు 5 మిలియన్‌ వ్యూస్‌

    ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో వస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఫర్హానా. నెల్సన్‌ వెంకటేశన్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సనిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. మే 12న విడుదల కానున్న సినిమాకు సంబంధించిన టీజర్‌ ఇటీవల విడుదల చేయగా 5 మిలియన్ వ్యూస్ సాధించింది.

    విరూపాక్ష వసూళ్ల ప్రభంజనం

    విరూపాక్ష వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. ఈ చిత్రం విడుదలైన రెండురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.28కోట్లు కొల్లగొట్టింది. సక్సెస్‌ఫుల్ టాక్‌తో దూసుకెళ్తోంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా విరూపాక్ష నిలిచింది. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద రూ.12 కోట్లు సాధించిన విరూపాక్ష శనివారం అంతకుమించిన కలెక్షన్ల రాబట్టింది. కాగా ఈ సినిమాలో సాయిధరమ్ సరసన సంయుక్త మీనన్ నటించింది. కార్తిక్ దండు ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. మూడో రోజు కూడా కాసుల వర్షం కురిసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5 కోట్లకుపైగా కొళ్లగొట్టింది. ఇప్పటివరకు … Read more

    పొన్నియన్‌ సెల్వన్‌ తెలుగు ప్రమోషన్స్‌ షురూ..!

    మణిరత్నం దర్శకత్వం వహించిన ‘పొన్నియన్‌ సెల్వన్‌ 2’ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్‌లలో జోరు చూపిస్తున్న చిత్రబృందం ఇప్పుడు తెలుగులోనూ ప్రచారానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా తెలుగు వర్షన్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్ర ఈ వేడుక జరగనుంది. ఈ మేరకు చిత్రబృందం ఓ స్పెషల్ [వీడియో](url)ను సైతం రిలీజ్‌ చేసింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ తన ట్విటర్‌ ఖాతాలో వీడియోను షేర్ చేసింది. Don't miss the … Read more

    ఆసక్తికరంగా ‘మామా మశ్చీంద్ర’ ట్రైలర్!

    టాలీవుడ్ హీరో సుధీర్ బాబు పోసాని హీరోగా నటించిన ‘మామా మశ్చీంద్ర’ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్‌బాబు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీలో సుధీర్ బాబు మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని నటుడు, రచయిత హర్షవర్ధన్ తెరకెక్కించారు. సుధీర్ సరసన ఈషా రెబ్బ, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను త్వరలో విడుదల చేయనున్నారు.

    జైశ్రీరాం లిరికల్ మోషన్ పోస్టర్

    ఆదిపురుష్ నుంచి జైశ్రీరాం లిరికల్ మోషన్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా అజయ్- అతుల్ స్వరాలు సమకూర్చారు. 1.03 నిమిషాల నిడివితో ఈ లిరికల్ వీడియో ఉంది. ‘సహచరులై మేం వస్తున్నాం.. సఫలం స్వామి కార్యం’ అంటూ సాగే గీతం ఆకట్టుకుంటోంది. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీత పాత్రలో నటించారు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయక పాత్ర పోషించారు. జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో సినిమాను రిలీజ్ చేయనున్నారు.