దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి సినిమాను ఎమోషన్‌తో నడిపిస్తాడు. ప్రేక్షకులు చిత్రంలో లీనమయ్యేందుకు కొన్ని క్యారెక్టర్లను సృష్టిస్తాడు. తన సినిమాల్లో ఓ కామాంధుడి పాత్ర కామన్‌గా ఉంటుంది. మెుదటి సినిమా స్టూడెంట్ నంబర్ 1 నుంచి మెుదలుకొని చాలా సినిమాల్లో మనకు ఈ పాత్రలు కనిపిస్తాయి. ఆ క్యారెక్టర్లు ఏంటో ఓసారి చూద్దాం..
స్టూడెంట్ నంబర్ 1
ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు రాజమౌళి. ఈ చిత్రంలో ఛత్రపతి శేఖర్ ఓ అమ్మాయిని రేప్ చేయాలని చూస్తుండగా హీరో వాళ్లని అడ్డుకుంటాడు. ఫైట్ చేసి అమ్మాయిని రక్షిస్తాడు. ఈ క్రమంలో మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు ఎన్టీఆర్. ఇలాంటి ట్విస్ట్‌తో స్క్రీన్‌ప్లే మార్చేశాడు జక్కన్న.
సింహాద్రి
ఎన్టీఆర్‌తో సింహాద్రి సినిమా తీసి ఊర మాస్ హిట్ కొట్టాడు రాజమౌళి. ఇందులో విలన్ రాహుల్ దేవ్ కామాంధుడి పాత్రలో కనిపిస్తాడు. అత్యంత కిరాతకాలు చేస్తున్న అతడిని చంపేయడంతో సింగమలై అని ఎన్టీఆర్‌ను పిలుస్తుంటారు. అతడిని చంపేయడంతోనే సినిమా కీలక టర్న్ తీసుకుంటుంది. సింగమలై అంటూ కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్. ఈ సినిమా కథను తొలుత ప్రభాస్‌కు చెప్పాడట రాజమౌళి.
సై..
నితిన్ హీరోగా కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రం సై. ఇందులో రగ్బీ గేమ్‌తో సంచలనం సృష్టించాడు జక్కన్న. ఈ చిత్రంలోనూ విలన్ ప్రదీప్ రావత్‌కు అమ్మాయిల వీక్‌నెస్ ఉంటుంది. హీరో ముప్పు తిప్పలు పెడుతున్న వేళ శశికళ అనే అమ్మాయి దగ్గరికి వెళతాడు. వీళ్లిద్దరి మధ్య కూడా కొన్ని కామెడీ సన్నివేశాలు తీశాడు దర్శకుడు.
ఛత్రపతి
ఛత్రపతిలో ఎన్ని పాత్రలు ఉన్న షఫీ క్యారెక్టర్ ప్రత్యేకం. సినిమాలో ప్రభాస్ చెల్లిలి బస్సులో వెళ్తుండగా అసభ్యంగా ప్రవర్తిస్తాడు షఫీ. అతడిని చితక్కొట్టి గుండు గీయిస్తాడు ప్రభాస్. అక్కడే వాళ్లిద్దరూ అన్నదమ్ములు అని తెలుస్తోంది. ఇలా ప్రేక్షకులు చిత్రంలో లీనమయ్యేలా చేశాడు దర్శక దిగ్గజం రాజమౌళి.
విక్రమార్కుడు
విక్రమార్కుడులో బావూజీ కుమారుడిగా నటించిన అమిత్ తివారిది కామాంధుడి పాత్ర. ఊర్లో నచ్చిన మహిళను తీసుకెళ్లి రేప్ చేస్తుంటాడు. అతడిని చితకబాది జైలులో వేస్తాడు రవితేజ. ఈ ఒక్క సీన్‌తో విక్రమ్ రాథోడ్ పవర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు రాజమౌళి. ఈ సీన్ సినిమాకు పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.
మగధీర
మగధీరలోనూ రాజమౌళి కామాన్ని ప్రధాన ఇతివృత్తంగా మేళవించాడు. మిత్రవిందపై రణదేవ్ బిల్లా కన్నపడుతుంది. పునర్జన్మల నేపథ్యంలోనూ రణదేవ్ కామంధుడి క్యారెక్టర్‌లో కొనసాగుతాడు. కాజల్‌పై ఉన్న ఇష్టాన్ని తరచూ చూపిస్తుంటాడు. ఇలా విలన్ పాత్రను ప్రేక్షకులకు నచ్చకుండా చేస్తూ హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్ చేశాడు జక్కన్న. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈగ
ఈగలో కిచ్చ సుదీప్ క్యారెక్టర్ కూడా దాదాపు ఇలాంటిదే. సినిమా ప్రారంభంలోనే హంసనందినితో వచ్చే సన్నివేశాలు.. తర్వాత సమంతను ఇష్టపడుతూ ఆమెతో ట్రావెల్ చేస్తున్న సంఘటనలతో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది.
బాహుబలి 2
బాహుబలి 2లోనూ ఓ కామంధుడి పాత్ర మనకు కనిపిస్తుంది. దేవసేన దైవ దర్శనం కోసం వస్తుంటే సేతుపతి( రాకేష్ వర్రే) ఆమెను అవమానించాలని ప్రయత్నిస్తాడు. ఆమెతో వస్తున్న మహిళలను అసభ్యంగా తాకుతూ.. దేవసేనను తాకెందుకు ప్రయత్నిస్తాడు. దేవసేన కత్తితో అతని వేళ్లను నరుకుతుంది. ఈ సీన్ తర్వాత కోర్ట్ సీన్‌లో ప్రభాస్ సేతుపతి తల నరికే సన్నివేశం గూస్‌బంప్స్ కలిగిస్తుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!