• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 100cr CLUB: టాలీవుడ్‌లో ఇప్పటిదాకా  రూ. 100 కోట్లు కొళ్లగొట్టిన  సినిమాలివే!!

    తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద సినిమాల హవా నడుస్తోంది. స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే దాదాపు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందనే చెప్పాలి. సినిమాకు మార్కెట్ పెరగటంతో పాటు ప్రేక్షకులు కూడా అదేస్థాయిలో ఆదరిస్తున్న కారణంగా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. టాలీవుడ్‌లో ఈ జాబితాలో సుమారు 40 సినిమాలు ఉన్నాయి. సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు 100 కోట్ల క్లబ్‌లో టాప్‌లో ఉన్నాడు.రూ.100 కోట్లు కొళ్లగొట్టిన సినిమాలు, హీరోలు ఎవరో ఓ సారి చూద్దాం.

    హీరో -సినిమాలు

    హీరో సినిమాలు
    మహేశ్‌బాబు6
    అల్లు అర్జున్5
    ప్రభాస్‌4
    ఎన్టీఆర్‌ 4
    చిరంజీవి 3
    రామ్‌ చరణ్‌ 3
    పవన్‌ కల్యాణ్3
    బాలకృష్ణ 2

    మహేశ్‌ బాబు

    100 కోట్లకు పైన కలెక్ట్ చేయాలంటే మహేశ్ బాబుకు సాధ్యం. ఎందుకంటే ఆయన సినిమాలు యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నా సులభంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబడతాయి. మహేశ్‌కు ఉన్న క్రేజ్‌ అలాంటిది మరి.

    సినిమా కలెక్షన్‌
    సరిలేరు నీకెవ్వరు 237 కోట్లు
    సర్కారు వారి పాట192 కోట్లు
    మహర్షి 184 కోట్లు
    భరత్‌ అనే నేను178 కోట్లు
    శ్రీమంతుడు 153 కోట్లు
    దూకుడు 101 కోట్లు

    ప్రభాస్‌ 

    ఎక్కువ సినిమాలు మహేశ్‌కు ఉండొచ్చు గానీ ఎక్కువ కలెక్షన్లు మాత్రం ప్రభాస్‌వే. బాహుబలి లాంటి సినిమాలను కొట్టే సినిమా రావాలంటే అది మళ్లీ ప్రభాస్‌ నుంచే రావాలి.

    సినిమాకలెక్షన్‌
    బాహుబలి-21749 కోట్లు
    బాహుబలి-1600 కోట్లు
    సాహో 417 కోట్లు
    రాధేశ్యామ్‌151 కోట్లు

    చిరంజీవి 

    ఈతరం హీరోలతో పోటీ పడుతూ రూ.100 కోట్ల క్లబ్‌లో దూసుకుపోవడం కేవలం మెగాస్టార్‌కే చెల్లింది. యంగ్‌ హీరోలను దాటి 3 సినిమాలు 100 కోట్లు వసూలు చేయడం బాస్‌ క్రేజ్‌కు నిదర్శనం

    సినిమాకలెక్షన్‌
    సైరా నరసింహా రెడ్డి248 కోట్లు
    వాల్తేరు వీరయ్య200 కోట్లు
    ఖైదీ నం.150166 కోట్లు

    అల్లు అర్జున్

    పుష్పతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్‌ ఆ సినిమా కంటే  ముందే 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. రాబోయే రోజుల్లో ఈ లిస్ట్‌లో బాస్‌గా ఎదిగేందుకు అల్లు అర్జున్‌కు చక్కటి అవకాశముంది.

    సినిమాకలెక్షన్‌
    పుష్ప-ది రైజ్‌369 కోట్లు
    అల వైకుంఠపురములో274 కోట్లు
    సరైనోడు 120 కోట్లు
    డీజే 115 కోట్లు
    రేసు గుర్రం 102 కోట్లు

    రామ్‌ చరణ్‌

    RRRతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రామ్‌చరణ్‌, అంతకు ముందే  తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌కు వచ్చిన క్రేజ్‌కు ఈ లిస్ట్‌లో తన సినిమాలు పెరుగుతాయడనడంలో సందేహం లేదు.

    సినిమాకలెక్షన్‌
    RRR 1131కోట్లు
    రంగస్థలం 213 కోట్లు
    మగధీర 125 కోట్లు

    జూ. ఎన్టీఆర్‌

    RRRతో రామ్‌ చరణ్‌కు ఎంత పేరొచ్చిందో అంతకు 10 రెట్లు ఎక్కువే పేరు సంపాదించాడు తారక్‌. తనకున్న వాక్‌ చాతుర్యంతో మరింత ఎక్కువ ఫ్యాన్‌బేస్‌ సొంతం చేసుకున్నాడు. 100 కోట్ల క్లబ్‌లో తారక్‌ కూడా మరింత దూసుకెళ్లబోతున్నాడు.

    సినిమాకలెక్షన్‌
    RRR1131కోట్లు
    అరవింద సమేత155 కోట్లు
    జై లవకుశ145 కోట్లు
    జనతా గ్యారేజ్‌126 కోట్లు

    పవన్ కల్యాణ్

    టాలివుడ్‌లో అరాచక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న పవన్‌ కల్యాణ్‌కు ఈ క్లబ్‌లో 3 సినిమాలు ఉన్నాయి. అయితే పవర్ స్టార్‌ ప్రస్తుత సినిమా లైనప్‌ చూస్తుంటే తప్పకుండా కుర్ర హీరోలను దాటి ముందుకెళ్లే అవకాశముంది.

    సినిమాకలెక్షన్‌
    భీమ్లా నాయక్‌ 161 కోట్లు
    వకీల్‌ సాబ్‌138 కోట్లు
    అత్తారింటికి దారేది 131 కోట్లు

    బాలకృష్ణ

    అఖండ సినిమాతో బాలయ్య ప్రభంజనం సృష్టించాడు. ఆ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరగా.. ఇటీవల విడుదలైన వీరసింహా రెడ్డి కూడా అదే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న NBK 108 కూడా భారీ బడ్జెట్‌తోనే రూపొందిస్తున్నారు.

    సినిమాకలెక్షన్‌
    అఖండ 133 కోట్లు
    వీరసింహా రెడ్డి109 కోట్లు

    మరికొన్ని సినిమాలు

    వెంకటేశ్‌, వరుణ్ తేజ్‌ కాంబోలో వచ్చిన F2 రూ.100కోట్లు వసూలు చేసింది. కుటుంబ కథా చిత్రం కావటంతో మంచి కలెక్షన్లు వచ్చాయి.  రౌడీ విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం, రవితేజ ధమాకా, నాని దసరా చిత్రాలు ఈ క్లబ్‌లో ఉన్నాయి.

    సినిమాహీరో కలెక్షన్‌
    F2 వెంకటేశ్‌-వరుణ్‌ తేజ్‌143 కోట్లు
    గీత గోవిందంవిజయ్‌ దేవరకొండ 130 కోట్లు
    దసరా నాని 110 కోట్లు
    ధమాకా రవితేజ 108 కోట్లు

    పాత రోజుల్లో సినిమా హిట్‌ లెక్కలు రోజుల్లో చూసేవారు. సిల్వర్ జుబ్లీ, గోల్డెన్‌ జుబ్లీ, 100 డేస్‌ ఫంక్షన్లు చేసేవారు.కానీ ఇప్పుడు రోజులు మారాయి. సినిమా పక్కా కమర్షియల్‌ అయిపోయింది. హిట్‌ లెక్కలు కలెక్షన్లతోనే నడుస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇక 100 కోట్ల క్లబ్‌ గురించి మాట్లాడటం మానేసి రూ.1000 కోట్ల క్లబ్‌ గురించి మాట్లాడుకునే రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv