• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nabha Natesh Hot: పైట పక్కకు జరిపేసి.. అన్నింటికి తెగించిన నభా నటేష్‌!
    Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    See More

    అయోధ్యలో హనుమాన్‌

    హనుమాన్‌ చిత్ర యూనిట్ రామజన్మభూమి ప్రాంతమైన అయోధ్యలో పర్యటించింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించి రాముడి ఆశీర్వచనాలు తీసుకున్నామంటూ చిత్రబృందం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url)ను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది. ఇటీవల విడుదలైన హనుమాన్ టీజర్‌కు దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. A Glimpse into the whirlwind tour of Team #HanuMan to Ayodhya, where they sought the divine blessings of the … Read more

    థ్రిల్లింగ్‌గా ‘ముఖచిత్రం’ ట్రైలర్

    యంగ్ డైరెక్టర్ సందీప్ రాజ్ తెరకెక్కించిన ‘ముఖచిత్రం’ ట్రైలర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది లవ్ స్టోరీయో.. లేదా థ్రిల్లరో కాదు.. స్పోర్ట్స్ డ్రామా అంటూ సాగే డైలాగ్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఈ సినిమాలో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. మూవీలో వికాస్ వశిష్ఠ, ప్రియా వడ్లమాని, చైతన్యరావ్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. పాకెట్ మంకీ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

    చిక్కుల్లో రవీనా టాండన్

    బాలీవుడ్ నటి రవీనా టాండన్ చిక్కుల్లో పడ్డారు. మధ్యప్రదేశ్‌లో సాత్పురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పెద్దపులిని అతి సమీపంగా ఫొటో తీయడంపై వివాదం చెలరేగింది. ఈ విషయంపై అటవీ అధికారులు రవీనాకు నోటీసులు ఇవ్వనున్నారు. కాగా ఇటీవల రవీనా సాత్పురా ఫారెస్ట్‌లో పర్యటించింది. అక్కడ తీసిన ఫొటోలు, [వీడియో](url)లను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి వైరల్ కావడంతో అధికారులు విచారణ ప్రారంభిస్తున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న డ్రైవర్, అధికారులకు నోటీసులు ఇవ్వనున్నారు. Got beautiful shots of sharmilee and her … Read more

    తెలుగులోనూ ‘రంజితమే’

    తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన ’వారిసు’ చిత్రంలో ‘రంజితమే’ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. 25 రోజుల్లోనే 7 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఉంది. కాగా ఈ సినిమాను తెలుగులో ‘వారసుడు’గా విడుదల చేస్తున్నారు. రంజితమే సాంగ్‌ను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. కాగా ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్నా నటించింది. వంశీ పైడిపల్లి ఈ మూవీని తెరకెక్కించారు. జనవరి 11న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

    ఇజ్రాయెల్ దర్శకుడిపై అనుపమ్ ఖేర్ ఆగ్రహం

    [VIDEO:](url) కశ్మీరీ ఫైల్స్‌పై ఇజ్రాయెల్ దేశ దర్శకుడు నవడ్ ల్యాపిడ్ వ్యాఖ్యలను నటుడు అనుపమ్ ఖేర్ ఖండించారు. నిజాన్ని చూడలేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిజాన్ని చూడలేకపోతే కళ్లు, నోరు మూసుకోండి. ఇది మా దేశంలో ఒక విషాద చరిత్ర. కావాలంటే ఇక్కడికి వచ్చి తెలుసుకోండి. భారత్, ఇజ్రాయెల్ మిత్ర దేశాలు. రెండూ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయి. కశ్మీరీ హిందువుల బాధను ఇజ్రాయెల్‌లో సామాన్యుడూ అర్థం చేసుకోగలడు. అయితే, ప్రతి దేశంలోనూ దేశద్రోహులు ఉంటారు కదా’ అని ఇన్‌స్టాగ్రాం వీడియో ద్వారా … Read more

    రష్యన్ భాషలో పుష్ప ట్రైలర్

    బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్ పుష్ప చిత్రాన్ని రష్యన్ లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే డిసెంబర్ 8న విడుదలకు ముహుర్తం ఖరారయ్యింది. కేవలం వారం మాత్రమే సమయం ఉండటంతో ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రైలర్ కట్ చేయకుండా…మన దగ్గర రిలీజ్ చేసిన దానికి రష్యన్ లో డబ్బింగ్ చెప్పారు. భారీ అంచనాలతో వచ్చిన పుష్ప ట్రెండ్ సెట్ చేసింది. అల్లు అర్జున్ మ్యానరిజమ్ అన్నిచోట్లకు పాకింది.

    ముదురుతున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ వివాదం‌

    ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) చైర్మన్ నడవ్ లపిడ్ ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదొక ప్రాపగాండ అని, వల్గర్ మూవీ అని వ్యాఖ్యానించారు. దీనిపై దేశవ్యాప్తంగా నడవ్‌పై విమర్శలు చెలరేగుతున్నాయి. తాజాగా ఇజ్రెయెల్ రాయబారి నౌర్ గిలాన్.. నడవ్‌ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే రకమైన సమస్య ఎదుర్కొంటున్న రెండు దేశాల సారూప్యాన్ని కూడా నడవ్ గుర్తించలేకపోయాడని మండిపడ్డారు. నీ [వ్యాఖ్యలు](url) సిగ్గు చేటని ఆగ్రహించారు. Calling this as a vulgar … Read more

    అభిమానుల ప్రేమకు దాసుడిని; చిరంజీవి

    అభిమానుల ప్రేమకు తాను దాసుడినని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 [అవార్డు ](url)అందుకున్నారు. ‘‘ ఈ క్షణం కోసం దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్నా. అవార్డు ఇచ్చినందుకు ఇఫీ, ప్రభుత్వానికి కృతజ్ణతలు. 45 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నా. పాలిటిక్స్ వల్ల గ్యాప్ వచ్చింది. అయినా అభిమానులు నన్ను ఆదిరించారు. వారి ప్రేమకు దాసుడిని’’ అంటూ చిరు పేర్కొన్నారు. Chiranjeevi garu thanked fans and Narendra … Read more

    మీ అభిమానం గొప్పది: మహేశ్ బాబు

    నాన్న తనకెంతో ఇచ్చారని, అన్నింటికన్నా గొప్పది ఫ్యాన్స్ అభిమానమని మహేశ్ బాబు వెల్లడించారు. సూపర్ స్టార్ కృష్ణ పరమదించి 13రోజులు పూర్తయిన నేపథ్యంలో వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. ‘నాన్నెంతో ఇచ్చారు. వాటిల్లో గొప్పనైనది మీ అభిమానం. ఆయనకు ఎంతో రుణపడి ఉంటాను. మీ అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. నాన్న మన గుండెల్లోనే ఉంటారు. మన మధ్యే ఉంటారు’ అని మహేశ్‌బాబు చెప్పారు. మళ్లీ జన్మలో కూడా ఆయన అల్లుడిగానే పుట్టాలని నటుడు సుధీర్ బాబు ఎమోషనల్ … Read more

    ప్రభాస్‌ ప్రేయసి ఎవరో తెలిసింది

    [VIDEO](url):ప్రభాస్‌ పెళ్లి టాపిక్‌ వస్తే చాలు నిత్యం ఎన్నో పుకార్లు పుట్టుకొస్తుంటాయి. అయితే తాజాగా బాలివుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ ప్రభాస్ లవ్‌స్టోరీపై దాదాపుగా క్లారిటీ ఇచ్చాడు. ఓ టీవీ చానల్‌ కార్యక్రమంలో వరుణ్‌ ధావన్‌ హీరోయిన్ కృతి సనన్‌ గురించి మాట్లాడుతూ వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ‘ కృతి పేరు ఒకరి మనసులో ఉంది. అతడు ఇప్పుడు ముంబయిలో లేడు. దీపికా పదుకునేతో షూటింగ్‌లో ఉన్నాడు’ అంటూ వరుణ్‌ ధావన్‌ అన్నాడు. దీంతో ప్రస్తుతం ప్రాజెక్ట్‌K … Read more