బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్ పుష్ప చిత్రాన్ని రష్యన్ లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే డిసెంబర్ 8న విడుదలకు ముహుర్తం ఖరారయ్యింది. కేవలం వారం మాత్రమే సమయం ఉండటంతో ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రైలర్ కట్ చేయకుండా…మన దగ్గర రిలీజ్ చేసిన దానికి రష్యన్ లో డబ్బింగ్ చెప్పారు. భారీ అంచనాలతో వచ్చిన పుష్ప ట్రెండ్ సెట్ చేసింది. అల్లు అర్జున్ మ్యానరిజమ్ అన్నిచోట్లకు పాకింది.