• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nabha Natesh Hot: పైట పక్కకు జరిపేసి.. అన్నింటికి తెగించిన నభా నటేష్‌!
    Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    See More

    ముదురుతున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ వివాదం‌

    ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) చైర్మన్ నడవ్ లపిడ్ ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదొక ప్రాపగాండ అని, వల్గర్ మూవీ అని వ్యాఖ్యానించారు. దీనిపై దేశవ్యాప్తంగా నడవ్‌పై విమర్శలు చెలరేగుతున్నాయి. తాజాగా ఇజ్రెయెల్ రాయబారి నౌర్ గిలాన్.. నడవ్‌ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే రకమైన సమస్య ఎదుర్కొంటున్న రెండు దేశాల సారూప్యాన్ని కూడా నడవ్ గుర్తించలేకపోయాడని మండిపడ్డారు. నీ [వ్యాఖ్యలు](url) సిగ్గు చేటని ఆగ్రహించారు. Calling this as a vulgar … Read more

    అభిమానుల ప్రేమకు దాసుడిని; చిరంజీవి

    అభిమానుల ప్రేమకు తాను దాసుడినని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 [అవార్డు ](url)అందుకున్నారు. ‘‘ ఈ క్షణం కోసం దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్నా. అవార్డు ఇచ్చినందుకు ఇఫీ, ప్రభుత్వానికి కృతజ్ణతలు. 45 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నా. పాలిటిక్స్ వల్ల గ్యాప్ వచ్చింది. అయినా అభిమానులు నన్ను ఆదిరించారు. వారి ప్రేమకు దాసుడిని’’ అంటూ చిరు పేర్కొన్నారు. Chiranjeevi garu thanked fans and Narendra … Read more

    మీ అభిమానం గొప్పది: మహేశ్ బాబు

    నాన్న తనకెంతో ఇచ్చారని, అన్నింటికన్నా గొప్పది ఫ్యాన్స్ అభిమానమని మహేశ్ బాబు వెల్లడించారు. సూపర్ స్టార్ కృష్ణ పరమదించి 13రోజులు పూర్తయిన నేపథ్యంలో వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. ‘నాన్నెంతో ఇచ్చారు. వాటిల్లో గొప్పనైనది మీ అభిమానం. ఆయనకు ఎంతో రుణపడి ఉంటాను. మీ అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. నాన్న మన గుండెల్లోనే ఉంటారు. మన మధ్యే ఉంటారు’ అని మహేశ్‌బాబు చెప్పారు. మళ్లీ జన్మలో కూడా ఆయన అల్లుడిగానే పుట్టాలని నటుడు సుధీర్ బాబు ఎమోషనల్ … Read more

    ప్రభాస్‌ ప్రేయసి ఎవరో తెలిసింది

    [VIDEO](url):ప్రభాస్‌ పెళ్లి టాపిక్‌ వస్తే చాలు నిత్యం ఎన్నో పుకార్లు పుట్టుకొస్తుంటాయి. అయితే తాజాగా బాలివుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ ప్రభాస్ లవ్‌స్టోరీపై దాదాపుగా క్లారిటీ ఇచ్చాడు. ఓ టీవీ చానల్‌ కార్యక్రమంలో వరుణ్‌ ధావన్‌ హీరోయిన్ కృతి సనన్‌ గురించి మాట్లాడుతూ వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ‘ కృతి పేరు ఒకరి మనసులో ఉంది. అతడు ఇప్పుడు ముంబయిలో లేడు. దీపికా పదుకునేతో షూటింగ్‌లో ఉన్నాడు’ అంటూ వరుణ్‌ ధావన్‌ అన్నాడు. దీంతో ప్రస్తుతం ప్రాజెక్ట్‌K … Read more

    గ్రీస్ వీధుల్లో హన్సిక రచ్చ రచ్చ

    హీరోయిన్ హన్సిక మొత్వానీ బ్యాచ్‌లర్ పార్టీతో తెగ ఎంజాయ్ చేస్తోంది. గ్రీస్ వీధుల్లో తన స్నేహితురాళ్లతో కలసి రచ్చ రచ్చ చేస్తోంది. తన ఫ్రెండ్స్‌తో డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన [వీడియో](url)ను హన్సిక తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతోపాటు ‘‘బెస్ట్ బ్యాచిలరేట్ ఎవర్’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కాగా హన్సిక వ్యాపారవేత్త సోహెల్ కతూరియాను వివాహం చేసుకోబోతోంది. డిసెంబర్ 4న వీరి వివాహం జైపూర్ ప్యాలెస్‌లో జరగనుంది. View this post on Instagram A … Read more

    ఆకట్టుకుంటున్న ‘పంచతంత్రం’ ట్రైలర్

    బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పంచతంత్రం’. ఐదు విభిన్న స్టోరీల సమాహారంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. హర్ష పులిపాక దర్శకత్వం వహించారు. ప్రేమ, అనుబంధాల కలబోతతో ముడిపడిన జీవితాలను ప్రస్ఫుటం చేసేలా ఉన్న ఈ ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. శ్రావణ్ భరద్వాజ్, ప్రశాంత్ విహారీ ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ చిత్రం డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టికెట్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది.

    మహిళలు బట్టలు లేకున్నా బాగుంటారు: రామ్‌దేవ్‌ బాబా

    [VIDEO](url): ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మహారాష్ట్రలోని ఠానేలో నిర్వహించిన యోగా సైన్స్‌ క్యాంప్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ‘‘మహిళలు చీరల్లో బాగుంటారు. సల్వార్‌ సూట్స్‌లోనూ అందంగా ఉంటారు. నా కంటికైతే వారేం ధరించకపోయినా అందంగానే ఉంటారు.లోకం కోసం మనం బట్టలు వేసుకుంటున్నాం. నేనైతే పదేళ్ల వయసు దాకా నగ్నంగానే తిరిగేవాణ్ని’’ అని వ్యాఖ్యానించారు.డిప్యూటీ సీఎం భార్య అమృతా ఫడనవీస్‌ సమక్షంలోనే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం … Read more

    ధమాకా నుంచి మరో పాట విడుదల

    రవితేజ హీరోగా డ్యుయల్ రోల్‌లో వస్తున్న చిత్రం ‘ధమాకా’. త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘డు..డు..వీడు ల్యాండుమైను లెక్క’ అంటూ సాగే ఈ పాటను పృథ్వీ చంద్ర ఆలపించారు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు. కాగా, ఈ సినిమాలోని మిగతా పాటలకు కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. డిసెంబరు 23న మూవీ రిలీజ్ కానుంది.

    నేను బాగానే ఉన్నాను: ఉపేంద్ర

    సామాజిక మాధ్యమాల్లో తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని నటడు ఉపేంద్ర తెలిపారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని వెల్లడించారు. ఇందుకు సంబంధించి యూఐ సినిమా సెట్లోని ఓ [వీడియో](url)ను షేర్ చేశారు. షూటింగ్ లో ఎక్కువగా దుమ్ము రావటం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవ్వటంతో ఆస్పత్రికి వెళ్లి వచ్చినట్లు వెల్లడించారు. అందువల్లే తాను శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడినట్లు..చిత్రబృందం ఆస్పత్రిలో చేర్చినట్లు వార్తలు వచ్చాయని వెల్లడించారు. Amidst rumours that Kannada actor #Upendra has been hospitalized … Read more

    ఫుల్ ఎనర్జిటిక్‌గా ‘జై బాలయ్య’ సాంగ్

    నటసింహం నందమూరి బాలక్రిష్ణ హీరోగా తెరకెక్కిన వీరశివారెడ్డి చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. ‘జై బాలయ్య’ పాటను మూవీ మేకర్స్ విడుదల చేశారు. హీరో పాత్రను తెలియజేసేలా ఈ సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ పాటకు థమన్ సంగీత స్వరాలు సమకూర్చారు. కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఫ్యాక్షన్, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు.