యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా చేసింది. నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాలతో శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు తొలిరోజు డివైడ్ టాక్ వచ్చింది. సినిమాలోని కామెడీ, సెంటీమెంట్ సీన్లను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీని ప్రభావం.. డే1, ఓవర్సీస్ తొలిరోజు కలెక్షన్లపై పడిందా? లేదా? ఈ కథనంలో చూద్దాం.
లోయెస్ట్ కలెక్షన్స్!
మిక్స్‌డ్ టాక్ ఎఫెక్ట్.. ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star Day 1 Collections) కలెక్షన్స్ పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.10.60 కోట్ల గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకంటిచాయి. భారత్‌లో రూ. 6.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.5.4 కోట్లు, తమిళనాడు రూ.30 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.20 లక్షలు రాబట్టినట్లు వివరించాయి. దీంతో విజయ్ దేవరకొండ కెరీర్‌లో అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ‘ఫ్యామిలీ స్టార్’ నిలిచింది. విజయ్ గత చిత్రం ‘ఖుషి’.. తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.16 కోట్ల గ్రాస్ సాధించడం గమనార్హం.
ఓవర్సీస్‌లో దూకుడు!
లోకల్‌గా ‘ఫ్యామిలీ స్టార్’ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేనప్పటికీ ఓవర్సీస్‌లో మాత్రం ఈ సినిమా డాలర్ల వేటలో దూసుకెళ్తోంది. ఈ సినిమా ఇప్పటివరకూ 4.75 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా స్వయంగా ప్రకటించారు. ఈ వీకెండ్‌లో మరిన్ని డాలర్లు సాధించే దిశగా ‘ఫ్యామిలీ స్టార్’ పరుగులు పెడుతోంది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
భారీ అంచనాలతో వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం.. గణనీయ సంఖ్యలో ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 34.50 కోట్లు నమోదు చేసింది. తెలంగాణ (నైజాం)లో రూ. 13 కోట్లు, రాయలసీమ (సీడెడ్) రూ. 4.5 కోట్లు, ఏపీలో రూ.17 కోట్లకు థియేట్రికల్ రైట్స్‌ను మేకర్స్ విక్రయించారు. అటు కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ రూ. 3 కోట్లు, ఓవర్సీస్ రూ. 5.5 కోట్లతో కలిపి మెుత్తంగా ఈ సినిమా రూ.43 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఫలితంగా ఫ్యామిలీ స్టార్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.44 కోట్లకు చేరింది. ప్రస్తుత డే1 కలెక్షన్స్ బట్టి చూస్తే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాగా శ్రమించాల్సి ఉంది.
‘ఫ్యామిలీ స్టార్’.. కథేంటి
గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) మధ్య తరగతి యువకుడు. కుటుంబానికి దూరంగా వెళ్లడం ఇష్టం లేక హైదరాబాద్‌లోనే పనిచేస్తుంటాడు. కుటుంబ బాధ్యతలను మోస్తూ చాలి చాలని జీతంతో నెట్టుకొస్తుంటాడు. ఇలా సాగుతున్న అతడి జీవితంలోకి ఓ రోజు ఇందు (మృణాల్ ఠాకూర్) వస్తుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇంతలో ఊహించని విధంగా ఇందు రాసిన ఓ పుస్తకం గోవర్ధన్ చేతికందుతుంది. ఇంతకీ ఆ పుస్తకంలో ఏం ఉంది? అది వారి ప్రేమను ఎలా ప్రభావితం చేసింది? అసలు ఇందు ఎవరు? గోవర్ధన్ తన కుటుంబ కష్టాల నుంచి గట్టెక్కాడా లేదా? అన్నది కథ.