Family Star Weekend Collections: ‘ఫ్యామిలీ స్టార్’ వీకెండ్‌ కలెక్షన్స్‌.. ఓవర్సీస్‌లో డాలర్ల వర్షం!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Family Star Weekend Collections: ‘ఫ్యామిలీ స్టార్’ వీకెండ్‌ కలెక్షన్స్‌.. ఓవర్సీస్‌లో డాలర్ల వర్షం!

    Family Star Weekend Collections: ‘ఫ్యామిలీ స్టార్’ వీకెండ్‌ కలెక్షన్స్‌.. ఓవర్సీస్‌లో డాలర్ల వర్షం!

    April 8, 2024

    విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) – మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star). పరుశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు (Dil Raju) నిర్మించిన ఈ చిత్రం గత శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే మిక్స్‌డ్‌ టాక్ రావడంతో తొలి రోజు కలెక్షన్స్‌ దారుణంగా పడిపోయాయి. విజయ్‌ కెరీర్‌లోనే అతి తక్కువ డే 1 కలెక్షన్స్ ఈ సినిమాకే వచ్చాయని ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. మరి వీకెండ్‌కైనా ఈ మూవీ కలెక్షన్లలో పురోగతి వచ్చిందా? శుక్ర, శని, ఆది వారాల్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది?

    వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?

    ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం ఈ వీకెండ్‌ ముగిసే సరికి భారత్‌లో రూ.11.95 కోట్ల నెట్‌ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. తొలి రోజున ఈ చిత్రం రూ.5.75 కోట్లు, రెండో రోజు రూ.3.2 కోట్లు, మూడో రోజు రూ. 3 కోట్ల నెట్‌ వసూళ్లను రాబట్టినట్లు ప్రకటించాయి. దీన్ని బట్టి ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రంపై వస్తోన్న ట్రోల్స్, నెగిటివ్‌ ప్రచారం.. ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. 

    ఓవర్సీస్‌లో డాలర్ల వర్షం

    అయితే ఓవర్సీస్‌లో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం 5లక్షలకు పైగా డాలర్లను వసూలు చేసింది. ఎన్‌ఆర్‌ఐ ఆడియన్స్‌ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రానున్న రోజుల్లో ఓవర్సీస్‌ కలెక్షన్లు మరింత పెరుగుతాయని మేకర్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

    ప్రీ-రిలీజ్‌ బిజినెస్ ఎంతంటే?

    భారీ అంచనాలతో వస్తోన్న ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం.. గణనీయ సంఖ్యలో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు అమ్ముడుపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 34.50 కోట్లు నమోదు చేసింది. తెలంగాణ (నైజాం)లో రూ. 13 కోట్లు, రాయలసీమ (సీడెడ్) రూ. 4.5 కోట్లు, ఏపీలో రూ.17 కోట్లకు థియేట్రికల్‌ రైట్స్‌ను మేకర్స్ విక్రయించారు. అటు కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ రూ. 3 కోట్లు, ఓవర్సీస్ రూ. 5.5 కోట్లతో కలిపి మెుత్తంగా ఈ సినిమా రూ.43 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఫలితంగా ఫ్యామిలీ స్టార్‌ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.44 కోట్లకు చేరింది. ప్రస్తుత కలెక్షన్లు బట్టి చూస్తే ఈ సినిమా లాభాల్లోకి రావడం కష్టమే.

    కథేంటి?

    గోవ‌ర్ధ‌న్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు. కుటుంబానికి దూరంగా వెళ్ల‌డం ఇష్టం లేక హైద‌రాబాద్‌లోనే ప‌నిచేస్తుంటాడు. కుటుంబ బాధ్యతలను మోస్తూ చాలి చాలని జీతంతో నెట్టుకొస్తుంటాడు. ఇలా సాగుతున్న అతడి జీవితంలోకి ఓ రోజు ఇందు (మృణాల్ ఠాకూర్‌) వ‌స్తుంది. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డతారు. ఇంత‌లో ఊహించ‌ని విధంగా ఇందు రాసిన ఓ పుస్తకం గోవ‌ర్ధ‌న్ చేతికందుతుంది. ఇంత‌కీ ఆ పుస్త‌కంలో ఏం ఉంది? అది వారి ప్రేమను ఎలా ప్ర‌భావితం చేసింది? అస‌లు ఇందు ఎవ‌రు? గోవ‌ర్ధ‌న్ తన కుటుంబ క‌ష్టాల నుంచి గట్టెక్కాడా లేదా? అన్నది కథ. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version