• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Flipkart Big Diwali Sale 2023: ఈసారి ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు.. ఈ బ్యాంక్ కార్డులు ఉన్నవారికి పండగే!

    ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిఫ్‌ కార్ట్ మరో బిగ్‌ సెల్‌తో ముందుకొచ్చింది. బిగ్‌ బిలియన్‌ డెస్‌ తర్వాత మళ్లీ ఇప్పుడు బిగ్ దీవాళి సేల్‌తో( Flipkart Big Diwali Sale ) లైటనింగ్ డీల్స్ తీసుకొచ్చింది. ఈ సేల్ నవంబర్ 2 నుంచి నవంబర్ 11 వరకు కొనసాగనుంది. ఇప్పటికే తన ప్రధాన పోటీదారు అమెజాన్  గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫైనల్‌ సేల్‌ను నిర్వహిస్తుండగా.. దానికి పోటీగా ఫ్లిఫ్‌కార్ట్ తాజా సేల్‌తో ముందుకొచ్చింది. తొమ్మిది రోజుల పాటు జరగనున్న ఈ సేల్‌లో ఫ్యాషన్, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ధరలను డిస్కౌంట్‌కు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసింది. 

    మిడ్ నైట్‌ నుంచే స్టార్ట్..

    ఫ్లిఫ్‌కార్ట్ ప్రకటించిన బిగ్‌ దీపావళి సేల్(Big Diwali Sale Offers) నవంబర్ 2 నంచి 11 వరకు కొనసాగుతున్నప్పటికీ.. ఫ్లిఫ్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు ఒకరోజు ముందే అంటే నవంబర్ 1 మిడ్‌ నైట్‌ నుంచే అన్ని ఆఫర్స్‌ అందుబాటులోకి రానున్నాయి. lR ఈ దివాళి సేల్‌లో SBI తన కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. SBI క్రెడిట్ కార్డ్‌/డెబిట్‌ కార్డుని ఉపయోగించి కొనుగోలు చేసే ఉత్పత్తులపై 10శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ అందిస్తోంది.

    ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు

    ఈ మెగా సేల్‌లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్లు అయితే లభిస్తున్నాయి.  ఈమేరకు ఫ్లిఫ్‌కార్ట్ ఓ ల్యాండింగ్ పేజ్‌ను విడుదల చేసింది. ఇందులో తక్కువ ధరలకే లభ్యమయ్యే అనేక రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫ్యాషన్ ఉత్పత్తులను ప్రదర్శించింది. ఈ సేల్‌లో రియల్‌మీ ట్యాబ్లెట్ ధర కేవలం రూ. 7,999కే లభిస్తుండగా… Canon, HP, Epson వంటి బ్రాండ్‌ ప్రింటర్‌లు రూ. 2,299* వద్ద ప్రారంభం అవుతున్నాయి. శామ్‌సంగ్ ఫ్రిడ్జ్‌లు రూ.9,790*ధరకే లభించనున్నట్లు ల్యాండింగ్ పేజ్‌లో తెలిపింది. ఇక మొబైల్, కంప్యూటర్ యాక్సెరీస్ రూ.99 లభించనున్నాయి. అటు దీపావళి ఫేస్టివల్ ట్రీట్ కింద స్వీట్స్, గులాబ్ జామ్స్, మిక్చర్, లడ్డూలు వంటి తినుబండారాలపై కూడా 65శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది.

    ఫ్యాషన్ సేల్‌లో ప్రీమియం వాచ్‌లపై మినిమం 50శాతం డిస్కౌంట్ అందిస్తుండగా.. అలెన్ సోలీ, ఇండియన్ టెరైన్, USPA టీషర్ట్ బ్రాండ్లపై 60శాతం వరకు డిస్కౌంట్ దొరుకుతోంది. ఇక బ్రాండెడ్ షూస్ వుడ్‌ల్యాండ్, ప్యూమా, అడిడాస్, నైకీ షూస్‌పై 50%-80% వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

    ఐఫోన్లపై ఆఫర్లు( Big Diwali Sale- Offers On Iphones))

    మరోవైపు బిగ్ దీపావళి సేల్‌లోనూ iPhone 14,  iPhone 13, iPhone 12 మోడళ్లపై డిస్కౌంట్లు కొనసాగనున్నాయి.  రూ.49,999 ధరకే ఐఫోన్ 14 మోడల్ లభించనుంది. ఒకసారి సేల్ ప్రారంభమయ్యాక మిగతా ఐఫోన్ వేరియంట్ ధరలు రివీల్ కానున్నాయి.

    స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్‌లు, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో పాటు  Flipkart రాబోయే సేల్‌లో Sony, Nikon, Canon బ్రాండ్  డిజిటల్ కెమెరాలపై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ కెమెరాల ధరలు రూ. 49,390 వద్ద ప్రారంభం కానున్నాయి.

    ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో మైక్రోవేవ్, ఫిలిప్స్ ఓవెన్-టోస్టర్-గ్రిల్ (OTG) ఓవెన్‌లు, రిఫ్రిజిరేటర్‌లు,  పానాసోనిక్ AC,  రిఫ్రిజిరేటర్‌లు, వాటర్ ప్యూరిఫైయర్స్‌ వంటి గృహోపకరణాలపై కూడా డిస్కౌంట్‌లను అందిస్తుంది. అయితే వీటి ధరలు మాత్రం ఇంకా అప్‌డేట్ చేయలేదు.

    NOTE: పైన పేర్కొన్న కొన్ని వస్తువుల ధరలు ఆఫర్స్‌తో కలిపి ఉన్నాయన్న వాస్తవాన్ని పాఠకులు గమనించాలి.  సేల్ ప్రారంభమయ్యాక డిమాండ్‌ను బట్టి ధరల వ్యత్యాసంలో హెచ్చుతగ్గులుంటాయి. ముందు మీ బ్యాంకు కార్డు ద్వారా డిస్కౌంట్ ఉందో లేదో తెలుసుకుంటే మంచిది.  ఫ్లిఫ్‌కార్ట్‌లో కొన్ని ప్రొడక్ట్స్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ ఉండటం వల్ల అవి మరింత తక్కువ ధరకు లభించే అవకాశం ఉంటుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv