‘RRR’ తర్వాత రామ్ చరణ్ (Ram Charan) నుంచి వస్తోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). అగ్ర దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో తెలుగు నిర్మాత దిల్‌రాజు నిర్మించిన చిత్రమిది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్స్‌పై చిత్ర బృందం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా టీజర్ రిలీజ్ తేదీని చిత్ర బృందం లాక్ చేసింది. యూపీలో టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఉండగా నార్త్‌లోనే టీజర్ లాంచ్ ఈవెంట్ ఎందుకు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే దీని వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది.
టీజర్ ఎప్పుడంటే?
రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. మరో హీరోయిన్ అంజలి కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్ అయ్యింది. నవంబర్ 9న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ జరగనున్నట్లు వెల్లడించారు.
లక్నోలోనే ఎందుకు?
గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను తొలుత హైదరాబాద్‌లోనే నిర్వహించాలని మూవీ టీమ్ భావించింది. కానీ ఇక్కడ పరిస్థితులు, అనుమతులు అనుకూలించకపోవడంతో వేదికను లక్నోకి మార్చినట్లు సమాచారం. గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ ఎంతో అవసరం. ఇందులో భాగంగా తొలి అధికారిక ఈవెంట్‌నే నార్త్‌లో నిర్వహిస్తే అక్కడి ప్రజలకు మరింత చేరువ కావొచ్చని మూవీ టీమ్ భావిస్తోంది. అంతేకాదు టీజర్ రిలీజైనప్పటి నుంచి రెండు వారాలకు ఒకసారి ఏదోక అప్‌డేట్ ఇస్తూ గేమ్ ఛేంజర్ గురించి చర్చ జరిగేలా ప్లాన్ చేస్తోంది. మరోవైపు ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మరి టీజర్‌లో అతడి రెండు పాత్రల లుక్స్‌ను రివీల్ చేస్తారో లేదో చూడాలి.
ఇదే తొలి చిత్రం!
తమిళ అగ్ర దర్శకుడు శంకర్ ఇప్పటివరకూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తీశారు. ‘జెంటిల్‌మెన్’, ‘ప్రేమికుడు’, ‘భారతీయుడు’, ‘జీన్స్’, ‘ఒకే ఒక్కడు’, ‘బాయ్స్’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’, ‘రోబో’ వంటి బ్లాక్ బాస్టర్స్‌తో తమిళంతో పాటు తెలుగులోనూ ఎంతో పాపులర్ అయ్యారు. అయితే అవన్నీ తెలుగులో డబ్ అయిన చిత్రాలు. ‘గేమ్ ఛేంజర్’ మాత్రమే శంకర్‌కు తొలి డైరెక్ట్ తెలుగు ఫిల్మ్. అంతేకాదు రామ్‌చరణ్‌తో కూడా తొలిసారి ఆయన వర్క్ చేశారు. కెరీర్‌లో ఇప్పటివరకూ సందేశాత్మక చిత్రాలనే రూపొందించిన శంకర్ ‘గేమ్ ఛేంజర్’ను కూడా అదే ప్యాట్రన్‌లో రూపొందించారు. ఆ కాన్సెప్ట్ ఏంటో తెలిసేలా ఓ థీమ్‌తో టీజర్‌ను కట్ చేసినట్లు తెలుస్తోంది. మరి టీజర్ ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తుందో చూడాలి.
ఆ ఫైట్ సినిమాకే హైలెట్!
ఇటీవల టీజర్ సూన్ అంటూ గేమ్ ఛేంజర్ టీమ్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అందులో చరణ్ ఓ టేబుల్ ముందు కుర్చీ వేసుకొని కూర్చోవడం, అతన్ని చంపడానికి పెద్ద సంఖ్యలో రౌడీలు అతడి వైపు దూసుకురావడం ఆసక్తిరేపింది. అయితే ఇది ‘గేమ్ ఛేంజర్’ ఇంట్రడక్షన్ సీన్ అని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ‘RRR’ తరహాలో గూస్‌బంప్స్ తెప్పించేలా ఈ మాబ్ ఫైట్ ఉంటుందని సమాచారం. ఇది సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని మూవీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫైట్ అయిపోయాక చరణ్ హెలికాఫ్టర్ ఎక్కి వెళ్తాడట. ఆ వెంటనే ‘రా మచ్చ మచ్చ’ సాంగ్ వస్తుందని చెబుతున్నారు.
రికార్డు బిజినెస్?
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరగనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఏకంగా రూ.150 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. ఆంధ్రా నుంచి రూ. 70 కోట్లు, సీడెడ్ నుంచి రూ.25 కోట్లు, నైజాం ఏరియా నుంచి రూ. 55 కోట్ల మేర బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి. ‘గేమ్‌ఛేంజర్’ను డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించినప్పుడు ఇంత బిజినెస్ జరిగే అవకాశం కనిపించలేదట. అయితే ఈ మూవీ రిలీజ్ సంక్రాంతికి వాయిదా పడటంతో బిజినెస్ రేంజ్ అమాంతం పెరిగిపోయినట్లు ఫిల్మ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Celebrities Featured Articles Telugu Movies
Prabhas Upcoming Movies: ఇండియాలోని టాప్ డైరెక్టర్స్‌తో ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!