కేరళ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు!
మీలో పడవ ఇళ్లు ( HouseBoat)ల గురించి ఎంతమందికి తెలుసు. ఇంటిలా రూపుదిద్దిన పడవలో ప్రకృతి అందాలను చూస్తూ అలా విహరించడం ఎంత సరాదాగా ఉంటుంటో కదా!
మన దేశంలో బోట్‌హౌజ్ అంటే గుర్తొచ్చేది కేరళనే. కేరళకు టూరిజంకు వెళ్లిన వారికి, వెళ్లాలనుకునేవారికి వీటి గురించి బాగా తెలుసు.
అలెప్పి ఈ బోట్‌హౌజ్‌కు బాగా పాపులర్. చాలామంది కేరళకు వెళ్లిన వారు ఈ బోట్‌హౌజ్‌లలోనే విడిది కోరుకుంటారు.
వారమంతా ఆఫీస్‌లో బిజి బిజీ షెడ్యూల్‌తో ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారికి అలా బోట్‌హౌజ్‌లో విహరించడం సాంత్వన కలిగించేదే. కానీ వారంలో దొరికే ఒకట్రెండు రోజుల్లో కేరళ వెళ్లాల్సిన అవసరమేం లేదు
హైదరాబాద్‌కు సమీపంలోనే బోట్‌హౌజ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే ప్లేస్ ఉంది. అనంతగిరి హిల్స్‌కు సమీపంలో ఉన్న Wilderness Resort ఈ అవకాశాన్ని కల్పిస్తోంది.
హైదరాబాద్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ రిసార్ట్‌లో అలెప్పీ తరహా హౌజ్‌బోట్ అనుభవాన్ని అందిస్తూ.. కాంక్రీట్ జంగిల్‌లో మగ్గిపోయే ఉద్యోగులకు ప్రకృతి పరవశాన్ని కలిగిస్తోంది.
బెడ్‌రూం, వరండా, చిన్న వ్యూ పాయింట్‌తో వైల్డర్‌నెస్ రిసార్ట్‌లో ఉండే హౌజ్‌బోట్‌లో టీవీ, సోఫా, బెడ్ ఇలా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. జంటగా వెళ్లినా చాలా ప్రశాంతంగా గడపొచ్చు.
వారాంతాల్లో ఒక జంటకు రూ.20వేలకు పైగా ఉంటుంది. శని, ఆదివారాలు మినహా ఇతర రోజుల్లో రూ.18వేల వరకూ ఉంటుంది.
వీకెండ్‌లో సరదాగా ఎంజాయ్ చేయాలనుకుంటే +91 93922 86675కు కాల్ చేసి రిసార్ట్ వారిని సంప్రదించవచ్చు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం