టాలీవుడ్‌లో కొత్త సినిమాలకు సంబంధించిన ట్రైలర్, టీజర్లు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. ముఖ్యంగా యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్ సాధించి అదరగొడుతుంటాయి. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన ‘కన్నప్ప’ (Kannappa), ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) టీజర్లు.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. తద్వారా సినిమాపై ఇప్పటి నుంచే భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.
కన్నప్ప దూకుడు..!
మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా అతడి స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa Movie). విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా పేరొందిన ఈ చిత్రాన్ని.. మహాభారతం సీరియల్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. గ్రాండ్ విజువల్స్‌తో టీజర్ ఎంతో రిచ్‌గా సాగింది. దీంతో కన్నప్ప టీజర్‌కు యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ టీజర్.. ఇప్పటివరకూ 17 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు చిత్ర యూనిట్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ముంచు విష్ణు యాక్షన్ లుక్‌లో కనిపించాడు.
రిలీజ్ ఎప్పుడంటే
ప్రస్తుతం కన్నప్ప షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), అక్షయ్ కుమార్ (Akshay Kumar), మోహన్‌లాల్ (Mohan Lal), శివరాజ్ కుమార్ (Siva Raj Kumar), మోహన్ బాబు (Mohan Babu), శరత్ కుమార్ (Sarath Kumar) వంటి దిగ్గజ నటులు నటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma), స్టీఫెన్ దేవసి సంగీతం అందిస్తున్నారు. కాగా, కన్నప్పను డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
మిస్టర్ బచ్చన్ ‘షో రీల్’.. అదరహో!
రవితేజ (Ravi Teja) హీరోగా మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) రూపొందిస్తున్న లేటెస్ట్ చిత్రం.. ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఇందులో కథానాయికగా చేస్తోంది. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ప్రచారంలో భాగంగా చిత్రయూనిట్.. ‘షో రీల్స్’ను సోమవారం (జూన్ 17) విడుదల చేసింది. ఒక్క డైలాగ్ లేకుండా యాక్షన్ సన్నివేశాలతో తీర్చిదిద్దిన ఈ గ్లింప్స్ వీడియో ఎంతో ఆసక్తిగా సాగింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ దిశగా దూసుకెళ్తోంది. విడుదలైన 22 గంటల్లో 7.4 లక్షల వ్యూస్ సాధించి అదరగొడుతోంది.
దేవిశ్రీ ప్రసాద్ ప్రశంసలు
మిస్టర్ బచ్చన్ నుంచి విడుదలైన మాస్ గ్లింప్స్.. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. మిస్టర్ బచ్చన్ గ్లింప్స్‌పై ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వావ్ హరీష్ శంకర్ సార్.. పంచ్ డైలాగ్ లేకుండానే పంచ్ క్రియేట్ చేశారు. మాస్ మహారాజా అద్భుతంగా ఉన్నారు. బ్లాక్ బాస్టర్ లోడ్ అవుతోంది. థియేటర్‌లో చూడటానికి ఆగలేకపోతున్నా. మిస్టర్ బచ్చన్ చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్షలు’ అంటూ స్పెషల్ పోస్టు పెట్టారు. కాగా, మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్