మాజీ సీఎం బర్త్ డే..6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం

Screengrab Twitter:

పూణె-బెంగళూరు జాతీయ రహదారిపై 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ధరామయ్య 75వ పుట్టినరోజు వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల సమక్షంలో అర్ధరాత్రి హుబ్లీలోని ఓ ప్రైవేట్ హోటల్లో కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. షామనూరు ప్యాలెస్ గ్రౌండ్‌లో సిద్దరామోత్సవ వేడుకల నేపథ్యంలో భారీ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఈ క్రమంలో దాదాపు 10 లక్షల మంది తరలివస్తున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version