• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Kitchen Items: మీ వంటగదిని మోడ్రన్‌ లుక్‌లోకి మార్చే టాప్‌ 15 వస్తువులు..!

  మన ఇళ్లల్లో ఎక్కువగా ప్రయోగాలకు నోచుకోని గది ఏదైన ఉందంటే అది కిచెన్‌ ఒకటే. దాదాపుగా 80 శాతం కిచెన్లు అన్ని ఒకేలా ఉంటాయి. ఈ హైటెక్ యుగంలోనూ చాలా ముంది మహిళలు ఇప్పటికీ సంప్రదాయ వంట సామాగ్రినే ఉపయోగిస్తున్నారు. వాటి ప్లేస్‌లో అధునిక వస్తువులను రీప్లేస్‌ చేయాలని కొందరు స్త్రీలకు ఉన్నప్పటికీ ఏవి కొనాలో తెలియక వెనకడుగు వేస్తుంటారు. అటువంటి వారి కోసం YouSay ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. మీ వంటగదికి మోడ్రన్‌ లుక్‌ను తీసుకొచ్చే టాప్‌-15 కిచెన్‌ ఐటెమ్స్‌ను మీ ముందుకు తెచ్చింది. ఇవి శ్రమను తగ్గించడంతో పాటు కాలాన్ని ఆదా చేస్తాయి. అవేంటో ఓ లుక్కేయండి. 

  1. XML Kitchen Tap

  ప్రతీ కిచెన్‌లో సింక్‌ అనేది సార్వసాధారణం. అయితే సింక్‌ పైపు నుంచి వచ్చే నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే మహిళలు ఇబ్బంది పడే ఛాన్స్‌ ఉంది. ఈ నేపథ్యంలో XML Kitchen Tapను వాటర్‌ పైపుకు ఫిక్స్‌ చేయడం ద్వారా ఆ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. ఇది నీటిని స్ప్రే రూపంలో పడేలా చేస్తుంది. అమెజాన్‌లో ఇది రూ.89 అందుబాటులో ఉంది.

  2. Stainless Steel Cheese Grater 

  ఇది మహిళల శ్రమను తగ్గిస్తుంది. Stainless Steel Cheese Grater సాయంతో చీజ్‌, అల్లం, క్యారెట్‌, బంగాళదుంప, క్యారెట్‌, బీట్‌రుట్‌ తదితర వస్తువులను ఎంతో తేలిగ్గా తురుము పట్టవచ్చు. అమెజాన్‌లో దీని ప్రైస్‌ రూ.79.

  3. Silicone Baking Mat Roti

  సాధారణంగా చపాతీలను చెక్కలాంటి దానిపై పెట్టి మహిళలు చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో పిండి చెక్కకు అతుక్కుపోతుంటుంది. ఈ సమస్యకు Silicone Baking Mat Roti ద్వారా చెక్‌ పెట్టవచ్చు. దీనిపై చపాతీలు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. దీనిపై ఉన్న సర్కిల్స్‌ ద్వారా మీకు చపాతీ ఏ సైజులో కావాలో నిర్ధారించుకోవచ్చు. అమెజాన్‌లో ఇది రూ.298లకు లభిస్తోంది.

  4. Butterfly Premium Vegetable Chopper

  సాధారణంగా కిచెన్‌లో ఉల్లిపాయలు తరగడమనేది పెద్ద టాస్క్‌గా ఉంటుంది. అది కోసేటప్పుడు కళ్లు మండటమే దీనికి కారణం. ఈ సమస్య నుంచి Butterfly Premium Vegetable Chopper ద్వారా బయటపడవచ్చు. దీని ద్వారా ఈజీగా ఉల్లిపాయలను కట్‌ చేయవచ్చు. అమెజాన్‌లో ఇది రూ.299లకు అందుబాటులో ఉంది. 

  5. Snack Bag Pouch Clip Sealer

  ఇవి ఓపెన్‌ చేసిన ఆహార ప్యాకెట్లను సీల్‌ చేసేందుకు ఉపయోగపడతాయి. దీని వల్ల పదార్థాలపై ఈగలు, దోమలు, క్రిమికీటకాలు వాలకుండా ఉంటాయి. మెుత్తం మూడు సైజుల్లో 18 క్లిప్‌ల సెటప్‌తో ఇది వస్తుంది. అమెజాన్‌లో దీని ప్రైస్ రూ.99.

  6. Tosmy Stainless Steel 

  చాలా మంది ఫేవరేట్‌ డిషెస్‌లో పావ్‌భాజీ కచ్చితంగా ఉంటుంది. అటువంటి పావ్‌భాజీని ఇంట్లోనే చేసుకోవాడానికి Tosmy Stainless Steel ఉపయోగపడుతుంది. ఉడికించిన బంగాళదుంపను మెత్తగా చేసేందుకు దీన్ని వినియోగిస్తారు. అమెజాన్‌లో ఇది రూ.100 లభిస్తోంది. 

  7. Ice Cube Tray Silicone for Freezer

  ప్రతీ ఇంట్లోనూ ఐస్‌క్యూబ్స్‌ అవసరం ఉంటుంది. జ్యూస్‌లు చేసుకున్న సమయంలో వీటి వాడకం మరి ఎక్కువగా ఉంటుంది. ఐస్‌ క్యూబ్స్‌ను ఎక్కువగా ఉపయోగించేవారు Ice Cube Tray Silicone for Freezer ట్రై చేయవచ్చు. అమెజాన్‌లో ఇది రూ.99లకే లభిస్తోంది. 

  8. Vegetable Peeler Steel

  దీని సాయంతో కూరగాయాల తోలును తేలిగ్గా తీయవచ్చు. బంగాళదుంప, బీరకాయ, కీరదోస వంటి పదార్థాల తొక్కను ఈజీగా తొలగించవచ్చు. ‌అమెజాన్‌లో ఇది రూ.149కు అందుబాటులో ఉంది.

  9. Soup & Juice Strainer 

  జ్యూస్‌లను వడగట్టేందుకు Soup & Juice Strainer ఉపయోగపడుతుంది. ఇది పండ్లలోని పీచు పదార్థాలను తొలగించి జ్యూస్‌ను సెపరేట్‌ చేస్తుంది. అమెజాన్‌లో ఇది రూ.189 లభిస్తోంది.

  10. Bamboo Wood Chopping Cutting Board

  కొంతమంది మహిళలు వెజిటేబుల్స్‌ను ప్లేటు లేదా పేపర్‌పై పెట్టుకొని కట్‌ చేస్తుంటారు. అటువంటి వారు ‘Bamboo Wood Chopping Cutting Board’ ట్రై చేయవచ్చు. దీని ప్రైస్‌ రూ.499.

  11. Coconut Scraper for Kitchen

  చాలా మంది మహిళలు కొబ్బరిని తరిగేందుకు తెగ ఇబ్బంది పడుతుంటారు. ‌అటువంటి వారికి  Coconut Scraper గొప్ప ఉపశమనం అని చెప్పవచ్చు. దీని సాయంతో కొబ్బరిని చాలా తెలిగ్గా తరగవచ్చు. తద్వారా మసాలాలు, కొబ్బరి లౌజ్‌ చేసుకోవచ్చు. అమెజాన్‌లో ఇది రూ.279కు లభిస్తోంది. 

  12. Multipurpose Chopper

  అన్ని రకాల వెజిటేబుల్స్‌ను తరిగే ఆల్‌ ఇన్‌ వన్‌ సెట్‌ కోరుకునే వారు Multipurpose Chopper ట్రై చేయవచ్చు. దీని సాయంతో కోరుకున్న విధంగా వెజిటేబుల్‌ను తరగవచ్చు. అమెజాన్‌లో ఇది రూ.700కు లభిస్తోంది. 

  13. Dry Fruit Cutter and Slicer

  దీని ద్వారా డ్రైఫ్రూట్స్‌ను క్షణాల్లో పొడి చేయవచ్చు. బాదం, జీడిపప్పులను ఇది చిటికెలో పొడి చేసేస్తుంది. అమెజాన్‌లో ఇది రూ.349లకు అందుబాటులో ఉంది. 

  14. Steel Measuring Cups & Spoon 

  వంటకు అవసరమైన నాలుగు మెజరింగ్‌ కప్స్‌, నాలుగు రకాల స్పూన్ల సెటప్‌తో ఇది వస్తుంది. స్మాల్‌, మీడియం, బిగ్‌ సైజుల్లో ఇవి రానున్నాయి. అమెజాన్‌లో దీని ప్రైస్‌ రూ.297.

  15. Natural & Traditional Grinder

  ఇద్దరు లేదా ముగ్గురు ఉండే కుటుంబాలకు కొద్ది మెుత్తంలోనే మసాలాలు అవసరమవుతాయి. ఇటువంటి సందర్భాల్లో Natural & Traditional Grinder ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రాయితో చేసిన చిన్నపాటి రోలు, రోకలి. దీని ద్వారా తేలిగ్గా మసాలాలను దంచుకోవచ్చు. అమెజాన్‌లో ఇది రూ.595 లభిస్తోంది. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv