దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. హీరోయిన్గా కరీనా కపూర్, ఓ కీలక పాత్రలో నాగచైతన్య నటించారు. 1994లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఇక సినిమా స్టోరీ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
కథ
లాల్ సింగ్ చడ్డా(అమీర్ ఖాన్) వెన్నుముక లోపం కారణంగా కాళ్లు కోల్పోయి కర్రల సాయంతో నడుస్తాడు. కానీ తన తల్లి(మోనా సింగ్) కుమారుడి లోపాన్ని మరచిపోయేలా చేస్తుంది. మోటీవేట్ చేస్తు నువ్వు ఏదైనా సాధించగలవని ప్రతి సారి ప్రోత్సహిస్తుంది. ఆ క్రమంలో చడ్డాను స్కూళ్లో చేర్పించేందుకు ప్రయత్నంచగా మొదట నిరాకరిస్తారు. స్కూళ్లో చేరిన తర్వాత రూప(కరీనా కపూర్) పరిచయం అవుతుంది. ఓ సందర్భంలో రూప పరిగెత్తమని అనగా చడ్డా స్పీడుగా రన్నింగ్ చేస్తాడు. ఆ తర్వాత స్పోర్ట్ లో రాణిస్తాడు. క్రమంగా ఆర్మీలోకి వెళ్తాడు. అక్కడ బాలరాజు (నాగచైతన్య)తో పరిచయం ఏర్పడుతుంది. లాల్ సింగ్ ఆర్మీలో ఎలా ఆఫీసర్ గా ఎలా మారాడు? అక్కడ వారు ఎదుర్కొన్న పరిస్థితులు ఎంటి? మళ్లీ ఆర్మీ నుంచి ఎందుకు వస్తాడనేది సినిమాలో చూడాల్సిందే.
నటీనటులు
అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డాలో తనదైన మెథడ్ యాక్టింగ్‌ని మరోసారి అద్భుతంగా ప్రదర్శించాడు. రిమేక్ మూవీ అయినా అమీర్ తన పాత్రకు ప్రాణం పోసి హృదయానికి హత్తుకునేలా యాక్ట్ చేశాడు. అమీర్ ఖాన్ ఈ సినిమాలో అనేక గెటప్స్ లలో కనిపించేందుకు చాలా కష్టపడ్డాడని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ కరీనా కపూర్ రూప క్యారెక్టర్లో జీవించింది. అమీర్, కరీనా కెమిస్ట్రీ సినిమాలో చాలా బాగా పండింది. తెలుగు హీరో నాగచైతన్య కూడా బాలరాజు పాత్రతో ఆకట్టుకున్నాడు. తన క్యారెక్టర్లో సింపుల్ గా కనపించాడు. అమీర్ తల్లి పాత్రలో మోనా సింగ్ సహా మిగతా నటీనటులు తమ పాత్రల మేరకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు
దర్శకుడు అద్వైత్ చందన్ లాల్ సింగ్ చడ్డాలో అసలు కథకు కొన్ని మార్పులు చేశాడు. మూలం దెబ్బతినకుండా సృజనాత్మకంగా ప్రేక్షకులకు ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. రచయిత అతుల్ కులకర్ణికి కూడా అద్భుతమైన డైలాగ్స్ రాశారు. మరోవైపు ప్రీతమ్ తన మ్యూజిక్ తో అదరగొట్టాడు. కొన్ని సీన్లలో సినిమాటోగ్రఫీ పనితీరు బాగుంది.
బలాలు:
అమీర్ ఖాన్ యాక్టింగ్
ఎమోషనల్ సీన్స్
నాగచైతన్య, అమీర్ సీన్స్
సంగీతం
బలహీనతలు:
తెలిసిన కథ
కొంచెం ల్యాగ్
చివరిగా..
మొత్తంగా లాల్ సింగ్ చడ్డా రిమేక్ సినిమాలా అనిపించకుండా నటీనటులు అద్భుతమైన యాక్టింగ్ చేశాడు. సినిమాలో ఏదైనా నెగెటివ్ ఉందంటే అది అమీర్ ఖాన్ కారణంగా వస్తున్న వ్యతిరేకతే. వరుస ఫ్లాప్ సినిమాలతో డీలా పడిన బాలీవుడ్‌కు ఈ చిత్రం ఊపిరినిస్తుందని చెప్పవచ్చు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!