• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Lava O2 Mobile: లావా నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్ ఇవే!

    ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ తయారీ సంస్థ ‘లావా’ (Lava).. త్వరలో అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ‘లావా ఓ2’ (Lava O2 Smartphone) పేరుతో ఈ ఫోన్‌ను భారత మార్కెట్‌లో రిలీజ్‌ చేయనున్నట్లు ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. అలాగే ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను సైతం లావా నెట్టింట పోస్టు చేసింది. లాంచింగ్ అనంతరం ఈ ఫోన్‌.. ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్ వేదికగా సేల్స్‌లోకి రానున్నాయి. ఇదిలా ఉంటే అమెజాన్‌ వెబ్‌ పేజీ ద్వారా ఈ ‘లావా ఓ2’కు సంబంధించిన కొన్ని ఫీచర్ వివరాలు వెల్లడయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

    మెుబైల్‌ స్క్రీన్‌

    ఈ లావా మెుబైల్‌ 6.5 అంగుళాల FHD+ స్క్రీన్‌తో రాబోతోంది. దీనికి 120Hz రిఫ్రెష్‌ రేట్‌ అందించారు. దీంతోపాటు ముందువైపు పంచ్‌ హోల్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. వెనుకవైపు AG గ్లాస్‌తో ఈ ఫోన్‌ లాంచ్‌ కానుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత Lava O2 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, octa-core Unisoc T616 ప్రొసెసర్‌పై ఈ ఫోన్‌ పని చేయనుంది. 

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    Lava O2 స్మార్ట్‌ఫోన్.. 8GB LPDDR4x RAM / 128GB UFS 2.2 స్టోరేజ్‌తో రానున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఫోన్‌ లాంచింగ్ అనంతరం ఇతర స్టోరేజ్ ఆప్షన్లపై స్పష్టత రానుంది. ఇక మెుబైల్‌లో స్టోరేజ్‌ను మరింత పెంచుకునేందుకు microSD కార్డును కూడా వినియోగించవచ్చు. దీని పరిమితిపై కూాడా త్వరలో స్పష్టత వస్తుంది. 

    బ్యాటరీ

    ఈ లావా స్మార్ట్‌ ఫోన్‌ శక్తివంతమైన బ్యాటరీ సెటప్‌తో భారతీయ మార్కెట్‌లో అడుగుపెట్టబోతోంది. 18W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది వేగంగా మెుబైల్‌ను ఛార్జ్‌ చేసుకునేందుకు దోహదం చేస్తుంది. మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను కూడా అందిస్తుందని లావా వర్గాలు చెబుతున్నాయి.

     

    కెమెరా

    ఈ Lava O2 మెుబైల్‌.. డ్యుయల్ రియర్‌ కెమెరా సెటప్‌తో రాబోతున్నట్లు కంపెనీ రిలీజ్‌ చేసిన టీజర్‌ను బట్టి తెలుస్తోంది. 50MP ప్రైమరీ కెమెరాను ఫోన్‌కు అందించారు. అలాగే ముందు వైపు సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను ఫిక్స్ చేశారు. ఇవి క్వాలిటీ ఫొటోస్‌, వీడియో కాల్స్‌, వీడియో రికార్డింగ్స్‌కు సపోర్ట్‌ చేస్తాయని లావా వర్గాలు పేర్కొన్నాయి.

    కలర్‌ ఆప్షన్స్‌

    ప్రస్తుతానికి Lava O2 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఒక కలర్‌ వేరియంట్‌ కన్ఫార్మ్‌ అయ్యింది. ఈ ఫోన్‌ మెజిస్టిక్‌ పర్పుల్‌ రంగులో లాంచ్‌ కానుంది. మిగిలిన కలర్ ఆప్షన్స్‌పై త్వరలోనే లావా వర్గాలు క్లారిటీ ఇవ్వనున్నాయి. 

    ధర ఎంతంటే?

    Lava O2 మెుబైల్‌ ఈ నెలాఖరులో లేదా ఏప్రిల్‌ మెుదటి వారంలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశముంది. ఆ రోజునే మెుబైల్‌ ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది. ఈ మెుబైల్‌ రూ.15,000ల లోపు ధర కలిగి ఉండొచ్చని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv