సినిమాల్లో లిప్‌లాక్ సీన్లకు ఎంతో క్రేజ్ ఉంటుంది. ఒక పాత్ర మరో పాత్రపై ఉన్న ప్రేమను వ్యక్తం చేసే క్రమంలో ఈ ముద్దు సన్నివేశాలు వస్తుంటాయి. అయితే ఒకప్పుడు లిప్‌లాక్ సీన్ అంటే ఒక సెన్సేషన్. కానీ ప్రస్తుత సినిమాల్లో అవి కామన్‌గా మారిపోయాయి. కథ, సిట్చ్యూయేషన్ డిమాండ్ చేస్తే లిప్ లాక్ సీన్లకు రెడీ అంటూ పలువురు స్టార్ హీరోయిన్స్ బహిరంగంగానే ప్రకటించారు. ఆ మాటలకు కట్టుబడి ముద్దు సన్నివేశాల్లో నటించారు కూడా. టాలీవుడ్‌లో ముద్దు సీన్లలో నటించిన స్టార్ హీరోయిన్స్ ఎవరు? ఏ సినిమాల్లో చేశారు? ఇప్పుడు చూద్దాం.
Contents
- 1 సమంత (Samantha)
- 2 కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)
- 3 నయనతార (Nayanthara)
- 4 రష్మిక మందన్న (Rashmika Mandanna)
- 5 నేహా శెట్టి (Neha Shetty)
- 6 రుహానీ శర్మ (Ruhani Sharma)
- 7 కేతిక శర్మ (Ketika Sharma)
- 8 డింపుల్ హయాతి (Dimple Hayathi)
- 9 మాళవిక మోహన్ (Malavika Mohanan)
- 10 తృప్తి దిమ్రి (Tripti Dimri)
- 11 పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput)
- 12 వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)
- 13 కావ్యా థాపర్ (Kavya Thapar)
- 14 అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran)
- 15 షాలిని పాండే (Shalini Pandey)
- 16 శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala)
- 17 మానసా చౌదరి (Maanasa Chowdary)
సమంత (Samantha)
‘ఏమాయ చేశావే’ చిత్రంతో నటి సమంత హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అందులో నాగచైతన్య ప్రేయసి పాత్రలో ఆమె అద్భుతమైన నటన కనబరిచింది. వీరిద్దరి మధ్య వచ్చే కిస్ సీన్స్ అప్పట్లో యూత్‌ను కట్టిపడేశాయి. ముఖ్యంగా చైతు, సమంత మధ్య వచ్చే ట్రైన్ సీన్‌లో వారిద్దరు లిప్‌కిస్‌లతో రెచ్చిపోయారు. ఇటీవల విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషీ’ చిత్రంలోనూ సమంత లిప్‌లాక్ సీన్‌లో నటించింది.
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)
మహేష్ బాబుతో కాజల్ ఓ లిప్‌లాక్ సీన్ చేసింది. ‘బిజినెస్ మ్యాన్’ చిత్రంలోని ‘చందమామ నవ్వే’ సాంగ్‌లో కాజల్ పెదాలపై మహేష్ కిస్ చేస్తాడు. ఈ సీన్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలోనూ మహేష్‌తో ఓ లిప్‌లాక్ సీన్ కాజల్ చేసింది. అలాగే ‘ఆర్య 2’లో బన్నీతో కలిసి లిఫ్ట్‌లో ముద్దుసీనులో నటించింది.
నయనతార (Nayanthara)
‘వల్లభ’ చిత్రంలో నటుడు శింభుతో కలిసి నయనతార రెచ్చిపోయింది. లిప్‌కిస్ సీన్లను ఏ మాత్రం బెరుకు లేకుండా చేసింది. అప్పట్లో వారిద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె ముద్దు సీన్లలో మెుహమాటపడలేదని సమాచారం.
రష్మిక మందన్న (Rashmika Mandanna)
నేషనల్ క్రష్ రష్మిక మందన్న సైతం రెండు చిత్రాల్లో అదర చుంబనం చేసింది. డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్ దేవరకొండతో ముద్దు సీన్లలో నటించింది. అలాగే ఇటీవల వచ్చిన ‘యానిమల్’ చిత్రంలో రణ్‌బీర్ కపూర్‌తో రెచ్చిపోయింది.
నేహా శెట్టి (Neha Shetty)
యంగ్ బ్యూటీ నేహా శెట్టి డీజే టిల్లు చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి కొన్ని రొమాంటిక్ సీన్స్ చేసింది. ముఖ్యంగా ఓ పాట చివర్లో సిద్ధూకు డీప్ కిస్ ఇచ్చి మతి పోగొట్టింది. అలాగే ఇటీవల వచ్చిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంలోని ఓ పాటలో విశ్వక్ సేన్ పెదాలను తాకిస్తూ ముద్దు పెట్టింది.
రుహానీ శర్మ (Ruhani Sharma)
‘ఆగ్రా’ మూవీలో రుహానీ శర్మ కొన్ని శృంగార సన్నివేశాల్లో మితిమీరిపోయి నటించింది. రొమాన్స్ చేస్తూ, హావభావాల చూపిస్తూ పచ్చిగా కనిపించింది. తెలుగు సినిమాల్లో పద్దతిగా నటించిన రుహానీని అగ్రా చిత్రంలో అలా చూసి సినీ లవర్స్ షాకయ్యారు. అలాగే ‘దిల్‌సే దిల్’ వీడియో సాంగ్‌లోనూ లిప్‌లాక్ సీన్‌లో ఆమె కనిపించింది. థియేటర్‌లో వచ్చే ముద్దు సీనులో ఆమె నటించింది.
కేతిక శర్మ (Ketika Sharma)
యంగ్ బ్యూటీ కేతిక శర్మ తన ఫస్ట్ ఫిల్మ్ ‘రొమాంటిక్’ మూవీలో ముద్దు సీన్లతో మైమరపించింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరితో బస్‌లో ముద్దుల ప్రయాణం చేసింది. అలాగే ‘రంగ రంగ వైభవంగా’ మూవీలో పంజా వైష్ణవ్ తేజ్‌తోనూ లిప్‌లాక్ సీన్‌లో నటించింది.
డింపుల్ హయాతి (Dimple Hayathi)
విశాల్‌తో చేసిన ‘సామాన్యుడు’ చిత్రంలో హీరోయిన్ డింపుల్ హయాతి లిప్‌లాక్ సీన్‌లో చేసింది. థియేటర్‌లో హీరో విశాల్ పెదాలపై ఎంతో క్యూట్‌గా ముద్దు పెట్టింది. అలాగే రవితేజ ‘కిలాడీ’ సినిమాలో బికినీలో కనిపించడంతో పాటు ఘాటు ముద్దు సీన్లు సైతం చేసింది.
మాళవిక మోహన్ (Malavika Mohanan)
మలయాళ నటి మాళవిక మోహన్ ‘యుధ్రా’ సినిమాతో ఇటీవల బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. హీరో సిద్ధాంత్ ఛతుర్వేదితో కలిసి బోల్డ్ సీన్స్‌లో నటించింది. గతంలో ఈ స్థాయి రొమాన్స్ మాళవిక చేయలేదు. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ సీన్‌లో ముద్దులతో విరుచుకుపడింది.
తృప్తి దిమ్రి (Tripti Dimri)
బాలీవుడ్ భామ తృప్తి దిమ్రీ పేరు ‘యానిమల్’ చిత్రంతో ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఇందులో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ఆమె ఇంటిమేట్ సీన్‌లో నటించింది. ఘాటైన లిప్‌లాక్‌తో కవ్వించింది. అలాగే ఇటీవల హిందీలో వచ్చిన ‘బ్యాడ్ న్యూస్’ సినిమాలోనూ నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి ఆమె లిప్‌లాక్ సీన్ చేసింది.
పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput)
‘RX100’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ అందులో హీరో కార్తికేయతో రొమాంటిక్ సీన్స్ చేసింది. లిప్‌లాక్ ముద్దులతో అతడ్ని ముంచెత్తింది. ‘RDX లవ్’ అనే మరో సినిమాలోనూ కుర్ర హీరోతో తన పెదాలను పంచుకుంది.
యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య ‘బేబీ’ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో ఆమె పలు రొమాంటిక్ సీన్స్‌లో నటించింది. నటుడు విరాజ్‌తో కలిసి పబ్‌లో లిప్‌లాక్ సీన్ చేసింది. అలాగే ఇంటిమేట్ సీన్‌లోనూ కనిపించి హార్ట్ బీట్‌ను అమాంతం పెంచేసింది.
కావ్యా థాపర్ (Kavya Thapar)
గ్లామర్ బ్యూటీ కావ్యా థాపర్ కుర్ర హీరో సంతోష్ శోభన్‌తో కలిసి లిప్‌లాక్ సీన్ చేసింది. ‘ఏక్ మినీ కథ’ చిత్రంలోని ఓ సాంగ్‌లో ఘాటైన రొమాన్స్ చేసింది.
అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran)
ఒకప్పుడు ట్రెడిషనల్ పాత్రలతో ఆకట్టుకున్న అనుపమా పరమేశ్వరన్ ఈ మధ్య కాలంలో రొమాంటిక్ సీన్స్‌కు పెద్ద పీట వేస్తోంది. యూత్‌ను ఆకర్షించే క్రమంలో ‘రౌడీ బాయ్స్’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాల్లో రెచ్చిపోయింది. హీరోలను ముద్దులతో ముంచెత్తింది.
షాలిని పాండే (Shalini Pandey)
అర్జున్ రెడ్డి చిత్రంతో నటి షాలిని పాండే టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇందులో విజయ్ దేవరకొండతో కలిసి మల్టిపుల్ లిప్ లాక్ సీన్స్ చేసింది.
శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala)
ప్రముఖ హీరోయిన్ శోభితా దూళిపాళ్ల కూడా పలు లిప్‌లాక్ సీన్లలో నటించింది. ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్‌సిరీస్‌లో బోల్డ్ సీన్స్‌లో రచ్చ రచ్చ చేసింది. అలాగే ‘మంకీ మ్యాన్’ అనే హాలీవుడ్ మూవీలోనూ ఈ అమ్మడు ముద్దు సీన్లలో నటించింది. టాలీవుడ్ నటుడు నాగ చైతన్యతో శోభితాకు నిశ్చితార్థం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.
మానసా చౌదరి (Maanasa Chowdary)
రోషన్ కనకాల హీరోగా పరిచయమైన ‘బబుల్ గమ్‘ చిత్రంలో మానస చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సీన్స్ కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఒక్క సాంగ్‌లోనే ఏకంగా 14 లిప్ లాక్స్ ఉన్నాయి.